తెలంగాణ(Telangana) రాష్ట్రం క్రీడారంగానికి కొత్త ప్రోత్సాహం ఇచ్చే ఘట్టానికి సిద్ధంగా ఉంది. దేశంలోనే మొదటి మహిళా ఫుట్‌బాల్ అకాడమీ(Football Academy) త్వరలో తెలంగాణలో ప్రారంభం కానుంది. ఫిఫా–ఏఐఎఫ్ఎఫ్ భాగస్వామ్యంతో ఏర్పాటు కానున్న ఈ అకాడమీ(Football Academy) మహిళా క్రీడాకారిణులకు ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలను అందించనుంది. హాంకాంగ్ తరువాత ప్రపంచంలో రెండో మహిళా ఫుట్‌బాల్ అకాడమీగా కూడా గుర్తింపు పొందనుంది.
Read also: Rupee Fall: డాలర్ ముందు రూపాయి బలహీనత
అంతే కాకుండా, పురుషుల ఫుట్‌బాల్ అకాడమీను కూడా తెలంగాణలో ఏర్పాటు చేయనున్నారు. ఈ అంశాలు డిసెంబర్ 8, 9, 2025న భారత్ ఫ్యూచర్ సిటీలో జరగబోయే తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్లో అధికారికంగా ప్రకటించబడతాయి.
గ్లోబల్ సమిట్‌లో తెలంగాణ కళలు, సంస్కృతి, వంటకాల ప్రదర్శన
సమిట్‌లో క్రీడారంగం మాత్రమే కాకుండా, తెలంగాణ సంస్కృతి, కళలు, సాంప్రదాయ వంటకాలును ప్రపంచానికి పరిచయం చేయడానికి ప్రత్యేక ఏర్పాట్లు ఉన్నాయి. ఫ్యూచర్ సిటీలో హాజరయ్యే ప్రపంచ ప్రముఖులు, కార్పొరేట్ ప్రతినిధులు, పరిశ్రమల నాయకులు, పెట్టుబడిదారులకు ప్రత్యేక స్వాగత కిట్‌లు అందజేయనున్నారు. స్వాగత కిట్‌లో పొచంపల్లి ఇక్కత్, శాలువా, చేర్యాల మాస్క్, హైదరాబాద్ అత్తర్, ముత్యాలతో చేసిన ఆభరణాలు, అలాగే ప్రత్యేక డిజైన్ చేసిన కల్చరల్ ఫుడ్ బాస్కెట్లో మహువ లడ్డులు, సకినాలు, అప్పాలు, బదామ్ కీ జాలి వంటి తెలంగాణ సాంప్రదాయ వంటకాలు ఉంటాయి. ఈ కిట్లు అతిథులకు తెలంగాణ ప్రత్యేకతను ప్రపంచ వేదికపై గుర్తింపజేయడానికి మార్గంగా ఉంటాయి.
విశేషంగా – ఫుట్‌బాల్ అకాడమీ & అంతర్జాతీయ చెస్
తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్‌లో హైదరాబాద్ అంతర్జాతీయ చెస్ టోర్నమెంట్కు సంబంధించిన ప్రకటనలు కూడా వెలువడనున్నాయి. క్రీడా రంగం, సాంస్కృతిక ప్రదర్శనలు, వినూత్న స్వాగతం—అన్ని తెలంగాణను ప్రపంచం ముందుకు తీసుకువెళ్ళే అవకాశంగా మారనుంది.
మహిళా ఫుట్‌బాల్ అకాడమీ ఎక్కడ ప్రారంభం అవుతోంది?
తెలంగాణలో, ఫిఫా–ఏఐఎఫ్ఎఫ్ భాగస్వామ్యంతో.
పురుషుల అకాడమీ కూడా ఉంటుందా?
అవును, తెలంగాణలోనే ఏర్పాటు చేయనున్నారు.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: