సంగారెడ్డి Flood Relief : వరద బాధితులను అన్ని విధాల ఆడుకుం టామని వరద సహాయక చర్యలపై ఇప్పటికే కోటి రూపాయలు (One crore rupees) మంజూరు చేశామని అత్యధిక నిధుల మంజూరుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని మెదక్ జిల్లా ఇన్చార్జి మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి తెలిపారు. గురువారం కలెక్టరేట్ కార్యాలయంలో మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిల్రావు, ప్రత్యేక అధికారి డాక్టర్ హరీష్, జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్, అదనపు కలెక్టర్ నగేష్, ఇతర శాఖల జిల్లా అధికారులతో మెదక్ జిల్లా భారీ వర్షాలు వరదలు సహాయక చర్యలపై సమీక్షించారు. ఈ సంద ర్భంగా మంత్రి మాట్లాడుతూ ఒడిశాలో ఏర్పడిన ఉపరితల ద్రోని వలన మెదక్ జిల్లా వ్యాప్తంగా అధిక వర్షాలు కురుస్తున్నాయన్నారు. 40 యేళ్లలో మెదక్ జిల్లాలో ఇంత మేరకు అత్యధిక భారీ వర్షపాతం చూడలేదన్నారు. పునరావాస కేంద్రాల్లో వరద బాధి తులకు జిల్లా యంత్రాంగం అన్ని సౌకర్యాలు కల్పిస్తుందన్నారు. వరద నీరుచేరి బిల్డింగ్పైకి చేరుకున్న ప్రజలను హెలికాప్టర్ ద్వారా తరలించాలని మెదక్ నియోజకవర్గ శాసనసభ్యుడు మైనపల్లి రోహిర్రావు విజప్తి చేసినప్పటికీ వాతావరణ ప్రతికూల ప్రభావంతో హెలికాప్టర్ వెళ్లలేని పరిస్థితి నెలకొందని చెప్పారు. వారిని విపత్తు నిర్వహణ బృందం సహాయక చర్యలు నిమగ్నమై పునరావస కేంద్రాలకు తరలిం చామన్నారు.
మెదక్ జిల్లాలో వరద ప్రభావిత ప్రాంతాల పర్యటనలో మంత్రి వివేక్
అనంతరం ఇరిగేషన్ వ్యవసాయ శాఖ, పంచా యతీరాజ్, ఆర్ అండ్బి శాఖలవారీగా వరద నష్టాన్ని తెలుసుకున్నారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ మాట్లాడుతూ ప్రకృతి విపత్కర పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కోవడానికి జిల్లా పాలన యంత్రాంగం అప్రమత్తంగా ఉందన్నారు. మెదక్ జిల్లా భారీ వర్షాలు వరద ఉధృతిపై హవేలి ఘనపూర్ మండలం జలదిగ్బంధంలో చిక్కుకుందని అత్యధికంగా 300 మిల్లీమీటర్లు మీటర్స్ (300 millimeters) వర్షపాతం నమోదయిందని తెలిపారు. రామాయం పేటలో వరద ఉధృతి వలన మిషన్ భగీరథ పైప్లాన్ ధ్వంసం కాగా వెంటనే పునరుద్దరించామన్నారు. అనంతరం మంత్రి వరదప్రభావిత ప్రాంతాల్లో మంత్రి వివేక్ వెంకటస్వామిపర్యటించారు. పునరావాస కేంద్రాలలో ప్రజల సౌకర్యాలు అడిగి తెలుసుకున్నారు, హెల్త్ క్యాంపును సందర్శించి ఎటు వంటింటి అనారోగ్య పరిస్థితి తలెత్తకుండా చికిత్సలు అందించా లన్నారు. కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.
READ HINDI NEWS : hindi.vaartha.com
READ ALSO :