Fire Safety Awareness: ప్రజల భద్రతకు హైడ్రా పెద్దపీట

Read Time:  1 min
Fire Safety Awareness: ప్రజల భద్రతకు హైడ్రా పెద్దపీట
FONT SIZE
GET APP

-జాగ్రత్తలతోనే అగ్ని ప్రమాదాలకు చెక్

హైదరాబాద్ : నిప్పుతో ఊహించని ముప్పు ఉంటుంది. 30 సెకెండ్ల సమయంలో మంటలు వ్యాపించే పరిస్థితి ఉంది. వచ్చేది వేసవి కాలం.. జాగ్రత్తలు తీసు కుంటే అగ్ని ప్రమాదాలను నివారించవచ్చు. అగ్ని మాపక నిబంధనలన్నీ తూచా తప్పకుండా(Fire Safety Awareness) అందరూ పాటించాలి. వచ్చేది వేసవి కాలం.. మరింత ప్రమాదం పొంచి ఉంది. నగరంలో జరిగిన అనేక అగ్ని ప్రమాదాలను పరిశీలిస్తే నిబంధనలు పాటించకపోవడమే ప్రధాన కారణంగా కనిపిస్తోంది.

Read Also:TG Municipal Election Results: కాంగ్రెస్ లీడ్, బీఆర్‌ఎస్ తొలి విజయం

Fire Safety Awareness: Hydra is a big player in public safety
Fire Safety Awareness: Hydra is a big player in public safety

అందుకే హైడ్రా అగ్ని ప్రమాదాలపై దృష్టి పెట్టింది. ఈ క్రమంలోనే అవగాహన కార్యక్రమాలను పెద్ద యెత్తున చేస్తూ వస్తోంది అని హైడ్రా కమిష నర్ రంగనాథ్ తెలిపారు. ఈమేరకు గురువారం అగ్ని ప్రమాదాలపై పాతబస్తీలో నిర్వహించిన అవ గాహన కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే జుల్ఫీకర్ తో కలిసి రంగనాథ్ ప్రసంగించారు. తరచూ జరుగుతున్న అగ్ని ప్రమాదాల నేపథ్యంలో జన వరి నెలాఖరులో తనిఖీలు చేపట్టి 9 షాపులను సీజ్ చేసినట్టు గుర్తు చేశారు. పలు వ్యాపార సం ఘాల వినతుల మేరకు ఒక నెల రోజులు సమ యం ఇచ్చామని.. మార్చి నెల రెండో వారం నుం చి తనిఖీలు ముమ్మరం చేస్తామన్నారు. నిబంధనలు పాటించకపోతే ఆయా వ్యాపార సముదాయా లను, షాపులను సీజ్ చేస్తామని రంగనాథ్ హెచ్చరించారు.

వేధించడం కాదు.. జాగ్రత్త పడడం..

అగ్ని ప్రమాదాల నేపథ్యంలో హైడ్రా తనిఖీలు చేయడం.. నిబంధనలు పాటించకని వ్యాపార సు ముదాయాలను సీజ్ చేయడాన్ని వేధించడంగా భావించవద్దని.. జాగ్రత్త పడడంగా పరిగణించా లని రంగనాథ్ అన్నారు. ఎవరైనా నిబంధనలు పాటించకపోతే తమకు సమాచారం ఇవ్వాలని వ్యాపార సంఘాల ప్రతినిధులతో పాటు.. పౌరు లను కోరారు. ప్రజల భద్రతకు హైడ్రా పెద్ద పీట వేస్తుందన్నారు. వ్యాపారాలు ప్రశాంతంగా చేసు కోండి.. జాగ్రత్తలు పాటించండి.. మీతో పాటు.. మీ విలువైన వినియోగదారుల భద్రత గురించి ఆలోచించండి చెప్పారు. ఈ సందర్భంగా గతంలో జరిగిన అగ్ని ప్రమాదాల వీడియోలు, రెస్క్యూ ఆపరేషన్లు, అగ్ని ప్రమాదాలకు గల కారణాలను వివరిస్తూ ప్రదర్శనలు నిర్వహించారు.

అగ్ని ప్రమాదాలకు ఎవరు బాధ్యులు అనేది గ్రహించాలని చార్మినార్ ఎంఎల్ఎ జల్ఫికర్ అన్నారు. ప్రమా దాలు జరగక ముందే అప్రమత్తమవ్వాలని సూచిం చారు. రంజాన్ మాసం వ్యాపారాలు జరుగుతా యి స్టాకును భద్రపరిచినప్పుడు జాగ్రత్తలు తీసుకో వాలన్నారు. ఎవరికి వారు చెక్ చేసుకోవాలని సూచించారు. ఈకార్యక్రమంలో హైడ్రా అడిషనల్ డైరెక్టర్ వర్ల పాపయ్య, విద్యుత్ విభాగం అధికారి ఏవీ రామారావు, సిటీ ప్లానర్ శ్రీనివాస్ రెడ్డి తో పలు విభాగాలకు చెందిన అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

Tejaswini Y

రచయిత గురించి

Tejaswini Y

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.