తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన గద్దర్ ఫిల్మ్ అవార్డు (Gaddar Film Awards) వేడుకలు హైదరాబాద్‌లోని హైటెక్స్ వేదికగా అద్భుతంగా జరిగాయి. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరై, సినీ రంగంలోని ప్రతిభావంతులైన కళాకారులకు అవార్డులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమం సినీ తారల తళుకుబెళుకులతో కళకళలాడింది.
చిత్రపరిశ్రమ ప్రముఖుల సమ్మేళనం
ఈ వేడుకలో నటులు నందమూరి బాలకృష్ణ, అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ, శర్వానంద్, దర్శకులు రాజమౌళి, సుకుమార్, నాగ్ అశ్విన్, వంశీ పైడిపల్లి, హీరోయిన్లు పూజా హెగ్దే, కృతి శెట్టి, ప్రగ్యా జైస్వాల్, నిర్మాతలు తదితరులు పాల్గొన్నారు. సినీ రంగంలోని అన్ని విభాగాల ప్రతినిధులు ఒకే వేదికపై కనిపించడం ఈ వేడుకను ప్రత్యేకంగా మార్చింది.
అల్లు అర్జున్, నివేదా థామస్‌కు పురస్కారాలు
ఈ వేడుకలో ‘పుష్ప 2’ చిత్రంలో తన పాత్రకు ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్ అవార్డు అందుకోగా, ఉత్తమ నటిగా నివేదా థామస్ గౌరవించబడ్డారు. సినీ ప్రపంచంలో విభిన్న పాత్రల్లో మెరిసే నటీనటులకు, సాంకేతిక నిపుణులకు గౌరవం లభించడంతో వారిలో ఉత్సాహం కనిపించింది. గద్దర్ పేరు మీద అవార్డులు ప్రదానం చేయడం ద్వారా తెలంగాణ ప్రభుత్వం సినీ రంగాన్ని గౌరవించే విధంగా ముందడుగు వేసింది.
Read Also : Mahatma Gandhi : మహాత్మాగాంధీ మునిమనమరాలికి జైలుశిక్ష