📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

Today News : Fertilizers : 2 లక్షల టన్నుల ఎరువులు తెచ్చేవారికే మద్దతు – కెటిఆర్

Author Icon By Shravan
Updated: August 21, 2025 • 3:14 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Fertilizers : తెలంగాణ రాష్ట్రానికి సెప్టెంబర్ 9 లోపు ఎవరు 2 లక్షల టన్నుల ఎరువులు తీసుకువస్తారో ఆ పార్టీ ఉపరాష్ట్రపతి అభ్యర్థికి బీఆర్ఎస్ (BRS) మద్దతు ఇస్తుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తేల్చి చెప్పారు. బుధవారం ఆయన నందీనగర్లో మీడియాతో మాట్లాడుతూ, తెలంగాణలో 2 నెలలుగా దయనీయమైన పరిస్థితి నెలకొందని కేటీఆర్ అన్నారు. యూరియా కోసం రైతులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని, రాష్ట్ర ప్రభుత్వం చేతకానితనం వల్ల ఇలాంటి పరిస్థితి దాపురిచిందనివిమర్శించారు. ఎరువుల బస్తాల కోసం రైతులు ఎన్నో అవస్థలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పదేళ్ల కేసీఆర్ పాలనలో ఎప్పుడూ ఇలాంటి దుస్థితి రాలేదని గుర్తు చేశారు. వ్యవసాయ శాఖపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎలాంటి సమీక్ష చేయలేదని అన్నారు. ముందస్తు ప్రణాళిక లేకుండా పాలన సాగిస్తున్నారని, వ్యవసాయ శాఖతో ఇతర శాఖలకు సమన్వయం లేకుండా పోయిందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వాకం కారణంగా రైతులు ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు. ఒక రైతు 3 బస్తాల యూరియా తీసుకుంటే నాన్బెయిలబుల్ కేసు పెట్టారని విమర్శించారు.

ఉప రాష్ట్రపతి ఎన్నికలపై బీఆర్ఎస్ వైఖరి స్పష్టత

కాంగ్రెస్ నేతలు బ్లాక్ మార్కెట్లో యూరియా విక్రయిస్తున్నారని ఆరోపించారు. ఢిల్లీకి 51 సార్లు వెళ్లిన రేవంత్ రెడ్డి ఒక్క బస్తా యూరియా కూడా తీసుకురాలేక పోయారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్, బీజేపీ రెండుపార్టీలు రైతులను మోసం చేస్తున్నాయని కేటీఆర్ ఆరోపించారు. ఉప రాష్ట్రపతి ఎన్నికల విషయంలో మీ పార్టీ స్టాండ్ ఏంటీ అన్న ప్రశ్నలకు కేటీఆర్ సమాధానం ఇచ్చారు. వైస్ ప్రెసిడెంట్ ఎన్నిక (Vice President Election) విషయంలో అటు ఎన్డీఏ, ఇటు ఇండియా తమ అ అభ్యర్థులన్ని ప్రకటించాయి. కానీ, బీఆర్ఎస్ అనేది సర్వస్వతంత్రమైన పార్టీ. మాకు ఢిల్లీలో ఎవరూ బాస్లు లేరు. ఏ పార్టీ మా బాస్ కాదు. మా బాస్లు ఎవరైనా ఉన్నారంటే.. తెలంగాణ ప్రజలే తప్ప.. మాకు ఢిల్లీలో ఆజపించే, ఆదేశించేవారు ఎవరూ లేరు. మా పార్టీని ఇప్పటి వరకు సంప్రదించలేదు. ఈ కూటమి, ఆ కూటమి ఎవరూ మమ్మల్ని సంప్రదించలేదు, మమ్మల్ని అడగలేదు. ఏం ఒక పార్టీగా కేవలం మీడియాలో చూసిందే తప్ప ఉప రాష్ట్రపతి ఎన్నిక జరుగుతుందని.. తమని సంప్రదించింది లేదు. ఇంకా టైమ్ ఉంది. సెప్టెంబర్ 9న ఎన్నిక కాబట్టి.. కూర్చొని ఆలోచించి.. ఎన్నికల తేదీ నాటికి మా వైఖరిని ప్రకటిస్తాం. ఒకటి మాత్రం గుర్తు చేస్తున్నా. మేం ఎన్డీఏ కూటమిలో, ఇండియా కూటమిలో లేము. ఇద్దరు అభ్యర్థుల్లో ఎవరికి మద్దతు చేయాలనే విషయంలో ఢిల్లీ నుంచి ఎలాంటి ఒత్తిడి లేదు. ఏ ఒత్తిడికి తలొగ్గాల్సిన అవసరం లేదన్నారు.

బీఆర్ఎస్ స్వతంత్ర నిర్ణయం

తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా. ప్రయోజనాలకు అనుగుణంగా ఏ నిర్ణయమైనా తీసుకుంటాం. ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు అని స్పష్టం చేశారు. కాంగ్రెస్ అనే చిల్లర పార్టీ, థర్డ్ క్లాస్ పార్టీ ఇవాళ రాష్ట్రంలో ప్రజలను ఎంత అరిగోస పుచ్చుకుంటున్నదో రాష్ట్ర ప్రజలకు తెలుసు. అలాంటి థర్డ్ క్లాస్ ముఖ్యమంత్రి.. థర్డ్ క్లాస్ పార్టీ పెట్టిన అభ్యర్థిని మేం సమర్థిస్తామని మీరెలా అనుకుంటారు? అని ప్రశ్నించారు. ఉప రాష్ట్రపతి ఎన్నికల విషయంలో డ్రామా. నిన్న మొన్నటి వరకు ఇదే రేవంత్రెడ్డి ఏమన్నడు ? బీసీల విషయంలో మా పార్టీ చిత్తశుద్ధితో ఉన్నది. బలహీన వర్గాల విషయంలో ఢిల్లీ వరకు కొట్లాడుతాం.. అవసరమైతే అంతరిక్షం వరకైనా కొట్లాడుతం అన్నడు. మరి బీసీని అభ్యర్థిగా ఎందుకు పెట్టలేదు. అంత ప్రేమ ఉన్నప్పుడు బీసీ అభ్యర్థిని పెట్టలేదు. తెలంగాణ నుంచి బీసీ అభ్యర్థి దొరకలేదా? కంచ ఐలయ్యను పెట్టాల్సింది అన్నారు. ఆ ఇద్దరు అభ్యర్థులను సీరియస్ గా తీసుకోవాల్సిన ఆలోచన ఉంటుందని వ్యక్తిగతంగా నేను అనుకోను.

కానీ, నా అభిప్రాయం పార్టీ అభిప్రాయం కాదు. పార్టీగా కూర్చొని ఆలోచించి నిర్ణయం తీసుకుంటాం. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, ఇన్చార్జీలు, రాష్ట్ర కమిటీ.. అవసరమైతే కేసీఆర్తో అభిప్రాయాలు చెప్పి పార్టీగా ఒక నిర్ణయం తీసుకుంటాం. వ్యక్తిగతంగా మాత్రం కాంగ్రెస్, బీజేపీ దొందూ దొందే. రెండు తెలంగాణకు పనికివచ్చే పార్టీలు కాదు. రెండు ఢిల్లీ పార్టీలే, వాటిని పట్టించుకోవాల్సిన, వాటి రాజకీయం కోసం ఆలోచించాల్సిన అవసరం లేదనేది వ్యక్తిగతంగా నా అభిప్రాయం అన్నారు.

READ HINDI NEWS : hindi.vaartha.com

READ ALSO :

https://vaartha.com/insurance-recommendation-to-abolish-gst/national/533753/

agriculture news Breaking News in Telugu Fertilizers Support KTR News KTR Statement Latest News in Telugu Telangana politics Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.