📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

హైదరాబాద్ చెరువుల్లో పతంగుల పండుగ ఏర్పాట్లు పెండింగ్ ఈ-చలాన్లపై సైబర్ క్రైమ్ పోలీస్ ల సూచనలు యూరియా యాప్ 5 జిల్లాల్లో ప్రయోగాత్మకంగా అమలు ఐటీ ఉద్యోగుల కోసం స్పెషల్ బస్సులు ప్రేమికుడి వేధింపులతో బిటెక్ విద్యార్థిని ఆత్మహత్య తెలంగాణ పరిషత్ ఎన్నికలపై సీఎం రేవంత్ మంత్రుల భేటీ మెడికల్ స్టూడెంట్స్ కు స్పెషల్ కమ్యూనికేషన్ క్లాసులు తెలంగాణలో కొనసాగుతున్న చలి తీవ్రత తెలంగాణలో మహిళలకు ఉచిత బస్ పాస్ తెలంగాణలో ‘అరైవ్.. అలైవ్’ పేరుతో ప్రత్యేక కార్యక్రమం హైదరాబాద్ చెరువుల్లో పతంగుల పండుగ ఏర్పాట్లు పెండింగ్ ఈ-చలాన్లపై సైబర్ క్రైమ్ పోలీస్ ల సూచనలు యూరియా యాప్ 5 జిల్లాల్లో ప్రయోగాత్మకంగా అమలు ఐటీ ఉద్యోగుల కోసం స్పెషల్ బస్సులు ప్రేమికుడి వేధింపులతో బిటెక్ విద్యార్థిని ఆత్మహత్య తెలంగాణ పరిషత్ ఎన్నికలపై సీఎం రేవంత్ మంత్రుల భేటీ మెడికల్ స్టూడెంట్స్ కు స్పెషల్ కమ్యూనికేషన్ క్లాసులు తెలంగాణలో కొనసాగుతున్న చలి తీవ్రత తెలంగాణలో మహిళలకు ఉచిత బస్ పాస్ తెలంగాణలో ‘అరైవ్.. అలైవ్’ పేరుతో ప్రత్యేక కార్యక్రమం

Breaking News – Fire Accident : సూర్యాపేట వద్ద మరో ప్రైవేటు ట్రావెల్స్ బస్సు దగ్ధం

Author Icon By Sudheer
Updated: November 11, 2025 • 7:05 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తెలంగాణ రాష్ట్రంలో మరోసారి భయానక బస్సు ప్రమాదం సంభవించింది. విజయవాడ-హైదరాబాద్ నేషనల్ హైవేపై నల్గొండ జిల్లా చిట్యాల మండలం వెలిమినేడు వద్ద ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ‘విహారి ట్రావెల్స్’కు చెందిన ప్రైవేట్ బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. బస్సు ఆ సమయంలో హైదరాబాద్ వైపుకు ప్రయాణిస్తోంది. అకస్మాత్తుగా వెనుక భాగంలో పొగలు రావడం గమనించిన డ్రైవర్ వెంటనే వాహనాన్ని రోడ్డుపక్కకు ఆపాడు. ఆ సమయంలో బస్సులో మొత్తం 29 మంది ప్రయాణికులు ఉన్నారు. పరిస్థితి అత్యంత విషమంగా మారడంతో వారు అద్దాలు పగులగొట్టి బయటకు దూకి ప్రాణాలను రక్షించుకున్నారు. కొన్ని క్షణాల్లోనే బస్సు పూర్తిగా మంటల్లో కాలి బూడిదైంది.

Bomb Blast : ఢిల్లీలో జరిగిన మేజర్ బాంబు దాడులు ఇవే !!

సాక్షుల సమాచారం ప్రకారం, మంటలు చెలరేగిన వెంటనే భయాందోళన చెందిన ప్రయాణికులు అరుస్తూ బయటపడేందుకు ప్రాణాలు పణంగా పెట్టారు. కొందరికి స్వల్ప గాయాలు అయినప్పటికీ పెద్ద ప్రమాదం తప్పింది. బస్సు మంటల్లో చిక్కుకోవడానికి కారణం ఏమిటనే దానిపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ప్రాథమికంగా ఇంజిన్ వైర్ షార్ట్ సర్క్యూట్ కారణం అయి ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు. అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ఆ సమయంలో రహదారిపై భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది.

ఇటీవలే కర్నూలు జిల్లాలో వీ. కావేరి ట్రావెల్స్ బస్సు దగ్ధమై 19 మంది సజీవ దహనమవడం దేశవ్యాప్తంగా విషాదాన్ని మిగిల్చింది. ఆ ఘటన షాక్ నుంచి ప్రజలు ఇంకా కోలుకోకముందే మరోసారి ఇలాంటి ప్రమాదం జరగడం ఆందోళన కలిగిస్తోంది. బస్సు సాంకేతిక సమస్యలు, భద్రతా ప్రమాణాల లోపం కారణంగా ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. ప్రైవేట్ ట్రావెల్స్‌పై పర్యవేక్షణను కట్టుదిట్టం చేయాలని, వాహనాల నిర్వహణ, సర్వీసింగ్ పట్ల కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. ప్రభుత్వం కూడా ఈ ఘటనపై పూర్తి స్థాయి విచారణ జరిపించాలని అధికారులు సూచిస్తున్నారు.

Read hindi news: https://hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Bus Accident Google News in Telugu Suryapet vihari travels bus vihari travels bus accident

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.