📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

2026 టీజీ హాలిడేస్ లిస్ట్ విడుదల హైదరాబాద్‌లో 24 గంటలు తాగునీరు సరఫరా హైదరాబాద్ కు రానున్న 3 డేటా సెంటర్లు హైదరాబాద్ లో రియల్టర్ హత్య కలకలం మల్లారెడ్డిపై కవిత తీవ్ర విమర్శలు హైదరాబాద్ లో రియల్టర్ హత్య కలకలం ఆలస్యంగా వచ్చే ఉపాధ్యాయులకు షాక్! రామగుండం థర్మల్ మూసివేత సివిల్స్ అభ్యర్థులకు ఆర్థిక ప్రోత్సాహం రూ.531కోట్ల తో.. నర్సంపేటలో అభివృద్ధి 2026 టీజీ హాలిడేస్ లిస్ట్ విడుదల హైదరాబాద్‌లో 24 గంటలు తాగునీరు సరఫరా హైదరాబాద్ కు రానున్న 3 డేటా సెంటర్లు హైదరాబాద్ లో రియల్టర్ హత్య కలకలం మల్లారెడ్డిపై కవిత తీవ్ర విమర్శలు హైదరాబాద్ లో రియల్టర్ హత్య కలకలం ఆలస్యంగా వచ్చే ఉపాధ్యాయులకు షాక్! రామగుండం థర్మల్ మూసివేత సివిల్స్ అభ్యర్థులకు ఆర్థిక ప్రోత్సాహం రూ.531కోట్ల తో.. నర్సంపేటలో అభివృద్ధి

Latest News: Global Summit 2025: రెండు రోజుల్లో రూ. 5.75 లక్షల కోట్ల పెట్టుబడులు

Author Icon By Anusha
Updated: December 10, 2025 • 11:21 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ప్యూచర్ సిటీలో జరిగిన తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌ (Global Summit 2025) లో భారీ పెట్టుబడులు పెట్టేందుకు పలు సంస్థలు ముందుకొచ్చాయి. ‘తెలంగాణ రైజింగ్‌ గ్లోబల్‌ సమ్మిట్‌’ (Global Summit 2025) పెట్టుబడుల విషయంలో రికార్డు సృష్టించింది. రెండు రోజుల పాటు జరిగిన ఈ సదస్సులో ఏకంగా రూ. 5,75,000 కోట్ల విలువైన పెట్టుబడులకు సంబంధించిన అవగాహన ఒప్పందాలు (ఎంవోయూలు) కుదిరాయి.

Read Also: TG: రాష్ట్రంలో మరింత పెరిగిన చలితీవ్రత

ఇందులో మొదటి రోజున రూ. 3,97,500 కోట్ల ఒప్పందాలు కుదరగా.. రెండో రోజు (డిసెంబర్ 9న) రూ. 1,77,500 కోట్ల ఒప్పందాలు జరిగాయి. 2047 నాటికి తెలంగాణను 3 ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో నిర్వహించిన ఈ సదస్సు విజయవంతమైందని రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది.

ఈ భారీ పెట్టుబడులు ఐటీ, డేటా సెంటర్లు, పర్యాటకం, విద్యుత్, క్రీడలు, అటవీ వంటి కీలక రంగాల్లో లభించాయి.పెట్టుబడుల విషయంలో డేటా సెంటర్లు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. ముఖ్యంగా ఇన్‌ఫ్రాకీ డీసీ పార్క్స్‌ సంస్థ ఏకంగా రూ. 70 వేల కోట్లు పెట్టుబడి పెట్టడానికి ఎంవోయూ చేసుకుంది.

Global Summit 2025: Rs. 5.75 lakh crore investments in two days

దాదాపు 2 వేల మందికి ఉద్యోగావకాశాలు

ఇది 150 ఎకరాల విస్తీర్ణంలో 1 గిగావాట్‌ సామర్థ్యం కలిగిన, ఏఐకి సిద్ధంగా ఉండే డేటా పార్క్‌ను ఏర్పాటు చేస్తుంది. అలాగే జేసీకే ఇన్‌ఫ్రా సంస్థ రూ. 9 వేల కోట్లతో డేటా సెంటర్ల సదుపాయాలను విస్తరించడానికి రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది.

ఈ ప్రాజెక్టుల ద్వారా దాదాపు 2 వేల మందికి ఉద్యోగావకాశాలు లభించనున్నాయి. పర్యాటక రంగంలో కూడా గణనీయమైన పెట్టుబడులు వచ్చాయి. మంగళవారం ఒక్కరోజే పర్యాటక రంగంలో రూ. 7,045 కోట్ల పెట్టుబడులపై ఒప్పందాలు జరిగాయి. వీటి ద్వారా ప్రత్యక్షంగా 10 వేల మందికి, పరోక్షంగా 30 వేల మందికి ఉపాధి లభించనుంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

Future City Global Summit 2025 latest news Telangana Investments Telangana Rising Global Summit Telugu News TS-iPASS

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.