📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

Fake Army Jawan : అరెస్ట్ ఆర్మీ ఉద్యోగమంటూ మోసం, మహిళలతో సన్నిహిత సంబంధాలు…

Author Icon By Sai Kiran
Updated: November 29, 2025 • 11:41 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Fake Army Jawan : ఈ రోజుల్లో ఎవరు నిజంగా ఏ వృత్తిలో ఉన్నారో, ఎవరు కేటుగాళ్లో గుర్తించడం సామాన్యులకు కష్టంగా మారింది. ప్రజలలోని నమ్మకాన్ని ఆసరాగా చేసుకుంటూ కొందరు నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు. తాజాగా హైదరాబాద్‌లో ఓ వ్యక్తి తాను భారత సైన్యానికి చెందిన జవాన్‌నని చెప్పుకొంటూ నిరుద్యోగ యువతను, మహిళలను మోసం చేస్తూ పోలీసుల చేతికి చిక్కాడు.

Latest news: Amaravati: అమరావతికి మరో 16వేల ఎకరాలు.. క్యాబినెట్ ఆమోదం

హైదరాబాద్‌ సైదాబాద్‌ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిందితుడు భారత వాయుసేన (ఎయిర్‌ఫోర్స్) యూనిఫాం ధరించి, తాను ఆర్మీ లేదా నేవీ అధికారి అని చెప్పుకుంటూ తిరుగుతూ ఉద్యోగాలు ఇప్పిస్తానని నిరుద్యోగ యువతను నమ్మించాడు. (Fake Army Jawan) అధికార పరిచయాలు ఉన్నాయని చెప్పి పలువురి నుంచి డబ్బులు వసూలు చేసినట్లు పోలీసులు గుర్తించారు.

అంతేకాకుండా, తనను సైనికాధికారిగా నమ్మిన మహిళలతో సన్నిహిత సంబంధాలు ఏర్పరచుకొని వారిని మోసం చేసినట్లు విచారణలో బయటపడింది. ఉన్నత హోదా చూపిస్తూ తప్పుడు హామీలు ఇచ్చి వారిని లోబర్చుకున్నాడని పోలీసులు తెలిపారు.

విశ్వసనీయ సమాచారం అందడంతో పోలీసులు ప్రత్యేకంగా వల పన్ని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు పంపించినట్లు తెలిపారు.

ఈ సందర్భంగా పోలీసులు ప్రజలకు హెచ్చరిక జారీ చేశారు. రక్షణ శాఖలకు సంబంధించిన ఉద్యోగాలు ఎలాంటి మధ్యవర్తుల ద్వారా రావని, కేవలం ప్రభుత్వ అధికారిక నియామక ప్రక్రియ ద్వారానే ఉంటాయని స్పష్టం చేశారు. తప్పుడు హామీలను నమ్మి మోసపోవద్దని నిరుద్యోగ యువతను కోరారు.

Read hindi news: https://hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Army Impersonation Case Army Job Scam India Breaking News in Telugu Fake Army Jawan Fake Defence Officer Arrest Fake Military Officer Scam Fake Navy Officer Google News in Telugu Hyderabad Fake Army Jawan Hyderabad police news Indian Army Fraud Case Job Scam News India Latest News in Telugu Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.