📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

FCI : బియ్యం సేకరణకు ఒప్పుకోని ఎఫ్‌సిఐ

Author Icon By Shravan
Updated: August 12, 2025 • 5:20 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

హైదరాబాద్ : భారత ఆహార సంస్థ (FCI) తెలంగాణలో బియ్యం సేకరణకు మోకాలడ్డుపెడుతోంది. రైస్ మిల్లర్లు ప్రభుత్వానికి ఇవ్వాల్సిన కస్టం మిల్లింగ్ రైస్ దిగుమతికి గోదాములు ఖాళీలేవని అధికారులు నిరాకరిస్తు న్నారు.ప్రభుత్వానికి మిల్లర్లు ఇవ్వాల్సిన సిఎంఆర్ బియ్యం ఇచ్చేందుకు దిగుమతి కావటం లేదు. మిల్లుల ఆవరణలో ధాన్యం ఎక్కువ రోజులు నిల్వ ఉంటే నాణ్యత తగ్గుతుంది. నిల్వలు వెనక్కి తీసుకోవాలని అధికారులపై మిల్లర్లు ఇప్పడు ఒత్తిడి పెంచుతున్నారు. లేదా వెంటనే బియ్యం దిగుమతి చేసుకోవాలి. ఎఫ్సిఐ తెలంగాణలో తన సొంత గోదాములతోపాటు ఎస్ డబ్ల్యుసి, సెంట్రల్ వేర్హౌజ్గగిడ్డంగులు ఇతర ప్రైవేటు అద్దెగిడ్డంగుల్లో సుమారు ఇప్పటికే 22లక్షలమెట్రిక్ టన్నుల ధాన్యం నిల్వ చేశామని ఇక తెలంగాణలో మిల్లర్ల నుంచి ధాన్యం కొనుగోలు చేయలేమని చేతులు ఎత్తేయడంతో రాష్ట్రవ్యాప్తంగా మిల్లర్లు, రాష్ట్రప్ర భుత్వం గగ్గోలు పడుతోన్నది. తెలంగాణ వ్యాప్తం గా ఉన్న రైస్ మిల్లుల్లో, రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని పౌరసరఫరాల సంస్థ గోదాములు బియ్యం బస్తాలతో పూర్తిగా నిండిపోయాయి. ఎఫ్సిఐ తెలం గాణ బాయిల్డ్ రైస్ను సేకరించకుండా ఉండటానికే ఇక్కడి గోదాముల్లో నిండిన స్టాక్ను ఇతర ప్రాంతా లకు తరలించడంలేదని కొంత మంది రైస్ మిల్లర్లు ఆరోపిస్తున్నారు. కేంద్రప్రభుత్వరంగ సంస్థ ఎఫిసిఐ సిఎంఆర్ బియ్యం సేకరణ చేయకుండా ఉండేందుకు మే31తో ముగి సిన గడువును ఉద్దేశ్యపూర్వకంగా పెంచడంలేదని తెలుస్తోంది. గత ఖరీఫ్ సీజన్కు సంబంధించి గడచిన మే 31వ తేదీతో సిఎంఆర్ బియ్యం అప్పగించే గడువు ముగి సింది. ఇంకా మిల్లర్లు రాష్ట్రవ్యా ప్తంగా 43 శాతం ఖరీఫ్ బియ్యం అప్పగించాలి. కేంద్రం ఇప్పటివరకు గడువు పొడిగించలేదు. దీంతో గత ఖరీఫ్ సీజన్ కు సంబం ధించిన బియ్యం దిగుమతి చేసుకునే అవకాశం లేదు. ఇక రబీకి సంబంధించిన బియ్యం అప్పగించేందుకు మిల్లర్లు సిద్ధంగా ఉన్నా గోదాములు ఖాళీ లేవు. ఎఫ్సిఐకీ తెలంగాణ వ్యాప్తంగా ఆరు నుంచి ఏడు లక్షల మె.ట ఆహార ఉత్పత్తులను నిల్వచేసే సామర్థ్యం కలిగిన సొంత గిడ్డంగులు పరిమిత మైన స్థాయిలోనే ఉన్నాయి. నిజామాబాద్ జిల్లా డిచ్పల్లిలో పదివేల మెట్రిక్ టన్నుల సామ ర్థ్యం కలిగిన గిడ్డంగి ఉంది. మిర్యాలగూడలో 90వేల మెటన్నులు, నల్లగొడలలో 60వేల మెట. చర్లపల్లిలో లక్షా 25వేలమె.ట. ననత్నగర్లో 65వేలమె.ట, వరంగల్లో 1,10,000 మె.ట, జమ్మికుంటలో 62వేలమెట, పెద్దపల్లిలో 16వేలమె.ట. మంచిర్యాలలో 30వేల మె.ట సామర్థ్యం కలిగిన సొంత గిడ్డంగుల ఉన్నాయి. సొంతగిడ్డంగులతో పాటు అద్దెగిడ్డ గులలో రాష్ట్రవాప్తంగా సరుకు నింపి ఉంచారు. సరుకు ఉండగా మేం వేరే సరుకు తీసుకోమ. ఎఫ్సిఐ అధికారులు పంపుతున్నారు.

మిల్ల మాత్రం ఎఫిసిఐ ప్రతి నిల్వలను లాట్లుగా చే నిల్వచేస్తారని ఒక్కోలాటులో రెండు నుంమూడు ఎస్కీల బియ్యం ఖాళీలు (Rice vacancies of SKIs) ఉన్నప్పటి లాట్లు అన్ని నిండి ఉన్నాయని చెబుతున్నార ఆరోపిస్తున్నారు. ఆరు ఎస్కీల బియ్యం నిల చేస్తే ఒక లాటుగా చూపుతారు. ఎనెకె. 290మె.ట బియ్యం ఉంటాయి. బాయిల్డ్ రైనా తెలంగాణ నుంచి సేకరణ చేయవద్దనే ఇక్క సరుకు పొరుగు రాష్ట్రాలకు పంపడంలేద. తెలుస్తోంది. అదే విధంగా మహారాష్ట్ర, కర్ణాట చత్తీస్గఢ్ తమిళనాడు, కేరళలో వరివం-దిగుబడి పెరడంతో తెలంగాణ బాయిల్డ్ రైస్ దేశంలో డిమాండ్ తగ్గింది. దీనితో సిఎంఆ బియ్యం సేకరణ గడువు ముగిసినా మళ్లీ మొ చకుండా బియ్యం తీసుకోకుండా మోకాలడా పెడుతున్నారని వ్యాపారులు అంటున్నారు.

READ HINDI NEWS : hindi.vaartha.com

READ ALSO :

Breaking News in Telugu FCI Food Corporation of India Google news Latest News in Telugu Rice Procurement

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.