Fino Bank CEO: ఫినో బ్యాంక్ CEO రిషి గుప్తాను డీజీజీఐ హైదరాబాద్‌లో (Hyderabad) అరెస్ట్ చేసింది. ఆన్లైన్లో గేమింగ్ సిండికేట్పై రిషి గుప్తాను అరెస్ట్ చేశారు ఆన్లైన్ గేమింగ్ నిర్వహణలో జీఎస్టీ ఎగ్గొట్టినట్లు, రూ. 13 కోట్ల ఆన్లైన్ గేమింగ్ సిండికేట్ జరిగినట్లు గుర్తించారు. వీటిలో ఎక్కువగా ఫినో బ్యాంక్ ద్వారా లావాదేవీలు జరిగాయి. ఫినో బ్యాంక్ రూ. 840 కోట్ల ట్యాక్స్ ఎగ్గొట్టినట్లు అధికారులు తెలిపారు. ఇక రిషి గుప్తాను కోర్టులో హాజరుపర్చగా 14 రోజుల రిమాండ్ విధించింది.
Read Also: Thirumalagiri Municipality: తిరుమలగిరిలో పోలీసుల అత్యుత్సాహం
రూ. 13 వేల కోట్ల స్కామ్
13 వేల కోట్ల స్కాంలో ఫినో బ్యాంక్ ద్వారా 3 వేల కోట్ల లావాదేవీలు జరిగినట్లు గుర్తించారు. అధికారులు. ఫినో బ్యాంకు 840 కోట్లు రూపాయలు ట్యాక్స్ ఎగొట్టినట్లు తెలిపారు అధికారులు. ఈ పరిణామాల క్రమంలో స్టాక్ ఎక్చేంజ్ కు వివరణ ఇచ్చింది ఫినో పేమెంట్స్ బ్యాంకు. ఈ వ్యవహారం బిజినెస్ పాట్నార్లకి సంబంధించినది కానీ.. బ్యాంక్ కు ఎలాంటి సంబంధం లేదని వివరణ ఇచ్చింది ఫినో పేమెంట్స్ బ్యాంకు. ఈ క్రమంలో ఫినో బ్యాంక్ CFO గా ఉన్న కేతన్ మర్చంట్ ను తాత్కాలిక CEO గా నియమించింది ఫినో బ్యాంకు. సీఈఓ రిషి గుప్తా అరెస్టుతో ఫినో బ్యాంకు షేర్లు 7.5శాతం పడిపోయాయి.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: