Gaddar film awards telangana : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అందించే గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ 2025 జ్యూరీ కమిటీలో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. స్పెషల్ జ్యూరీ చైర్మన్‌గా ప్రముఖ నిర్మాత, సినీ విశ్లేషకుడు తమ్మారెడ్డి భరద్వాజను నియమించారు. ఇప్పటివరకు ఈ బాధ్యతలు నిర్వహించిన లెజెండరీ దర్శకుడు రాఘవేంద్రరావు స్థానంలో ఆయనకు బాధ్యతలు అప్పగించినట్లు తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఉత్తర్వులు జారీ చేసింది.
Read Also: Smoking : సిగరెట్ ప్రియులకు భారీ షాక్..మీ జేబులు చిల్లు అయ్యే వార్త
ఉగాది పండుగ సందర్భంగా మార్చి 19న గద్దర్ సినీ అవార్డులను ప్రదానం చేయనున్నారు. ప్రజాకవి గద్దర్ పేరుతో అందజేస్తున్న ఈ అవార్డులు తెలుగు సినీ పరిశ్రమలో ప్రతిభను ప్రోత్సహించడమే లక్ష్యంగా ఉన్నాయి. 2024–25 సంవత్సరాల్లో విడుదలైన చిత్రాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన నటీనటులు, సాంకేతిక నిపుణులను ఎంపిక చేసి సత్కరించనున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also: