📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

2026 టీజీ హాలిడేస్ లిస్ట్ విడుదల హైదరాబాద్‌లో 24 గంటలు తాగునీరు సరఫరా హైదరాబాద్ కు రానున్న 3 డేటా సెంటర్లు హైదరాబాద్ లో రియల్టర్ హత్య కలకలం మల్లారెడ్డిపై కవిత తీవ్ర విమర్శలు హైదరాబాద్ లో రియల్టర్ హత్య కలకలం ఆలస్యంగా వచ్చే ఉపాధ్యాయులకు షాక్! రామగుండం థర్మల్ మూసివేత సివిల్స్ అభ్యర్థులకు ఆర్థిక ప్రోత్సాహం రూ.531కోట్ల తో.. నర్సంపేటలో అభివృద్ధి 2026 టీజీ హాలిడేస్ లిస్ట్ విడుదల హైదరాబాద్‌లో 24 గంటలు తాగునీరు సరఫరా హైదరాబాద్ కు రానున్న 3 డేటా సెంటర్లు హైదరాబాద్ లో రియల్టర్ హత్య కలకలం మల్లారెడ్డిపై కవిత తీవ్ర విమర్శలు హైదరాబాద్ లో రియల్టర్ హత్య కలకలం ఆలస్యంగా వచ్చే ఉపాధ్యాయులకు షాక్! రామగుండం థర్మల్ మూసివేత సివిల్స్ అభ్యర్థులకు ఆర్థిక ప్రోత్సాహం రూ.531కోట్ల తో.. నర్సంపేటలో అభివృద్ధి

Latest News: Global Summit: రైతుల ఉత్పత్తులు పెంచడానికి ఎఐ, డీప్ టెక్ సాంకేతికత

Author Icon By Saritha
Updated: December 10, 2025 • 11:57 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క

హైదరాబాద్ : పెట్టుబడులకు(Global Summit) ఆవిష్కరణలు తోడైతే 3 ట్రిలియన్ డాలర్ ఎకానమీ సాధ్యమవుతుందని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క(Bhatti Vikramarka) అన్నారు. రైతుల ఉత్పత్తులు పెంచుకునేందుకు ఏఐ, డీప్ టెక్ వంటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంను ఉపయోగించనున్నట్టు తెలిపారు. గ్లోబల్ సమ్మిట్లో భాగంగా మంగళవారం ఏర్పాటుచేసిన క్యాపిటల్ అండ్ ప్రోడక్టివిటీ ఫర్ త్రీ ట్రిలియన్ డాలర్ ఎకానమీ చర్చా గోష్టిలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. రాబోయే 22 ఏళ్లలో నిర్దేశించుకున్న లక్ష్యాన్ని చేరుకోవాలంటే ప్రస్తుతం ఉన్న అంచనాల ప్రకారం లెక్కిస్తే 16 రెట్లు ఆర్థిక వృద్ధిని సాధిం చాల్సి ఉంటుందన్నారు. తాము తెలంగాణ రైజింగ్-2047’ను ఆవిష్కరించామని, ఇది కేవలం ఒక పత్రం కాదని, ఇది తెలంగాణ భవిష్యత్తుకి అన్నారు. 2047 నాటికి తెలంగాణను 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా పెట్టుబడులకు ఆవిష్కరణలు తోడైతే 3 ట్రిలియన్ ఎకానమీ సాధ్యం ప్రొడక్టివిటీ ఫర్ త్రీ ట్రిలియన్ ఎకానమీ చర్చా గోష్టిలో డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క నిలపడం అనే మహత్తర లక్ష్యాన్ని నిర్ణయించు కున్నామన్నారు. ఎక్కువగా పనిచేస్తేనే 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థను చేరుకోలేమని, మరిన్ని రోడ్లు, పెద్ద సంఖ్యలో భవనాలు నిర్మిస్తే సరిపోదన్నారు.

Read also: మార్చి 14 నుంచి టెన్త్ పరీక్షలు

Global Summit AI, Deep Tech Technology to Increase Farmers’ Productivity

‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ నుండి ‘ఈజ్ ఆఫ్ ఇన్నోవేటింగ్

ఈ విప్లవాత్మక వృద్ధిని సాధించాలంటే,(Global Summit) మన ఆర్థిక వ్యవస్థ యొక్క ప్రాథమిక సమీకరణాన్ని మార్చాల్సిందేనని డిప్యూటీ సీఎం స్పష్టం చేశారు. ప్రపంచం చాలా వేగంగా మారింది, డీప్క్, ఏఐ, క్వాంటమ్ కంప్యూటింగ్ యుగంలో ‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ అనేది కేవలం కనీస అర్హత, అని అది ఒక బేస్లైన్ మాత్రమేనని అన్నారు. ఆసియాలో ఇన్నోవేషన్ క్యాపిటల్ కావాలంటే, ‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ నుండి ‘ఈజ్ ఆఫ్ ఇన్నోవేటింగ్’ వైపు సాగాలన్నారు. మన విజన్ డాక్యుమెంట్ క్యూర్(అర్బన్), ప్యూర్ (పెరిఅర్బన్), రేర్ (రూరల్) అనే స్పేషియల్ స్ట్రాటజీని ప్రతిపాదించామన్నారు. ఇంటర్నెట్ నుండి స్పేస్ ట్రావెల్ వరకుఅత్యంత పెద్ద బ్రేక్ థ్రూలు దశాబ్దాల పాటు లాభం లేకపోయినా, ఎవరైనా ఒక రిస్క్ తీసుకున్నప్పుడు మాత్రమే సాధ్యమయ్యాయి అని ప్రపంచ చరిత్ర చెబుతుందని డిప్యూటీ సీఎం తెలిపారు. రెగ్యులేటర్గా కాకుండా, రిస్క్ ను పంచుకునే ‘క్యాటలిస్ట్’గా మారడానికి సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు.

రూరల్ ఇన్నోవేషన్, రైతుల సమస్యలకు డీప్‌టెక్ పరిష్కారాలు

ప్రజల కోసం రివార్డులు పొందే భాగస్వామిగా మారడానికి సిద్ధంగా ఉన్నామ న్నారు. ఉత్పాదకత వర్సెస్ ఉద్యోగాలు అనే పరస్పర విరుద్ధ భావ ఉత్పాదకత పెరుగుదల అంటే ఆటోమేషన్ వల్ల ఉద్యోగాలు తగ్గిపోతా యనే భయం ఉందన్నారు. దీన్ని ఎలా ఎదుర్కొం టామని ప్రశ్నించారు. ఇన్నోవేషనన్ను ప్రోత్సహిం చడంలో ప్రభుత్వ పాత్రఏమిటి? తాము ‘సోమూ వింగ్’ వ్యవస్థగా విమర్శలు ఎదుర్కొంటున్నామ న్నారు. అసలు ప్రభుత్వం దూరం గా ఉండాలా? లేక ఇన్నోవేషన్లో భాగస్వామి కావాలా? అనేది ప్రశ్నగా మారిందన్నారు. ఏఐ, డీప్క్ అంటే మనం ఎక్కువగా సాఫ్ట్వేరు మాత్రమే ఊహిస్తా మని, కానీ మన విజన్లో రేర్(రూరల్) జోన్కు ముఖ్యస్థానం ఉందన్నారు. డీప్క్ సైబరాబాద్లోనే కాకుండా, వరంగల్, నిజామాబాద్ రైతుల ఉత్పాదకత పెంచే ‘బోరింగ్ ప్రాబ్లమ్స్’ను కూడా ఎలా పరిష్కరించేలా చేసుకోవాలి? ఈ రంగాల్లో క్యాపిటల్ను ఎలా ఆకర్షించాలి? అన్న అంశాలపై దృష్టి పెట్టాలని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క సూచించారు. చర్చా గోష్టి లో సెంటర్ ఫర్ ఎనలైటికల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ప్రసన్న తంత్రి, యువ పారిశ్రామికవేత్త పరశురాం, ట్రాన్స్ కో సిఎండి కృష్ణ భాస్కర్ పాల్గొన్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read also:

Artificial intelligence DeepTech Ease of Innovating Economic Growth innovation Latest News in Telugu Mallu Bhatti Vikramarka Rural Development Telangana economy Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.