📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఆర్బీఐ గుడ్‌న్యూస్‌.. వేస్ అండ్ మీన్స్ అడ్వాన్స్ లిమిట్ పెంపు చలాన్ పడగానే డబ్బు కట్ అసైన్డ్ భూములపై కీలక ప్రకటన చేసిన మంత్రి పొంగులేటి రేపే పిఎస్ఎల్వి-సి62 ప్రయోగానికి కౌంటౌన్ సర్కారీ ఉద్యోగులకు1.02 కోట్ల ప్రమాద బీమా త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటన.. నిరుద్యోగులకు భరోసా ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం మీర్జాగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు విద్యార్థులు మృతి కొత్తగా యూరియా కార్డు డాక్టర్ లావణ్య ఆత్మహత్య కేసులో బిగ్ ట్విస్ట్ ఆర్బీఐ గుడ్‌న్యూస్‌.. వేస్ అండ్ మీన్స్ అడ్వాన్స్ లిమిట్ పెంపు చలాన్ పడగానే డబ్బు కట్ అసైన్డ్ భూములపై కీలక ప్రకటన చేసిన మంత్రి పొంగులేటి రేపే పిఎస్ఎల్వి-సి62 ప్రయోగానికి కౌంటౌన్ సర్కారీ ఉద్యోగులకు1.02 కోట్ల ప్రమాద బీమా త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటన.. నిరుద్యోగులకు భరోసా ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం మీర్జాగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు విద్యార్థులు మృతి కొత్తగా యూరియా కార్డు డాక్టర్ లావణ్య ఆత్మహత్య కేసులో బిగ్ ట్విస్ట్

తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలపై ఉత్కంఠ

Author Icon By Sudheer
Updated: March 11, 2025 • 11:46 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

రేపటి నుంచి తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానుండడంతో రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తి నెలకొంది. ప్రతిపక్ష నేత, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ అసెంబ్లీకి హాజరవుతారని పార్టీ వర్గాలు తెలిపిన నేపథ్యంలో ఈ సమావేశాలకు మరింత ప్రాధాన్యత ఏర్పడింది. బీఆర్ఎస్ శాసనసభ పక్ష సమావేశంలో కేసీఆర్ కీలక సూచనలు చేయడం, అసెంబ్లీలో ప్రభుత్వం తీసుకుంటున్న విధానాలను ఎండగట్టాలని ఆదేశించడం రాజకీయ వేడి పెంచుతోంది.

ప్రజా సమస్యలపై బీఆర్ఎస్ దాడికి సిద్ధం

తెలంగాణ భవన్‌లో జరిగిన బీఆర్ఎస్ శాసనసభ పక్ష సమావేశంలో కేసీఆర్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు కీలక సూచనలు చేశారు. రైతుల సమస్యలు, సాగునీటి కొరత, మోటార్ల కాలిపోవడం, ఎండిన పంటలు వంటి అంశాలను అసెంబ్లీలో ప్రస్తావించాలని సూచించారు. అలాగే, బీసీ, ఎస్సీ రిజర్వేషన్లకు మద్దతుగా పోరాడాలని, గురుకుల పాఠశాలల పరిస్థితిపై చర్చించాలని తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగుల పెండింగ్ డీఏలు, పీఆర్‌సీ అమలుపై ప్రస్తావిస్తూ, వీటిపై ప్రభుత్వాన్ని కఠినంగా ప్రశ్నించాలని ఆదేశించారు.

కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలపై నిరసన

కేసీఆర్ తన పార్టీ శాసనసభ్యులకు, మండలి సభ్యులకు కాంగ్రెస్ ప్రభుత్వ అనుసరిస్తున్న విధానాలను తీవ్రంగా ప్రశ్నించాలని సూచించారు. ఆరు గ్యారంటీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం మోసపూరిత వైఖరి అవలంబిస్తోందని, దీని మీద అసెంబ్లీలో చర్చించాలన్నారు. విద్యార్థులకు ఓవర్సీస్ స్కాలర్‌షిప్‌లు విడుదల కాకపోవడం, వైద్య రంగంలో దిగజారుతున్న ప్రమాణాలు, దళితబంధు నిలిపివేత వంటి అంశాలను అసెంబ్లీ వేదికగా ఉంచాలని పిలుపునిచ్చారు.

ప్రజా సమస్యలపై రాజీలేని పోరాటం

బీఆర్ఎస్ సభ్యులు ప్రజా వ్యతిరేక పాలనపై రాజీలేని పోరాటం చేయాలని కేసీఆర్ పిలుపునిచ్చారు. రైతులకు, మహిళలకు, విద్యార్థులకు, మత్స్యకారులకు, గొర్రెల పెంపకందారులకు తగిన న్యాయం జరిగేలా శక్తివంచన లేకుండా శాసనసభలో ప్రస్తావించాలని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అసెంబ్లీ వేదికగా తెరపైకి తీసుకురావాలని, ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలని సూచించారు. బీఆర్ఎస్ శాసనసభ్యులు, ఎమ్మెల్సీలు అసెంబ్లీకి నిర్ణీత సమయానికి ముందే హాజరై సభా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనాలని కేసీఆర్ సూచించారు.

brs congress Google news KCR telangana assembly session

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.