Fire Accident : నిమ్స్‌ ఎమర్జెన్సీ విభాగంలో అగ్ని ప్రమాదం

Read Time:  1 min
Fire breaks out at NIMS emergency department
Fire breaks out at NIMS emergency department
FONT SIZE
GET APP

Fire Accident : హైదరాబాద్​ నిమ్స్(నిజాం ఇన్​స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్) అత్యవసర విభాగంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఎమర్జెన్సీ విభాగంలో ఉన్న ఐదో అంతస్థు భవనంలో మంటలు చెలరేగాయి. దీంతో దట్టమైన పొగ అలుముకుంది. కిటికీల నుంచి దట్టమైన పొగలు బయటకు రావడంతో అటుగా వెళ్లే వాహనదారులు భయబ్రాంతులకు గురయ్యారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది వచ్చి మంటలు ఆర్పేశారు.

నిమ్స్‌ ఎమర్జెన్సీ విభాగంలో అగ్ని

ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదు.

మంటలు అంటుకున్న ఐదో అంతస్తులో రోగులు ఎవరూ లేకపోవడంతో ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదు. ఆస్తినష్టం గురించి ఇంకా అంచనా వేయాల్సి ఉంది. లిఫ్ట్ పక్కన ఉన్న ప్యానల్ బోర్డులో షార్ట్ సర్క్యూట్ వచ్చి మంటలు అంటుకున్నాయని ప్రాథమికంగా గుర్తించారు. అక్కడ వార్డులు కాకుండా ఆడిటోరియం ఉండడంతో రోగులకు ఎలాంటి ఇబ్బంది కాలేదని వైద్యులు తెలిపారు. అయితే నిమ్స్ ఆసుపత్రిలో మంటలు అంటుకున్నాయన్న సమాచారంతో ఎమర్జెన్సీ విభాగంతో పాటు, ఇతర బ్లాక్​లలో రోగులు, వారి సహాయకులు భయాందోళనకు గురయ్యారు.

షార్ట్ సర్క్యూట్ వల్ల చిన్న అగ్ని ప్రమాదం

అగ్ని ప్రమాద ఘటనపై నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ బీరప్ప స్పందించారు. ఐదో ఫ్లోర్ ఆడిటోరియంలో షార్ట్ సర్క్యూట్ వల్ల చిన్న అగ్ని ప్రమాదం జరిగిందన్నారు. ముందు జాగ్రత్తగా నాలుగో అంతస్తులో కావాలని కరెంట్ ఆపేశామని ప్రకటించారు. నాలుగో ఫ్లోర్​లోని రోగుల్ని వేరే వార్డుకి షిఫ్ట్ చేస్తున్నామని, ప్రమాదం జరిగిన చోట రోగులు ఎవరూ లేరని బీరప్ప తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటి పొరపాట్లు జరగకుండా చూస్తాం, ఎవరు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు డైరెక్టర్ డాక్టర్ బీరప్ప తెలిపారు.

Read Also : ఓటు వేయ‌వ‌ద్దంటూ కార్పొరేట‌ర్లుకు బిఆర్ఎస్ ఆదేశాలు

sumalatha chinthakayala

రచయిత గురించి

sumalatha chinthakayala

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.