హైదరాబాద్ : చేసిన అప్పులు తీర్చలేక, ఆర్థిక ఇబ్బందులతో రాష్ట్రంలోని వేర్వేరు జిల్లాలకు చెందిన ముగ్గురు రైతులు(Farmers)ఆత్మహత్య(suicide)చేసుకున్నారు. రాష్ట్రంలోని సిరిసిల్లా, హనుమకొండ, మహబూబాబాద్ జిల్లాల్లో ఈ సంఘటనలు చోటుచేసుకున్నాయి. స్థానికుల కధనం ప్రకారం సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలం అచ్చన్నపేటకు చెందిన మొగిలి లక్ష్మణ్ (45) వేములవాడలోని రాజీవ్నగర్లో నివాసం ఉంటున్నారు. అద్దె వాహనాలతో జీవనోపాధి పొందుతూనే గ్రామం లో ఉన్న ఎకరంలో వ్యవసాయం చేస్తున్నాడు. రెండు బోర్లు వేసినా నీళ్లు పడకపోవడం, అద్దె వాహనాలు సరిగ్గా నడవకపోవడంతో అప్పులు పెరిగాయి. వీటిని తీర్చే స్థోమత లేక గత్యంతరం లేని పరిస్థితుల్లో సోమవారం పొలం వద్దకు వెళ్లిన లక్ష ్మణ్ పురుగులమందు తాగి బలన్మరణానికి పాలపడ్డారు. అలాగే మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం నారాయణపురం శివారు పీక్లా తండాకు చెందిన గుగులోత్ భాస్కర్ (40) శివారులో 3 ఎకరాలలో వ్యవసాయం చేస్తున్నారు.
Read also: కార్తీ వా వాతియర్ విడుదల ఎప్పుడంటే?
అయితే సాగు కలిసిరాకపోగా, చేసిన అప్పులు పెరిగిపోయి, కుటుంబ ఖర్చులు ఎక్కువై ఆర్థికంగా ఇబ్బందిపడుతున్నారు. ఈ క్రమంలో తన భూమికి పట్టా పాస్పుస్తకం లేకపోవడంతో దాన్ని అమ్ముకునే అవకాశం కూడా లేకుండాపోయింది. దీంతో అప్పులు తీర్చేమార్గం లేక ఇంటి ఆవరణలో ఉన్న పశువుల పాకలో ఉరేసుకుని(Farmers)ఆత్మహత్య చేసుకున్నారు. అలాగే హనుమకొండ జిల్లా శాయంపేట మండలానికి చెందిన నాలికె అనిల్ (29)కు సొంతంగా ఎకరం భూమి ఉండగా, మరో నాలుగు ఎకరాలు కౌలుకు తీసుకొని మూడేళ్లుగా సాగు చేస్తున్నారు. వ్యవసాయ పెట్టుబడి నిమిత్తం సుమారు రూ.2 లక్షల వరకు అప్పు చేశారు. అయితే ఈ యేడు వేసిన పత్తి పంట వరుసగా కురిసిన వర్షాలతో దెబ్బతిన్నది. ఈ క్రమంలో పంట పెట్టుబడికి చేసిన అప్పు తీర్చే మార్గం కానరాక, తీవ్ర మనస్తాపానికి గురై ఇంట్లో గడ్డిమందు తాగి ప్రాణాలు తీసుకున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/
Read Also: