📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

Telugu News: Girish Kumar Sanghi:మెరుగైన సేవల్లో అగ్రసేన్ బ్యాంక్ మేటి

Author Icon By Sushmitha
Updated: October 27, 2025 • 10:44 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

హైదరాబాద్ (మాదాపూర్): అగ్రసేన్ కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంకు లిమిటెడ్ తన 11వ నూతన బ్రాంచ్‌ను హైటెక్ సిటీ పరిధిలోని మాదాపూర్, విఠల్రావునగర్‌లో ప్రారంభించింది. రాజ్యసభ మాజీ సభ్యుడు, ‘వార్త’ సీఎండీ గిరీష్ కుమార్ సంఘీ ఆదివారం ముఖ్య అతిథిగా హాజరై ఈ నూతన బ్రాంచ్‌ను ప్రారంభించారు. బ్యాంకులోని స్ట్రాంగ్‌రూమ్, సేఫ్ డిపాజిట్ లాకర్ సౌకర్యాన్ని తెలంగాణ(Telangana) సీనియర్ న్యాయవాది పి. రఘురాం ప్రారంభించారు. పారిశ్రామికవేత్త చంద్రకాంత్ అగర్వాల్, సీనియర్ న్యాయవాది దుష్యంత్రెడ్డి ఇతర బ్యాంకింగ్ సౌకర్యాలను ప్రారంభించారు.

Read Also:  Sachin Sanghvi: బాలీవుడ్ సింగర్‌పై మహిళా గాయని ఫిర్యాదు

విస్తరణ, మెరుగైన సేవలకు సూచన

ఈ సందర్భంగా గిరీష్ కుమార్ సంఘీ(Girish Kumar Sanghi) మాట్లాడుతూ, నేటి సమాజంలో బ్యాంకింగ్ సేవలకు డిమాండ్ పెరిగిందని, ఖాతాదారులకు మెరుగైన సేవలు అందించడంలో అగ్రసేన్ బ్యాంకు(Agrasen Bank) గొప్ప పేరు సంపాదించిందని కొనియాడారు. హైటెక్ సిటీ(Hi-Tech City) పరిధిలోని ఖాతాదారులకు సైతం ఉత్తమ సేవలు అందిస్తుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. అగ్రసేన్ బ్యాంకు రాష్ట్రవ్యాప్తంగా తమ సేవలను విస్తరించేందుకు ప్రయత్నిస్తుండటం శుభపరిణామమని తెలిపారు. బ్యాంకు చైర్మన్ ప్రమోద్ కుమార్ కేడియా ఈ డిమాండ్‌ను తీర్చడంలో ముందున్నారని అన్నారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా బ్యాంకు సేవలను మరింత విస్తరించాలని సూచించారు.

సాంకేతికత వినియోగం, ఇతర ప్రముఖులు

ప్రస్తుతం అందుబాటులో ఉన్న అధునాతన టెక్నాలజీని అగ్రసేన్ బ్యాంకు అందిపుచ్చుకోవాలని, తద్వారా ఖాతాదారులకు మరింత మెరుగైన సేవలు అందించే అవకాశం ఉంటుందని గిరీష్ కుమార్ సంఘీ సూచించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ వైస్ చైర్మన్ సీఏ నవీన్ కుమార్ అగర్వాల్, వైస్ చైర్మన్ సురేష్ కుమార్ అగర్వాల్, బీఎం చైర్మన్ నారాయణ్ దత్, డైరెక్టర్లు, జనరల్ మేనేజర్, డీజీఎంలు, సిబ్బంది పాల్గొన్నారు.

అగ్రసేన్ అర్బన్ బ్యాంక్ కొత్త బ్రాంచ్ ఎక్కడ ప్రారంభమైంది?

హైదరాబాద్‌లోని హైటెక్ సిటీ పరిధిలోని మాదాపూర్, విఠల్రావునగర్‌లో ప్రారంభమైంది.

కొత్త బ్రాంచ్‌ను ఎవరు ప్రారంభించారు?

రాజ్యసభ మాజీ సభ్యుడు, ‘వార్త’ సీఎండీ గిరీష్ కుమార్ సంఘీ ప్రారంభించారు.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

Agrasen Urban Bank banking services Girish Kumar Sanghi. Google News in Telugu hitech city Latest News in Telugu new branch Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.