📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

Telugu Film Chamber: షూటింగులు నిలిపివేయండి..ఫిలిం ఛాంబర్ కీలక ఆదేశాలు

Author Icon By Vanipushpa
Updated: August 8, 2025 • 4:35 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తెలుగు సినీ పరిశ్రమలో కార్మికుల వేతనాల పెంపు వివాదం తీవ్రరూపం దాల్చింది. నిర్మాతలు, ఫిల్మ్ ఫెడరేషన్ మధ్య జరిగిన చర్చలు విఫలం కావడంతో కీలక పరిణామం చోటుచేసుకుంది. తదుపరి ఆదేశాలు జారీ చేసే వరకు అన్ని రకాల సినిమా షూటింగ్‌లను తక్షణమే నిలిపివేయాలని తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్(Film Chamber of Commerce) నిర్మాతలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. దీంతో టాలీవుడ్‌లో చిత్రీకరణలన్నీ ఒక్కసారిగా ఆగిపోయాయి.
ఫిల్మ్ ఫెడరేషన్ యూనియన్లు డిమాండ్
గత కొంతకాలంగా సినీ కార్మికులకు 30 శాతం వేతనాలు పెంచాలని, వాటిని రోజువారీగా చెల్లించాలని ఫిల్మ్ ఫెడరేషన్ యూనియన్లు(Film Federation Union) డిమాండ్ చేస్తున్నాయి. అయితే, ఈ ప్రతిపాదనను నిర్మాతల మండలి అంగీకరించడం లేదు. ప్రస్తుతం ఇస్తున్న వేతనాలు కనీస వేతనాల కన్నా ఎక్కువే ఉన్నాయని, ఫెడరేషన్ ఏకపక్షంగా వ్యవహరిస్తోందని ఫిల్మ్ ఛాంబర్ ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలోనే షూటింగ్‌ల నిలిపివేతకు పిలుపునిచ్చింది.
షూటింగ్‌లు జరపవద్దని ఫిల్మ్ ఛాంబర్ స్పష్టం
ఈ సమస్యను పరిష్కరించేందుకు గురువారం కో-ఆర్డినేషన్ కమిటీ ఆధ్వర్యంలో నిర్మాతలు, ఫిల్మ్ ఛాంబర్ ప్రతినిధులు, ఫెడరేషన్ నాయకులతో సమావేశం జరిగింది. అయినప్పటికీ, ఈ భేటీలో ఎలాంటి సయోధ్య కుదరలేదు. ఈ వివాదాన్ని పరిశ్రమ అగ్ర కథానాయకులు చిరంజీవి, బాలకృష్ణ దృష్టికి కూడా తీసుకెళ్లినట్లు సమాచారం. మరో నాలుగు రోజుల్లో చర్చల ద్వారా సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తామని కో-ఆర్డినేషన్ కమిటీ ఛైర్మన్ వీర శంకర్ తెలిపారు. అప్పటివరకు ఎలాంటి షూటింగ్‌లు జరపవద్దని ఫిల్మ్ ఛాంబర్ స్పష్టం చేసింది.

తెలుగు సినిమాలకు ప్రధాన కేంద్రం ఏది?
ప్రసాద్, అక్కినేని నాగేశ్వరరావు మరియు డి. రామానాయుడు. దాదాపు మూడు దశాబ్దాల క్రితం వరకు, తెలుగు సినిమా పరిశ్రమలోని పెద్ద విభాగాలు చెన్నై నుండి పనిచేశాయి. కానీ నేడు, తెలుగు సినిమా నిర్మాణ కార్యకలాపాలన్నీ హైదరాబాద్‌లోనే కేంద్రీకృతమై ఉన్నాయి.
రఘుపతి వెంకయ్య నాయుడు
రఘుపతి వెంకయ్య నాయుడు, తరచుగా తెలుగు చిత్ర పరిశ్రమ పితామహుడిగా పరిగణించబడతారు, స్టార్ ఆఫ్ ది ఈస్ట్ ఫిల్మ్స్ మరియు గ్లాస్ స్టూడియోను స్థాపించిన మార్గదర్శక వ్యక్తి.

Read hindi news: hindi.vaartha.com

Read also:

https://vaartha.com/crime-constable-dies-on-the-spot-after-being-hit-by-a-bullet-in-the-head/crime/527854/

Cinema regulations Film Chamber orders Film industry updates Latest News Breaking News Movie shootings stopped Production issues Shooting halt Telugu News Tollywood News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.