📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

గంభీర్‌పై స్టేడియంలో నినాదాలు త్రివిక్ర‌మ్‌పై పూన‌మ్ కౌర్ ఫైర్ స్కూల్ బస్సు బోల్తా బాస్కెట్ బాల్ కోర్ట్ లో ప్లేయర్ మృతి మహిళపై అనుచితంగా ప్రవర్తించిన డాక్టర్ తనూజ, భరణి లతో ఆట ఆడేసుకున్న నాగ్ ఫంకీ టీజర్ విడుదల డ్యూడ్ ట్రైల‌ర్ లో హైలైట్స్ మాస్ జాతర నుంచి సాంగ్ మిత్ర‌మండ‌లి ట్రైల‌ర్ హైలైట్స్ గంభీర్‌పై స్టేడియంలో నినాదాలు త్రివిక్ర‌మ్‌పై పూన‌మ్ కౌర్ ఫైర్ స్కూల్ బస్సు బోల్తా బాస్కెట్ బాల్ కోర్ట్ లో ప్లేయర్ మృతి మహిళపై అనుచితంగా ప్రవర్తించిన డాక్టర్ తనూజ, భరణి లతో ఆట ఆడేసుకున్న నాగ్ ఫంకీ టీజర్ విడుదల డ్యూడ్ ట్రైల‌ర్ లో హైలైట్స్ మాస్ జాతర నుంచి సాంగ్ మిత్ర‌మండ‌లి ట్రైల‌ర్ హైలైట్స్

Adulterated Food: కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్ ముఠా గుట్టురట్టు.. 4000 కేజీలు స్వాధీనం

Author Icon By Aanusha
Updated: February 27, 2026 • 12:02 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి
Gang of adulterated ginger garlic paste busted.. 4000 kg seized

Adulterated Food: భాగ్యనగరంలో ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న మరో కల్తీ ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. ఖైరతాబాద్ జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఎం.ఎస్.మఖ్తా, రైల్వే గేట్ సమీపంలోని అక్రమ తయారీ కేంద్రాలపై ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఈ సోదాల్లో భారీ ఎత్తున నిల్వ ఉంచిన కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్ బయటపడింది.

Read Also: Velugumatla House Collapse : కాంగ్రెస్ కూలగొట్టిన చోటే..ఇళ్లు కట్టిస్తాం – కేటీఆర్

JJ ఫుడ్స్ పేరుతో భారీ దందా

ఈ అక్రమ వ్యాపారానికి సంబంధించి 21 ఏళ్ల జసాని ఇల్యాన్ అనే నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు ‘JJ ఫుడ్స్’ అనే బ్రాండ్ పేరుతో కల్తీ పేస్ట్‌ను తయారు చేసి మార్కెట్లో విక్రయిస్తున్నట్లు విచారణలో తేలింది. తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు గడించడమే లక్ష్యంగా కుళ్ళిన పదార్థాలు, హానికరమైన రంగులు కలిపి ఈ పేస్ట్‌ను తయారు చేస్తున్నట్లు సమాచారం.

తనిఖీల్లో మొత్తం 4 వేల కేజీల కల్తీ పేస్ట్‌ను స్వాధీనం చేసుకున్నారు. వీటిలో 40 టబ్బుల్లో 1,600 కేజీలు, 5 కేజీల కంటైనర్లు 130 , 1 కేజీ కంటైనర్లు 900, 500 గ్రాముల కంటైనర్లు 300, 200 గ్రాముల కంటైనర్లు 3,000 , 50 గ్రాముల ప్యాకెట్లు 2,000 ఉన్నాయి. అదేవిధంగా రెండు గ్రైండింగ్ మెషీన్లు, 5 కేజీల పసుపు పొడి, 20 లీటర్ల ఎసిటిక్ యాసిడ్, 40 బస్తాల ఉప్పు సరఫరాకు వినియోగిస్తున్న గూడ్స్ ఆటోను సీజ్ చేశారు. నిందితుడిని తదుపరి చట్టపరమైన చర్యల కోసం లేక్ పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్‌ఓకు అప్పగించినట్లు అధికారులు వెల్లడించారు.

hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

AdulteratedFood GingerGarlicPasteRacket HyderabadNews TaskForcePolice

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.