తెలంగాణ (Telangana) లోని సంగారెడ్డి జిల్లా పాశమైలారం ఇండస్ట్రియల్ (Pashamilaram Industrial) ఏరియా ఈరోజు ఉదయం ఒక్కసారిగా భయానక వాతావరణంలోకి జారింది. స్థానికంగా ఉన్న సిగాచీ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ కెమికల్ ఫ్యాక్టరీలో భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుడు క్షణాల్లోనే చుట్టుపక్కల ప్రాంతాన్ని కుదిపేసింది.
ప్రత్యక్ష సాక్షుల వర్ణన – 100 మీటర్ల దూరం ఎగిరిపడ్డ కార్మికులు
ఫ్యాక్టరీలో పని చేస్తున్న కార్మికులు ఒక్కసారిగా పేలుడు శబ్దంతో భయభ్రాంతులకు గురయ్యారు. పేలుడు తీవ్రత అంత తీవ్రంగా ఉండటంతో కొంతమంది కార్మికులు నేలపై పడిపోయి, మరికొందరు గాలిలోకి ఎగిరి 100 మీటర్ల దూరం వరకూ వెళ్లినట్లు అక్కడ ఉన్న ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.
20 మందికి తీవ్ర గాయాలు – ఆసుపత్రికి తరలింపు
ఈ ప్రమాదంలో మొత్తం 20 మంది కార్మికులకు తీవ్ర గాయాలయ్యాయని సమాచారం. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పేలుడు విషయం తెలిసిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలు అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ ప్రమాదంలో భారీగా ప్రాణ నష్టం జరిగిందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Read also: Telangana: పిసిసి ఉపాధ్యక్షులు, కార్యదర్శులకు పని విభజన