Latest News: GHMC: రామానాయుడు, అన్నపూర్ణ స్టూడియోలకు నోటీసులు

Read Time:  1 min
Latest News: GHMC: రామానాయుడు, అన్నపూర్ణ స్టూడియోలకు నోటీసులు
FONT SIZE
GET APP

హైదరాబాద్‌ లో ప్రముఖ సినీ నిర్మాణ సంస్థలైన అన్నపూర్ణ స్టూడియో, రామానాయుడు స్టూడియోలకు జీహెచ్ఎంసీ (GHMC) అధికారులు నోటీసులు జారీ చేశారు. ట్రేడ్ లైసెన్స్ ఫీజు చెల్లింపులో భారీగా పన్ను ఎగవేతకు పాల్పడినట్టు గుర్తించారు. ఏళ్లుగా వ్యాపార విస్తీర్ణాన్ని ఉద్దేశపూర్వకంగా తక్కువగా చూపిస్తూ, మున్సిపల్ కార్పొరేషన్ కు చెల్లించాల్సిన ఫీజులో కోత విధిస్తున్నట్టు అధికారులు తేల్చారు.

Read Also: iBOMMA: రవి కేసును ఫ్రీగా వాదిస్తానన్న లాయర్.. తండ్రి స్పందన?

స్టూడియోలకు నోటీసులు

బల్దియా సర్కిల్-18 అధికారులు ఇటీవల జరిపిన తనిఖీల్లో ఈ అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. అధికారిక లెక్కల ప్రకారం, అన్నపూర్ణ స్టూడియో ఏటా రూ. 11.52 లక్షల ట్రేడ్ లైసెన్స్ ఫీజు చెల్లించాల్సి ఉండగా, కేవలం రూ. 49 వేలు మాత్రమే చెల్లిస్తున్నట్లు తేలింది.

GHMC: Notices to Ramanaidu, Annapurna Studios
GHMC: Notices to Ramanaidu, Annapurna Studios

అదేవిధంగా, రామానాయుడు స్టూడియోస్ చెల్లించాల్సిన రూ. 1.92 లక్షలకు బదులుగా కేవలం రూ. 1,900 మాత్రమే చెల్లిస్తున్నట్టు అధికారులు నిర్ధారించారు.ఈ రెండు స్టూడియోలు తమ వ్యాపార విస్తీర్ణాన్ని వాస్తవం కంటే చాలా తక్కువగా చూపడం వల్లే ఫీజులో ఇంత భారీ వ్యత్యాసం కనిపిస్తోందని అధికారులు వివరించారు.

ఈ పన్ను ఎగవేతను తీవ్రంగా పరిగణించిన జీహెచ్ఎంసీ (GHMC) బకాయిపడ్డ పూర్తి మొత్తాన్ని వెంటనే చెల్లించాలని ఆదేశిస్తూ నోటీసులు పంపింది. వాస్తవ విస్తీర్ణం ఆధారంగా ట్రేడ్ లైసెన్స్‌ను పునరుద్ధరించుకోవాలని కూడా స్పష్టం చేసింది.  

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

Anusha

రచయిత గురించి

Anusha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.