హైదరాబాద్ : జలమండలి పరిధిని కోర్ అర్బన్ రీజియన్ వరకు పునర్విభజన విస్తరణలో భాగంగా జోన్లుగా సర్కిళ్లు, సర్కిళ్లుగా సబ్ డివిజన్లు, వార్డులుగా సెక్షన్లలతో విభజించడంతో జిహెచ్ఎంసి (GHMC) తరహాలోనే జలమండలి కొత్త రూపు సంతరించుకుంది. ఈ పునర్వ్యవస్థీకరణ భాగంగా పరిపాలన సౌలభ్యం కోసం జలమండ లిని కొత్తగా హైదరాబాద్ (Hyderabad), సైబరాబాద్, మల్కా జిగిరిలుగా మూడు జోన్లు ఏర్పాటు చేశారు. ఓఆర్ఆర్ వరకు వేగంగా విస్తరిస్తున్న తరు ణంలో ఈ ప్రాం తంలో ర్థ్యాన్ని పెంచడం, ్యంగా పౌర సేవలను మెరుగుపరచడం లక్ష ఈ నిర్ణయం తీసుకున్నారు.
Read Also: Shadnagar Ward 15 Tension: కాంగ్రెస్ – బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల మధ్య లొల్లి
జలమండలి ఈడిగా మయాంక్ మిట్టల్ జాయింట్ ఎండిగా నియామకం
ప్రస్తుతం జలమండలి ఈడిగా పని చేస్తున్న మయాంక్ మిట్టలు జాయింట్ ఎండిగా ప్రభుత్వం నియమించింది. (GHMC) కొత్త విభజన ప్రకారం మల్కా జిగిరి జోన్కు పంకజ, హైదరాబాద్ జోన్కు సామ్రాట్ అశోక్, సైబరాబాద్ జోన్కి సంతోష్లను నియ మిస్తున్నట్లు ఉత్వర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో జలమండలిలో జాయింట్ ఎండిగా పదోన్నతి పొందిన మయాంక్ మిట్టల్ బుధవారం రోజున ఖైరతాబాద్లోని జలమండలి ప్రధాన కార్యాలయంలో పదవీ బాధ్యతలు చేపట్టారు. వీరితోపాటు ప్రభుత్వం ముగ్గురు ఈగలు పంకజ, సామ్రాట్ అశోక్, సంతోష్ ను సైతం ఆయా జోన్లలో బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భం గా నూతనంగా బాధ్యతలు చేపట్టిన జాయింట్ ఎండి, ఈడిలు జలమండలి ఎండి అశోక్ రెడ్డిని ఆయన ఛాంబర్లో మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఎండి వారికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పర్సనల్ డైరెక్టర్ మహమ్మద్ అబ్దుల్ ఖాదర్తో పాటు ఇతర ఉన్నతాధికారులు ఉన్నారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also: