📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి.. 10 మందిని చంపేసిన నర్సు! ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి.. 10 మందిని చంపేసిన నర్సు!

Praneeth Rao: మళ్లీ సిట్ విచారణకు హాజరైన మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు

Author Icon By Shobha Rani
Updated: June 21, 2025 • 1:27 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో దర్యాప్తు కొనసాగుతోంది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు (Praneeth Rao) శనివారం మరోసారి ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) విచారణకు హాజరయ్యారు. అధికారులు ఆయన వాంగ్మూలాన్ని నమోదు చేసుకుంటున్నారు. ముఖ్యంగా, 2023 నవంబర్ 15వ తేదీన ఒకేరోజు ఏకంగా 650 ఫోన్లను ట్యాప్ చేశారన్న ఆరోపణలపై సిట్ అధికారులు ప్రణీత్ రావును కూలంకషంగా ప్రశ్నిస్తున్నట్లు సమాచారం.
మూడోసారి విచారణకు హాజరు
ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఎస్‌ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు (Praneeth Rao) భారతదేశానికి తిరిగి వచ్చిన తర్వాత, ప్రణీత్ రావు (Praneeth Rao) వ్యక్తిగతంగా విచారణకు హాజరుకావడం ఇది మూడోసారి. మావోయిస్టులతో సంబంధాలున్నాయనే నెపంతో రాజకీయ నాయకుల ఫోన్ నంబర్లను పంపించి, రివ్యూ కమిటీ నుంచి అనుమతి పొందిన తర్వాతే ఈ ఫోన్లను ట్యాప్ చేసినట్లు సిట్ దర్యాప్తులో గుర్తించింది. ఇదే అంశంపై ప్రభాకర్ రావును కూడా సిట్ అధికారులు ఇప్పటికే పలుమార్లు విచారించారు.
బ్యాంకు లావాదేవీల వివరాలు కూడా పరిశీలనలోకి
శనివారం ఉదయం సిట్ కార్యాలయానికి చేరుకున్న ప్రణీత్ రావు(Praneeth Rao)ను రాత్రి వరకు విచారించి, ఆయన స్టేట్‌మెంట్‌ను రికార్డు చేయనున్నారు. ఆయన వ్యక్తిగత బ్యాంకు లావాదేవీల వివరాలతో కూడిన డాక్యుమెంట్లను కూడా తీసుకురావాలని సిట్ అధికారులు ఆదేశించడంతో, వాటిని ఆయన సమర్పించినట్లు తెలిసింది. ఈ కేసులో విచారణ ఎదుర్కొంటున్న అధికారులు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారని, అయితే ఈ వ్యవహారం వెనుక ఆదేశాలు

Praneeth Rao: మళ్లీ సిట్ విచారణకు హాజరైన మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు

జారీ చేసిన రాజకీయ నాయకులు ఎవరనేది ఇంకా అంతుచిక్కడం లేదని సిట్ వర్గాలు భావిస్తున్నాయి. ప్రణీత్ రావు (Praneeth Rao) విచారణ అనంతరం ఈ కేసులో మరిన్ని కీలక పరిణామాలు చోటుచేసుకునే అవకాశం ఉందని, మరికొందరికి నోటీసులు జారీ చేసి విచారించనున్నారని తెలుస్తోంది.
మావోయిస్టు నెపంతో నాయకుల ఫోన్‌లు ట్యాప్?
రాజకీయ నాయకుల ఫోన్ నంబర్లను మావోయిస్టులతో సంబంధాలున్నట్లు చూపించి సురక్షిత సమాచార విభాగం (SIB) ద్వారా అనుమతులు తీసుకున్నట్లు సిట్ అనుమానం వ్యక్తం చేస్తోంది. అధికారిక రివ్యూ కమిటీ నుండి పర్మిషన్ తీసుకుని, అవకాశాలను దుర్వినియోగం చేసినట్లుగా సిట్ అనుమానిస్తుంది.
అధికారుల మధ్య పరస్పర ఆరోపణలు
ఈ కేసులో విచారణ ఎదుర్కొంటున్న అధికారులు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేస్తున్నారు. పలు పరస్పర విభేదాలు, ప్రభుత్వ అగ్రనాయకుల ప్రమేయంపై అనుమానాలు సిట్ దృష్టిలో ఉన్నట్లు సమాచారం. ఫోన్ ట్యాపింగ్ వెనుక రాజకీయ ఉద్దేశ్యాలు ఉన్నాయా? అన్న కోణంలోనూ దర్యాప్తు సాగుతోంది.

Read Also: Iruku Gopi: డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ అనంతరం యువకుడి ఆత్మహత్య

again appears before SIT inquiry Breaking News in Telugu Former DSP Praneeth Rao Google news Latest News in Telugu Paper Telugu News PhoneTapping PraneethRao SITInvestigation TelanganaScandal Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.