📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త ఈ నెల 22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్ త్వరలో ‘కామన్‌ మొబిలిటీ కార్డులు లక్షకుపైగా రేషన్ కార్డులు రద్దు తొలి విడత పంచాయతీ ఎన్నికలు.. ప్రారంభమైన పోలింగ్ రాష్ట్రంలో మరింత పెరిగిన చలితీవ్రత రెండు రోజుల్లో రూ. 5.75 లక్షల కోట్ల పెట్టుబడులు మార్చి 14 నుంచి టెన్త్ పరీక్షలు 2026 టీజీ హాలిడేస్ లిస్ట్ విడుదల హైదరాబాద్‌లో 24 గంటలు తాగునీరు సరఫరా తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త ఈ నెల 22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్ త్వరలో ‘కామన్‌ మొబిలిటీ కార్డులు లక్షకుపైగా రేషన్ కార్డులు రద్దు తొలి విడత పంచాయతీ ఎన్నికలు.. ప్రారంభమైన పోలింగ్ రాష్ట్రంలో మరింత పెరిగిన చలితీవ్రత రెండు రోజుల్లో రూ. 5.75 లక్షల కోట్ల పెట్టుబడులు మార్చి 14 నుంచి టెన్త్ పరీక్షలు 2026 టీజీ హాలిడేస్ లిస్ట్ విడుదల హైదరాబాద్‌లో 24 గంటలు తాగునీరు సరఫరా

Drugs : గంజాయి,నిందితుల్లో గుబులు

Author Icon By Digital
Updated: April 19, 2025 • 4:35 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తెలంగాణలో గంజాయి, డ్రగ్స్ కేసులపై ఎక్సైజ్ శాఖ తీసుకుంటున్న కఠిన చర్యలు ఇప్పుడు నేరస్థుల్లో గుబులు పుట్టిస్తున్నాయి. గంజాయి, డ్రగ్స్ కేసుల్లో వరుసగా శిక్షలు పడుతుండటంతో నిందితుల్లో భయం పెరుగుతోంది. ముఖ్యంగా మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో ఎక్కువ శిక్షలు నమోదవుతున్నాయి. ఈ ఘటనలు ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి.సాధారణంగా ఎక్సైజ్ శాఖ అంటే మద్యం అమ్మకాలు, అక్రమ మద్యం తయారీపై దృష్టి పెడుతుంది అనే అభిప్రాయం ఉంది. కానీ, ప్రస్తుతం ఎన్ఫోర్స్‌మెంట్, ఎస్టీఎఫ్, డీటీఎఫ్ వంటి ప్రత్యేక టీమ్లను ఏర్పాటుచేసి గంజాయి, డ్రగ్స్, కల్తీ మద్యం, నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ కేసులపై దాడులు ముమ్మరం చేస్తున్నది. వి.బి. కమలాసనరెడ్డి ఎక్సైజ్ డైరెక్టరుగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి కేసుల నమోదుతోపాటు నిందితులకు శిక్షలు ఖచ్చితంగా పడేలా చర్యలు తీసుకుంటున్నారు.2024లో మాత్రమే 1162 ఎన్డీపీఎస్ కేసులు నమోదవ్వగా, 6400 కేజీల గంజాయి, 683.81 గ్రాముల ఎండీఎంఎ డ్రగ్స్‌ను పట్టుకున్న ఎక్సైజ్ శాఖ తన సత్తా చాటింది. అలాగే ఖమ్మం, కొత్తగూడెం, హైదరాబాద్ మల్కాజిగిరి, మహబూబ్‌నగర్ వంటి జిల్లాల్లో కూడా శిక్షల నమోదు వేగవంతమవుతోంది. సంగారెడ్డిలో 6 కేసుల్లో శిక్షలు పడగా, మెదక్‌లో 10 కేసుల్లో నిందితులకు శిక్షలు ఖరారయ్యాయి.

Drugs : గంజాయి,నిందితుల్లో గుబులు

ఈ దాడుల భాగంగా ఒడిశా నుంచి హైదరాబాద్కు హషీష్ ఆయిల్ సరఫరా చేస్తున్న ఇద్దరు నిందితులకు పదేళ్ల జైలు శిక్షలు విధించడం గమనార్హం. అలాగే సంగారెడ్డిలో అద్దెంకి సంగప్పా అనే నిందితుడికి ఐదేళ్ల జైలు శిక్షతోపాటు రూ. లక్ష జరిమానా విధించారు. ఇదే జిల్లాలో గత రెండు మూడు నెలల్లో వరుసగా 6 కేసుల్లో శిక్షలు ఖరారయ్యాయి.ఈ చర్యలతో గంజాయి, డ్రగ్స్ వ్యాపారం నిర్వహించాలనే అక్రమార్కుల్లో భయం ఏర్పడింది. ఎక్సైజ్ శాఖ, పోలీస్ స్థాయిలో గుర్తింపు పొందడమే కాకుండా, పంచనామా, చార్జీషీట్‌లు బలంగా ఉండటం వల్ల కేసుల్లో విజయాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ఉక్కుపాదం మోపడం ఈ విజయాల్లో కీలకమైంది.శిక్షలు ఖచ్చితంగా పడే స్థితి ఏర్పడటంతో నేరాల రేటు తగ్గే అవకాశం ఉంది. ఇది గంజాయి, డ్రగ్స్ వ్యాపారాలపై కీలక ప్రభావం చూపనుంది. ఇకపై ఎక్సైజ్ శాఖ ఈ దాడులను మరింత ఉధృతం చేస్తూ, నేరస్తులకు గుణపాఠం చెబుతుందని అధికారులు తెలిపారు.

Read More : Florida University: ఫ్లోరిడా స్టేట్ యూనివర్సిటీలో కాల్పుల కలకలం

Breaking News in Telugu drug trafficking Telangana drugs punishment Excise Department ganja cases Google news Latest News in Telugu Medak drug cases NDPS Act Paper Telugu News Sangareddy crime Telangana Crime News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.