సాగర్ ఆయకట్టుకు సాగునీటిని విడుదల చేసిన డిప్యూటీ సిఎం భట్టివిక్రమార్క,
మంత్రి పొంగులేటి
కూసుమంచి (ఖమ్మం జిల్లా): కృష్ణా నది(Krishna) నీటిని తెలంగాణ రాష్ట్రం(Telangana State) సమృద్ధిగా వినియోగించేలా ప్రజా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు(DCM Bhatti Vikramarka) అన్నారు. డిప్యూటీ సీఎం, రాష్ట్ర రెవెన్యూ, హౌజింగ్, సమాచార పౌరసంబంధాల శాఖల -మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డిలు, జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి. ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్ లతో కలిసి, కూసుమంచి మండలంలో పర్యటించి, పాలేరు వద్ద పాలేరు రిజర్వాయర్ నుండి నాగార్జున సాగర్ లెఫ్ట్ లాల్ బహదూర్ కెనాల్ ద్వారా ఆయకట్టుకు ఖరీఫ్ సాగుకు సాగు నీటిని విడుదల చేసారు.
పాలేరు రిజర్వాయర్ ఆయకట్టుకు సాగునీరు నేడు విడుదల
ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ నాగార్జున సాగర్ జోన్ 2, పాలేరు రిజర్వాయర్ ఆయకట్టుకు సాగునీరు నేడు విడుదల చేస్తున్నామని అన్నారు. వ్యవసాయ రంగం, విద్యుత్, బహుళ సార్ధక ప్రాజెక్టులకు మన ప్రజా ప్రభుత్వం చర్యలు తీసుకుందని అన్నారు. రాష్ట్రంలో ఆహార ధాన్యాలను ఉత్పత్తి
చేయడంలో రైతాంగం 65 శాతంమంది. వ్యవసాయం పై ఆధారపడి ఉన్నారని ఉప ముఖ్యమంత్రి భట్టి అన్నారు. కార్యక్రమంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ పాలేరు రిజర్వాయర్ కింద ఉన్న 2 లక్షల 53 వేల ఎకరాల నాగార్జున సాగర్ ఆయకట్టుకు నీరు విడుదల చేశామని అన్నారు. గత ఏడాది సెప్టెంబర్ మొదటి వారంలో కురిసిన భారీ వర్షాలకు ఖమ్మం జిల్లాలో అనేక ప్రాంతాలు ముంపునకు గురయ్యాయని, నాగార్జునసాగర్ ప్రధాన కాలువ, అనేక యూటీ లు కొట్టుకు పోయాయని, వాటిని యుద్ధ ప్రాతిపదికన పునరుద్ధరణ చేశామని తెలిపారు. ప్రస్తుతం 400 క్యూసెక్కుల నీరు విడుదల చేశామని, క్రమ పద్ధతిలో 5 రోజులలో పూర్తి సామర్థంతో నీటి విడుదల చేయడం జరుగుతుందని అన్నారు .
Read hindi news: hindi.vaartha.com
Read also: Murder: కాంగ్రెస్ యువ నాయకుని దారుణ హత్య