📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

Konda Murali : నా బాడీ లో ఇంకా నాల్గు బుల్లెట్లు ఉన్నాయి – కొండా మురళి సంచలన వ్యాఖ్యలు

Author Icon By Sudheer
Updated: June 29, 2025 • 9:36 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఉమ్మడి వరంగల్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ (Congress)లో నెలకొన్న అంతర్గత విభేదాలు తీవ్రతరమవుతున్నాయి. ముఖ్యంగా మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి (Konda Murali) ఇటీవల పార్టీ నేతలపై సంచలన ఆరోపణలు చేయడం ఈ సమస్యను మరింత హైలైట్ చేసింది. జిల్లాలో వర్గపోరు తారా స్థాయికి చేరగా, మురళి పీసీసీ క్రమశిక్షణ కమిటీకి మొత్తం ఆరు పేజీల నివేదికను అందజేశారు. గాంధీభవన్‌లో క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవిని మురళి స్వయంగా కలవడం, పార్టీ వ్యవస్థలో సమస్యలు ఎంత దూరం వెళ్లాయో స్పష్టమవుతోంది.

తన నిబద్ధత, రాజకీయ పయనంపై స్పష్టత

మీడియాతో మాట్లాడుతూ కొండా మురళి మాట్లాడుతూ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో వరంగల్‌ జిల్లాకే రెండు ఎమ్మెల్సీ స్థానాలు రిజర్వ్ చేయించడంలో తన పాత్ర కీలకమని గుర్తు చేశారు. భారతదేశంలో ఏకగ్రీవంగా ఎమ్మెల్సీగా గెలిచిన ఘనత తనదేనని పేర్కొన్నారు. తాను రాహుల్ గాంధీని ప్రధాని చేయాలనే లక్ష్యంతో పని చేస్తున్నానని స్పష్టం చేశారు. తాను ఎప్పుడూ బీసీల కోసం, సామాజిక న్యాయం కోసం పోరాటం చేస్తున్నానని తెలిపారు. తనపై ఎవరూ ప్రశ్న వేయలేరని, తనను రెచ్చగొట్టే ప్రయత్నాలు ఫలించవని, ఇంకా తన శరీరంలో నాలుగు బుల్లెట్లు ఉన్నాయంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

పార్టీకి నిబద్ధత.. పదవికి కాదు

బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి మారేటప్పుడు తాను ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి వచ్చానని కొండా మురళి పేర్కొన్నారు. అదే తన నిబద్ధతకు నిదర్శనమని, ప్రస్తుతం కాంగ్రెస్‌లో ఉన్న కొందరి నాయకుల్లా తాను పదవిలో కొనసాగలేదని విమర్శించారు. పీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిగా చూసే ఆత్మీయత తనకు ఉందని తెలిపారు. తనపై ఎలాంటి విచారణ జరిపించలేదు కానీ తానే స్వయంగా వచ్చి వాస్తవాలు వివరించానని స్పష్టం చేశారు. ఈ వ్యాఖ్యలు వరంగల్ జిల్లాలో కాంగ్రెస్ రాజకీయాలను మరింత ఉద్రిక్తతలోకి నెట్టే అవకాశం ఉంది.

Read Also : Trisha Krishnan: ఆలయానికి నటి త్రిష విరాళంగా రోబో ఏనుగును

congress Google News in Telugu Konda Murali

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.