📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Gandhi Hospital: రోగ నిర్ధారణ పరీక్షలు గగనమే..

Author Icon By Tejaswini Y
Updated: March 6, 2026 • 10:38 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Gandhi Hospital: రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన స్పత్రులైన గాంధీ, ఉస్మానియా లాంటి ఆస్పత్రులలో రోజురోజుకు రోగుల సంఖ్య పెరిగిపోతోంది. ఇందుకు తగ్గట్టు గా మాత్రం సదుపాయాలు మెరుగుపడడంలే దు. గత కొంత కాలంగా ఈ ఆస్పత్రులలో వైద్య సౌకర్యాలు కూడా అందుబాటులో ఉండడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. నిత్యం వచ్చే రోగులకు వైద్యులు వైద్య సేవలను విస్తరించాలని ప్రయత్నించినప్పటికి అందుకు అవసరమైన మేరకు వైద్య పరికరాలు అందుబాటులో ఉండ డం లేదని తెలుస్తోంది.

Read Also : Telangana Govt : మహిళల కోసం రేవంత్ సర్కార్ అనూహ్య నిర్ణయం!

Gandhi Hospital: Diagnostic tests are sky high..

వాతావరణ మార్పులతో వచ్చే రోగాలతో పాటు ఇతర రోగాలకు వైద్యసే వలు అందించగలిగే ఆస్పత్రులైన సికింద్రాబాద్ గాంధీ, ఉస్మానియా ఆస్పత్రులలో చికిత్సలకు అ వసరమైన పరికరాలు అందుబాటులో లేని కార ణంగా సకాలంలో వైద్య సేవలను అందించలేక పోతున్నారు. అన్ని విభాగాలకు సరిపడా వైద్యులు లేనప్పటికి ఆస్పత్రిలో ఉన్న వైద్యుల తోనే కాలం నెట్టుకువస్తున్నారు. గాంధీ ఆస్పత్రి లో దాదాపు 11వందల పడకలు ఉండగా రోగుల సంఖ్య మాత్రం రెండువేలకు మించి ఉంటోంది. మరికొన్ని పడకలు అందుబాటులోకి తీసుకువచ్చే అవకాశం ఉన్నప్పటికీ సరైన వైద్యులు అందు బాటులో లేని కారణంగా అలస్యం అవుతున్నట్లు తెలుస్తోంది.

రోగ నిర్ధారణ పరీక్షలకు తప్పని తిప్పలు…

రోగికి చికిత్సలు చేయాలంటే అంతకంగే ముందు గా వైద్య పరీక్షలు జరిపించడం అవసరం. రోగిని వైద్యులు పరిక్షించిన అనంతరం వారికి సరైన చికిత్స అందించడం కోసం వైద్యులు రోగాలను నిర్ధారించుకోడాని ఎక్స్ రేలు అంతకంటే ముఖ్య మైన పరీక్షలు జరిపించుకోవాల్సిందిగా సూచి స్తుంటారు. గాంధీ ఆస్పత్రిలో ఎక్స్రే యంత్రాలు కూడా సరిపడా లేకపోవడంతో తీసిన ఎక్స్ రేలను ఫోన్లలో ఫోటోలు తీసుకువచ్చి రోగులే వైద్యు లకు చూపించి వైద్య సేవలు పొందుతున్నారు. కనీసం సిటీస్కాన్ చేయాలన్నా నాలుగైదు రోజుల సమయం పడుతుందని రోగులు చెబుతున్నారు. అత్యవసర పరిస్థితిలో వచ్చిన రోగికి రోగ నిర్ధారణ పరీక్షలు జరిపించుకోవాలంటే ప్రాణాల మిదికి వచ్చినంత పనవుతుందని రోగులు ఆరోపిస్తున్నారు.

నాలుగు రోజుల కిందట ఓ రోగికి అత్యవసరంగా సిటీస్కాన్ చేయాల్సి ఉండగా టెక్నీషియన్ టెక్నీషియన్ రోజుల తరబడి సమయం తీసుకుం టుండడంతో రోగి బంధువులు ఆందోళనకు దిగా రు. అత్యవసర పరిస్థితిలో రోగ నిర్ధారణ పరీక్షల కు రోజుల సమయం తీసుకోవడం పట్ల మండిప డ్డారు. ఈ విషయంలో సూపరింటెండెం ట్ కల్పించుకొని అప్పటికప్పుడు సిటీస్కాన్ చే యించడంతో సమస్య పరిష్కారం అయ్యిది. ఇలాంటి సంఘటనలు తరచుగా జరుగుతూనే ఉన్నాయి. నిత్యం రెండు వేల మంది రోగులు ఆశ్రహిస్తున్న ఆస్పత్రిలో సరైన వైద్య పరికరాలు అందుబాటులో లేకపోవడం వల్ల రోగులకు తిప్ప లు తప్పడం లేదు. కొన్నిసార్లు రోగులు కూడా వైద్యులపై మండిపడుతున్నారు.

రోగికి సంబంధించిన రిపోర్టులు సకాలంలో రాకపోవడంతో వైద్యులు కూడా చికిత్సలు జరిపే అవకాశం ఉం దకపోవడంతో సమస్యలు పరిష్కారానికి నోచు కోవడం లేదు. ఇందులో వైద్యుల నిర్లక్ష్యం లేకపో యినా సమస్యలు ఎదుర్కొంటున్నారు. చివరికి గాంధీ ఆస్పత్రి మార్చూరిలో ఫ్రీజర్ లు కూడా అన్ని సక్రమంగా పనిచయడం లేదు. వాటిని గాంధీ ఆస్పత్రి ఏర్పాటు చేసినప్పుడు ఉన్నవే తప్ప మళ్ళి కొత్తవి ఏర్పాటు చేయడం లేదని చెబుతున్నారు. దాదాపు 70 ఫ్రీజర్లు ఉండగా వాటిలో సగం కంటే ఎక్కువే పని చేయడం లేద ని తెలుస్తోంది.

ఆస్పత్రి వర్గాలు ప్రభుత్వానికి వీటి విషయమై లేక రాయగా వైద్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ్మ ఈ విషయమై సూప రింటెండెంట్ను ఆరా తీశారు. వెంటనే (టీజీ ఎంఎస్ఐడీసీ) తెలంగాణ వైద్యవిద్యా మౌళిక సదుపాయాల కల్పన సంస్థ ప్రీజర్ మంజూరు కు అనుమతించింది. దీంతో త్వరలోనే దాదాపు 40 ప్రీజర్లు కొత్తవి అందుబాటులోకి రానున్న ట్లు సమాచారం. ఇలా అత్యవసరమైతే తప్ప అస్పత్రికి అవసరమైన వైద్య పరికరాలు, మిషన రీ అందుబాటులోకి వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. రోగులు ఆస్పత్రికి వస్తున్నారు, పోతు న్నారు. కాని ఆస్పత్రిని ఆగ్రహించిన రోగులక స మస్యలు మాత్రం అంతంమాత్రంగా పరిష్కారం అవుతున్నాయని రోగులు చెబుతున్నారు.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also :

Gandhi Hospital Government Hospitals osmania hospital Patient Struggles Telangana healthcare

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.