हिन्दी | Epaper
కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

Strike: 9న జరిగే సార్వత్రిక సమ్మెకు సంపూర్ణ మద్దతు

Sharanya
Strike: 9న జరిగే సార్వత్రిక సమ్మెకు సంపూర్ణ మద్దతు

వామపక్షాల సమావేశంలో నిర్ణయం

హైదరాబాద్: దేశంలో ఈనెల 9న జరగనున్న సార్వత్రిక సమ్మె (General strike) కు వామపక్షాల సంపూర్ణ మద్దతు ప్రకటించాయి. ఇందుకు సంబంధించి వామపక్ష పార్టీల నేతలు సోమవారం సిపిఎం (CPM) తెలంగాణ రాష్ట్ర కార్యాలయం ఎంబి భవన్ లో జరిగింది. జాన్ వెస్లీ(సిపి(ఐ) ఎం రాష్ట్ర కార్యదర్శి), కూనంనేని సాంబశివరావు(సిపిఐ రాష్ట్ర కార్యదర్శి) సూర్యం (సిపిఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ రాష్ట్రకార్యదర్శి), జానకి రాములు (రివల్యూషనరీ సోషలిస్టు పార్టీ, రాష్ట్ర కార్యదర్శి), గాదగోని రవి(ఎంసిపిఐ (యు) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు), మామిండ్ల రమేష్ రాజా (సిపిఐ (ఎంఎల్) లిబరేషన్, రాష్ట్ర కార్యదర్శి), బి సురేందర్ రెడ్డి(ఫార్వర్డ్ బ్లాక్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి) పాల్గొన్నారు.

ఈ నెల 9న జరిగే సార్వత్రిక సమ్మె

సమావేశంలో ఈ నెల 9న జరిగే సార్వత్రిక సమ్మెకు సంపూర్ణ మద్దతు ఇవ్వాలని నిర్ణయించినట్టు సంఘాల నేతలు మీడియాకి తెలిపారు. 10 కేంద్ర కార్మిక సంఘాలు, అఖిల భారత స్థాయి రంగాలవారీగా స్వతంత్ర సమాఖ్యలు, సంస్థలతో కూడిన కార్మిక సంఘాల సంయుక్త వేదిక ఇచ్చిన పిలుపు మేరకు ఈనెల 9న జరగనున్న సార్వత్రిక సమ్మెకు తెలంగాణ రాష్ట్రంలోని వామపక్ష పార్టీలు తమ పూర్తి మద్దతు ప్రకటిస్తున్నట్టు తెలిపారు. కార్మికుల మౌలిక ప్రజాస్వామ్య హక్కులను తీవ్రంగా కుదించడానికి ఉద్దేశించిన కార్పొరేట్ ఎజెండాలో కీలక భాగమైన లేబర్ కోడ్లను అమలుచేయాలని కేంద్రంలోని బిజేపి ప్రభుత్వం పూనుకుంటుందని వామపక్షాలు మండిపడ్డాయి. లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా సార్వత్రిక సమ్మెకు కార్మిక సంఘాలు పిలుపునిచ్చాయని నాయకులు తెలిపారు. మూడోసారి అధికారంలోకి వచ్చిన బిజెపి నేతృత్వంలోని ప్రభుత్వం తన నయా ఉదారవాద ఎజెండాను దూకుడుగా అమలు చేయాలని చూస్తోందన్నారు. అందులో లేబర్ కోడ్లు ప్రధానమైన భాగంగా వున్నాయని.. కీలకమైన జాతీయ వనరులను ముఖ్యంగా రక్షణ, కమ్యూనికేషన్ వంటి వ్యూహాత్మక రంగాలను ప్రయివేటీకరించే దిశగా చాలా వేగంగా ప్రభుత్వం ముందుకెళుతోందని నాయకులు విమర్శించారు.

ఈ విధానాలను వ్యతిరేకిస్తూ జరుగుతున్న ఉద్యమాలను అణచివేయాలని చూస్తోందని వామపక్ష నాయకులు మండిపడ్డారు. రైతాంగం, వ్యవసాయ కార్మికులతోపాటు విసృత స్థాయిలో ప్రజానీకం వ్యక్తం చేస్తున్న ఆందోళనలతో సహా కార్మిక సంఘాలు లేవనెత్తిన డిమాండ్లను ఈనెల 9 నాటి సార్వత్రిక సమ్మె ఎలుగెత్తి చాటుతుం దని.. ఈ సార్వత్రిక సమ్మెకు సంయుక్త కిసాన్ మోర్చా, వ్యవసాయ కార్మిక సంఘాలు మద్దతును ఇచ్చాయని తెలిపారు. సమ్మెను జయప్రదం చేసేందుకు పెద్ద సంఖ్యలో ప్రజలను సమీకరిం చాలని పార్టీల శాఖలన్నింటికీ పిలుపునిస్తున్నట్టు పార్టీల నాయకులు తెలిపారు.

Read also: Cibil Score: సిబిల్ స్కోర్ 650 పాయింట్లు ఉంటేనే పంట రుణాలు

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870