📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

Erragadda Hospital : ఎర్రగడ్డ హాస్పటల్ లో ఫుడ్​ పాయిజన్​.. ఒకరు మృతి!

Author Icon By Sudheer
Updated: June 3, 2025 • 8:01 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

హైదరాబాద్‌ నగరంలోని ఎర్రగడ్డ మానసిక ఆరోగ్యశాఖ ఆసుపత్రి(Erragadda Hospital)లో ఫుడ్ పాయిజన్ కేసు (Food Poisoning Case) తీవ్ర కలకలం రేపింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మానసిక రోగులకు సరఫరా చేసిన ఆహారం కారణంగా, ఒక్కసారిగా అనేక మంది రోగులు అస్వస్థతకు గురయ్యారు. వీరిలో 30 మందికి పైగా రోగులు వాంతులు, పేగుల నొప్పులు, తల తిరుగుడు వంటి లక్షణాలతో బాధపడుతూ చికిత్స కోసం హుటాహుటిన ఆసుపత్రి లోపలే ఐసోలేషన్ వార్డుల‌కు తరలించబడినట్లు సమాచారం.

మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది

అస్వస్థతకు గురైన రోగులకు వైద్యులు తక్షణమే చికిత్స ప్రారంభించారు. అయితే చికిత్స పొందుతూ ఒక మానసిక రోగి ప్రాణాలు కోల్పోయినట్టు తెలుస్తోంది. మృతుడి వివరాలు ఇంకా అధికారికంగా వెల్లడించలేదు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు వెలుగులోకి రావాల్సి ఉంది. ఈ ఘటనపై ఆసుపత్రి సిబ్బంది, ఫుడ్ సప్లై కాన్ట్రాక్టర్లపై దర్యాప్తు ప్రారంభించాల్సిన అవసరం ఉన్నట్లు నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

మానసిక రోగుల ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యం

ఫుడ్ పాయిజన్ ఘటనపై ప్రభుత్వం స్పందించి విచారణకు ఆదేశించాలని పలువురు ఆరోగ్య కార్యకర్తలు, ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. మానసిక రోగుల ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యం వహించరాదని, భవిష్యత్‌లో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. ప్రస్తుతం ఆసుపత్రిలో పరిస్థితిని అధికారులు సమీక్షిస్తున్నారని తెలుస్తోంది.

Read Also : ABV:శవాలపై రాజకీయాలు చేసే వ్యక్తి జగన్: ఏబీవీ

dies Erragadda Hospital food poisoning Latest News in Telugu

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.