📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

అభ్యర్థుల మధ్య లొల్లి చైర్ పర్సన్/మేయర్ ఎన్నిక తగ్గిన టమాటా ధరలు నిజామాబాద్, కరీంనగర్లో బిజెపి జెండా! జలమండలి పునర్వ్యవస్థీకరణ తెలంగాణకు శుభవార్త ఎన్నికల పోలింగ్ ఎంతంటే? ముగిసిన మున్సిపల్ పోలింగ్ కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు అభ్యర్థుల మధ్య లొల్లి చైర్ పర్సన్/మేయర్ ఎన్నిక తగ్గిన టమాటా ధరలు నిజామాబాద్, కరీంనగర్లో బిజెపి జెండా! జలమండలి పునర్వ్యవస్థీకరణ తెలంగాణకు శుభవార్త ఎన్నికల పోలింగ్ ఎంతంటే? ముగిసిన మున్సిపల్ పోలింగ్ కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు

KTR Formula E race : ఫార్ములా ఈ కేసు, కేటీఆర్‌పై చార్జిషీట్ ఈ వారం?

Author Icon By Sai Kiran
Updated: February 16, 2026 • 10:04 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

KTR Formula E race : ఫార్ములా ఈ-కారు రేసు కేసులో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కేటీఆర్కు సంబంధించి కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ కేసులో ఏసీబీ అధికారులు ఈ వారంలోనే కోర్టులో చార్జిషీట్ దాఖలు చేసే అవకాశముందని సమాచారం. చార్జిషీట్‌లో కేటీఆర్‌ను ఏ1గా పేర్కొంటూ నేరాభియోగ పత్రాన్ని సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నమోదు చేసిన ఈ కేసులో విచారణ దాదాపు పూర్తయింది. చార్జిషీట్‌కు తుదిరూపం ఇచ్చిన ఏసీబీ అధికారులు, ఏ2గా ఉన్న ఐఏఎస్ అధికారి అర్వింద్ కుమార్‌పై ప్రాసిక్యూషన్‌కు డీవోపీటీ అనుమతి కోసం ఎదురుచూశారు. తాజాగా ఆ అనుమతి రావడంతో చార్జిషీట్ దాఖలు ప్రక్రియ వేగవంతమైంది. కేసుకు సంబంధించి ఎలక్ట్రానిక్, డిజిటల్ ఆధారాలను కూడా సేకరించినట్లు సమాచారం.

Read Also: Mahesh Babu: ‘నాగబంధం’ టీజర్ లాంచ్ చేసిన సూపర్‌స్టార్

KTR Formula E race

ఫార్ములా ఈ-కారు రేసు నిర్వహణ వల్ల హెచ్‌ఎండీఏకు సుమారు ₹75.88 కోట్ల నష్టం జరిగిందని ఏసీబీ పేర్కొంటోంది. రేసు నిర్వహణ బాధ్యతలు ఏస్ నెక్స్ట్‌జెన్ సంస్థకు అప్పగించడం, దానికి ప్రతిఫలంగా ఆ సంస్థ నుంచి బీఆర్‌ఎస్ పార్టీకి ఎలక్టోరల్ బాండ్ల రూపంలో నిధులు వచ్చాయనే అంశాన్ని కూడా దర్యాప్తు సంస్థ పరిశీలిస్తోంది.

ఈ కేసులో కేటీఆర్ ప్రాసిక్యూషన్‌కు గవర్నర్ గతంలోనే అనుమతి ఇచ్చారు. 2024 డిసెంబర్ 18న ఏసీబీ ఎఫ్‌ఐఆర్ నమోదు చేయగా, అనంతరం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కూడా కేసు నమోదు చేసింది. ఈ కేసులో కేటీఆర్, అర్వింద్ కుమార్ తదితరులను విచారించారు. చార్జిషీట్ దాఖలైన తర్వాత తదుపరి చర్యలు ఏమిటన్నది ఆసక్తిగా మారింది.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

ACB chargesheet KTR Ace NextGen contract controversy Breaking News in Telugu ED ACB investigation Telangana electoral bonds funding allegations India Google News in Telugu HMDA loss allegations case Hyderabad Formula E investigation KTR Formula E race case Latest News in Telugu Telangana political corruption probe Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.