📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

News Telugu: Farmers: ఎట్టకేలకు నేటి నుండి మక్కల కొనుగోళ్లు

Author Icon By Rajitha
Updated: October 16, 2025 • 11:43 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Farmers: గత నెలాఖరు నుండే మార్కెట్లకు రాక హైదరాబాద్ : రాష్ట్రం లో ఎట్టకేలకు మార్క్ ఫెడ్ అధ్వర్యంలో మొక్క జొన్న కొనుగోళ్లు నేడు ప్రారంభంకానున్నాయి. ఈ మేరకు మార్కెఫెడ్ నేతృత్వంలో గురువారం నాడు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో మొక్కజొన్న పంటకు సంబంధించి ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో సేకరణ జరగనుంది. ఇందుకు గాను మార్కెఫెడ్ను నోడల్ ఏజెన్సీగా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రాష్ట్రం మొత్తం మీద 8.66 లక్షల టన్నుల మొక్కజొన్నను కొనుగోలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇక మొక్కజొన్నకు కేంద్రం కనీస మద్దతు ధర 2,400 రూపాయలు కాగా, రాష్ట్రంలోని వివిధ మార్కెట్లలో వీటి కొనుగోలు ధర రూ.1,800 రూపాయల నుండి 2 వేల రూపాయల వరకూ ఉంది. ఈ పరిస్థితుల్లో మార్కెఫెడ్ కొనుగోలు కేంద్రాల కోసం రైతులు ఎదురుచూస్తున్నారు. ముందుగా వేసిన మొక్కజొన్న దిగుబడులను అమ్ముకునేందుకు గత నెల మూడో వారం నుంచే రైతులు మార్కెట్లోకి తీసుకురావడం ప్రారంభించారు. అయితే ఇప్పటి వరకూ ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో దళారులు చెప్పిన రేటుకే అమ్ముకోవాల్సి వచ్చింది. దీనికి తగినట్లుగా వర్షాల నుంచి మొక్కజొన్నను కాపాడుకోవడం కత్తిమీద సామే అయింది.

kidnap case : హైదరాబాద్‌లో షాకింగ్ ఘటన 11 ఏళ్ల బాలికపై ఆటో డ్రైవర్ దాడి యత్నం చేసాడు.

Finally, maize purchases from today

రాష్ట్ర వ్యాప్తంగా మొక్కజొన్న (corn) సాధారణ విస్తీర్ణం 5,73,648 ఎకరాలు కాగా, ఈ ఖరీఫ్ సీజనులో 118.79 శాతం మేర 6,81,432 ఎకరాల్లో సాగైంది. గత ఏడాది ఇదే సీజనులో 5,69,305 ఎకరాల్లో సాగు కాగా, అంతకన్నా ఈసారి 1.12 మహబూబ్ నగర్ లో లక్షల ఎకరాల్లో ఎక్కువగా మొక్కజొన్న సాగు చేయడం విశేషం. అత్యధికంగా రాష్ట్రంలోని కొత్త గూడెం జిల్లాలో 96, 882 ఎకరాల్లో, రంగారెడ్డిలో 68,654 ఎకరాల్లో, మహబూబాబాద్ 62,566 ఎకరాలు, నాగర్ కర్నూలులో 56,906 ఎకరాలు, నిజామాబాద్ 52,093 ఎకరాల్లో, కామారెడ్డిలో (kamareddy) 50,728 ఎకరాలు, 37,700 ఎకరాలు, జగిత్యాలలో 32,463 ఎకరాల్లో మొక్కజొన్న సాగు చేశారు, అయితే ఇటీవల కాలంలో రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలు Farmers నిజామాబాద్, కామారెడ్డి, కొత్తగూడెం తదితర జిల్లాలో మొక్కజొన్న రైతులను నిండా ముంచాయి. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 50 వేలకు పైగా ఎకరాల్లో మొక్కజొన్న దెబ్బతింది. వర్షాలతో ఆరబోసిన మొక్కజొన్న పంట తడిసి ముద్దైంది. దీంతో మొక్కజొన్న పంట రంగు మారుతుంది. గింజ ఆరకముందే నానడంతో గింజలకు మొలక లొచ్చే ప్రమాదం ఏర్పడింది. దీంతో పెట్టిన పెట్టుబడి వస్తుందో రాదోనని ఆందోళన చెందుతున్నారు.

రాష్ట్రంలో మొక్కజొన్న కొనుగోళ్లు ఎప్పుడు ప్రారంభమవుతున్నాయి?
మార్క్‌ఫెడ్ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా మొక్కజొన్న కొనుగోళ్లు నేటి నుండి ప్రారంభమవుతున్నాయి.

ఈ కొనుగోళ్లకు నోడల్ ఏజెన్సీగా ఎవరు నియమితులయ్యారు?
మార్క్‌ఫెడ్‌ను నోడల్ ఏజెన్సీగా రాష్ట్ర ప్రభుత్వం నియమించింది.

Read hindi news: hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read Also:

agriculture news Farmers latest news maize procurement Markfed Telangana Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.