📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కు వెల్కమ్ కిట్లు రోడ్డు ప్రమాదంలో నిండు గర్భిణి దుర్మరణం: సీసీ ఫుటేజ్ రిజిస్టర్ మ్యారేజ్ ఆఫీస్‌ల్లో మినీ హాల్స్ సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ ఇక నుంచి 6 నెలల్లోనే రిక్రూట్‌మెంట్ పూర్తి: ఛైర్మన్ భూమిలో ఫెస్టిసైడ్స్ ను తొలగించే కొత్త టెక్నాలజీ కర్రెగుట్టల్లో మళ్లీ పేలుళ్లకు పాల్పడిన నక్సల్స్ రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కు వెల్కమ్ కిట్లు రోడ్డు ప్రమాదంలో నిండు గర్భిణి దుర్మరణం: సీసీ ఫుటేజ్ రిజిస్టర్ మ్యారేజ్ ఆఫీస్‌ల్లో మినీ హాల్స్ సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ ఇక నుంచి 6 నెలల్లోనే రిక్రూట్‌మెంట్ పూర్తి: ఛైర్మన్ భూమిలో ఫెస్టిసైడ్స్ ను తొలగించే కొత్త టెక్నాలజీ కర్రెగుట్టల్లో మళ్లీ పేలుళ్లకు పాల్పడిన నక్సల్స్

Magam Ranga Reddy : మాజీ ఎమ్మెల్సీ మాగం రంగారెడ్డి మృతి

Author Icon By Sudheer
Updated: June 4, 2025 • 9:24 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

హైదరాబాద్‌లో బీజేపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్సీ మాగం రంగారెడ్డి (Magam Ranga Reddy) గుండెపోటుతో మృతి చెందారు. బుధువారం ఆకస్మికంగా గుండెనొప్పితో బాధపడిన ఆయనను కుటుంబ సభ్యులు వెంటనే దగ్గరిలోని ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు. ఆయన మరణవార్తతో కుటుంబ సభ్యులు, బంధువులు, రాజకీయ శ్రేణులు విషాదంలో మునిగిపోయారు.

రేపు శామీర్పేటలో అంత్యక్రియలు

మాగం రంగారెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యమంత్రి గా ఉన్న నల్లారి కిరణ్ కుమార్ రెడ్డికి సన్నిహితులుగా గుర్తింపు పొందారు. నేడు బీజేపీ నేతగా తెలంగాణ రాజకీయాల్లో (Telangana Politics) కొనసాగుతున్న ఆయన రాజకీయ అనుభవం, స్పష్టత పార్టీకి తోడ్పాటైంది. ఆయన మృతి బీజేపీకి తీరనిలోటుగా భావిస్తున్నారు. రేపు ఆయన స్వగ్రామమైన శామీర్పేటలో అంత్యక్రియలు జరగనున్నాయి. కుటుంబ సభ్యులకు నేతలు పరామర్శలు తెలియజేస్తున్నారు.

రేవంత్ రెడ్డి సంతాపం

మాగం రంగారెడ్డి మృతి పట్ల తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు. “రంగారెడ్డి గారు తెలంగాణ రాజకీయాల్లో అనుభవజ్ఞుడిగా, అభివృద్ధి పరంగా పలు సూచనలు చేసిన నేతగా గుర్తింపు పొందారు. ఆయన మరణం తీవ్ర విషాదకరం. ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను” అని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రాజకీయ వర్గాల్లో ఆయన మృతిపై దిగ్భ్రాంతి నెలకొంది.

Read Also : Bengaluru Stampede : వేడుక విషాదంగా మారడం దురదృష్టకరం- పవన్

BJP Google News in Telugu Magam Ranga Reddy Magam Ranga Reddy dies

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.