📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

G. Haragopal: కర్రెగుట్టలో ఆపరేషన్ కగార్ నిలిపి శాంతిని నెలకొల్పాలి

Author Icon By Saritha
Updated: February 20, 2026 • 12:05 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

పౌర హక్కుల సంఘం సీనియర్ నేత ప్రొ. హరగోపాల్

G. Haragopal: కర్రెగుట్ట ప్రాంతంలో కేంద్ర ప్రభుత్వ బలగాలు చేస్తున్న ఆపరేషన్ కగారు నిలిపివేసి శాంతియుత వాతావరణం నెలకొనేలా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేయాలని పౌర హక్కుల సంఘం సీనియర్ నాయకుడు ప్రొఫెసర్ జి. హరగోపాల్ కోరారు. కర్రెగుట్ట తెలంగాణ రాష్ట్రంలోనే ఉందని, గత రెండేళ్ళ నుంచి కర్రెగుట్టలో కేంద్ర బలగాలు ఎన్ కౌంటర్లకు పాల్పడుతున్నాయని, శాంతియుతవాతావరణం కరువైందని హత్యలు జరుగుతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. వేలాది మంది బలగాలు కర్రెగుట్టను చుట్టుముట్టి శవాల గుట్టగా మార్చడం సరైనది కాదని సూచించారు.

Read Also: Municipal Elections Results: ‘పార్టీలైన్’ దాటితే ఎలా?

G. Haragopal: Operation Kagar should be stopped in Karregutta and peace should be established.

ప్రభుత్వాల తీరుపై విమర్శలు

తెలంగాణ పౌర హక్కుల సంఘం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ప్రొఫెసర్ గడ్డం లక్ష్మణ్, ఎన్. నారాయణరావు తదితరులతో కలిసి హరగోపాల్ మాట్లాడుతూ గతంలో పౌర హక్కుల కగార్ సంఘం నిర్వహించిన రౌండ్ టేబుల్ సమా వేశంలో పిసిసి అధ్యక్షుడు బి. మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ యుద్ధాన్ని వెంటనే నిలు వరించాలని కేంద్ర ప్రభుత్వాన్ని చేయడం ఇందులో డిమాండ్ జరిగిందని, భాగంగానే సిఎం రేవంత్రెడ్డి (Revanth Reddy), రాష్ట్ర మంత్రి సీతక్క ఆదే విధంగా కోరారని ఈ సందర్భంగా గుర్తు చేశారు.

కాంగ్రెస్ వైఖరిపై ప్రశ్నలు

కేంద్రంలో ప్రతిపక్ష నేతగా ఉన్న రాహుల్గాంధీ గురించి పార్లమెంట్లో గొంతెత్తుతూ ఉంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ, రేవంత్రెడ్డి పట్టించుకోవడం లేదని, తెలంగాణ సరిహద్దుల్లో మిలటరీ క్యాంప్లు ఏర్పాటు చేయడం కర్రెగుట్టలో శవాలగుట్టగా మార్చడం జరుగుతున్నదన్నారు. ప్రొఫెసర్ లక్ష్మణ్, నారాయణరావు మాట్లాడుతూ కర్రెగుట్టలో 90 ఎన్ కౌంటర్లు, 1000 మంది మావోయిస్టులు, ఆదివాసీలు హత్యకు గురైనారని ఆందోళన వ్యక్తం చేశారు. నేడు కూడా కర్రెగుట్టలో బూటకపు ఎన్కౌంటర్ జరిగిందని, 5 గురు హత్యకు గురైనారని ఆరోపించారు. ప్రజాస్వామ్య విలువలు, రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకంగా ప్రభుత్వాలు ఉద్యమకారులను, ఆదివాసీలను హత్య చేస్తున్నాయని ఆరోపించారు. తక్షణమే కగార్ ఆపెరేషన్ ను ఆపాలని, శాంతియుత వాతావరణం నెలకోల్పాలని వారు డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో సురేష్కుమార్, చేతన పాల్గొన్నారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

Karregutta Encounter Latest News in Telugu Maoist Encounters operation kagaar Prof Haragopal Telangana Human Rights Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.