హైదరాబాద్ hyderabad : బతుకమ్మ కానుకగా ఇందిరా మహిళా శక్తి పేరుతో ఆడపడుచులకు చీరలు పంపిణీ Free Sarees చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే పండుగ నాటికి చీరలు సిద్ధం కాకపోవడంతో పంపిణీ వాయిదా పడింది. వీటిని ఇందిరా గాంధీ (Indira Gandi) జయంతి సందర్భంగా నవంబర్ 19న పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీనికోసం ఎట్టిపరిస్థితుల్లోనూ నవంబర్ 15 వరకు చీరల తయారీ పూర్తి చేసి.. పంపిణీ చేయాలని నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర మహిళలకు ఉచితంగా చీరలు పంపిణీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందిరా మహిళా శక్తి పేరుతో చీరలు పంపిణీ చేయాలనుకుంది. కానీ అది సాధ్య పడలేదు. దీంతో చీరల పంపిణీ కార్యక్రమాన్ని వాయిదా వేసింది. పండుగ తర్వాత పంపిణీ చేస్తామని ప్రకటించింది.
Read also: Minister Damodar: పూర్తిగా తగ్గుముఖం పట్టిన సీజనల్ వ్యాధులు

Free Sarees
అయితే ఈ చీరల (sari) పంపిణీని దివంగత మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతి రోజున (నవంబర్ 19న) ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 18,848 స్వయం సహాయకం బృందాల్లో (ఎసెచ్చి) 1.94లక్షల మంది సభ్యులు ఉన్నారు. ఈ గ్రూపుల్లో ఉన్న వారందరికీ.. ఒక్కో చీర Free Sarees చొప్పున ప్రభుత్వం పంపిణీ చేయనుంది. అంటే మొత్తం 1.94 లక్షల చీరలు అవసరం అవుతాయి. అయితే ఇందులో జిల్లాలకు 50 శాతం చీరలు మాత్రమే సరఫరా అయ్యాయి. వాటిని గోదాముల్లో భద్రపరిచారు. మిగతా 50శాతం చీరలు త్వరలో జిల్లాలకు సర ఫరా కానున్నాయి. చేనేత, జౌళిశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు, కమిషనర్ శైలజా రామ య్యర్ చీరల తయారీ, పంపిణీ గురించి అది కారుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు.
ఉచిత చీరల పంపిణీ ఎప్పుడు ప్రారంభం కానుంది?
నవంబర్ 19న, ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా ఉచిత చీరల పంపిణీ ప్రారంభమవుతుంది.
ఈ చీరల పంపిణీ కార్యక్రమాన్ని ఏ పేరుతో నిర్వహిస్తున్నారు?
ఇందిరా మహిళా శక్తి పేరుతో చీరల పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/
Read Also: