📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

Forest Attack : అటవీ అధికారులపై దాడి ఘటన – 35 మంది పై కేసు నమోదు

Author Icon By Shravan
Updated: August 11, 2025 • 2:16 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Forest Attack : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా (Joint Adilabad District) కవ్వాల్ అటవీ ప్రాంతంలో పులుల సంరక్షణ కేంద్రం పరిధిలో గల జన్నారం అటవీ డివిజన్లో అటవీ శాఖ అధికారులపై జరిగిన దాడి ఘటన నేపథ్యంలో 35 మంది గిరిజనులపై పోలీసులు కేసులు నమోదు చేశారు. శుక్రవా రం సాయంత్రం పోడు భూమి విషయమై ఇరువర్గాల మధ్య జరిగిన వివాదం కారణంగా గిరిజనులు అటవీ శాఖ అధికారులపై దాడులకు పాల్పడ డం తెలిసిందే. కవ్వాల్ సెక్షన్లోని పాలగోరి అటవీ ప్రాంతంలో సిర్పూర్ (యు)కు చెందిన కొందరు గిరిజనులు గుడిశెలు వేసుకోవడం, వాటిని అట వీ శాఖ అధికారులు తొలగించడంతో నెలకొన్న వివాదం ఈ దాడికి దారి తీసింది. ఒక పథకం ప్రకారం కొందరు గిరిజనులు అటవీ శాఖ అధికారుల కళ్లలో కారం చల్లి దాడికి పాల్పడ్డారని ఇంధన్పల్లి రేంజి అధికారి శ్రీధరా చారి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఈ దాడిలో ఇద్దరు అటవీ అధికారులు గాయపడ్డారని ఆయన తెలిపారు. కాగా ఈ ఫిర్యాదు మేరకు 35 మందిపై కేసులు నమోదు (Cases registered) చేయగా ఈ ఘటనలో గిరిజనలను మోతీరాం అనే వ్యక్తి దాడికి ఉసిగొల్పినట్లు పోలీసులు చెబుతున్నారు. ఈ ఘటనలో నిందితులపై అటవీ, వన్యప్రాణి చట్టాల ప్రకారం కేసులు నమోదయ్యాయి. ఈ కేసులో నిందితులను గుర్తించేందుకు పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు.

READ HINDI NEWS : hindi.vaartha.com

READ ALSO :

https://vaartha.com/rains-alert-government-on-alert-as-rain-forecast-for-another-four-days-in-telangana/andhra-pradesh/528821/

35 accused Breaking News in Telugu forest attack Forest officials Google news Latest News in Telugu wildlife protection

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.