📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

Telugu News: Telangana-అక్రమ మద్యం బాటిళ్లపై ఎక్సైజ్ శాఖ ప్రత్యేక దృష్టి

Author Icon By Pooja
Updated: September 23, 2025 • 11:27 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

దసరా పండుగ సమయంలో అక్రమంగా రాష్ట్రంలోకి వస్తున్న మద్యం బాటిళ్లపై ఎక్సైజ్ శాఖ ప్రత్యేక దృష్టి పెట్టింది. ఇతర రాష్ట్రాల నుంచి తక్కువ ధరలకు మద్యం కొనుగోలు చేసి విమానాలు, రైళ్లు, బస్సుల ద్వారా అక్రమంగా తెలంగాణలో విక్రయాలు జరుగుతున్నాయని అధికారులు గుర్తించారు. ఈ విధానంతో రాష్ట్ర ఎక్సైజ్ శాఖకు భారీ నష్టాలు వాటిల్లుతున్నాయని వెల్లడించారు.

ప్రత్యేక డ్రైవ్ ప్రారంభం

ఈ పరిస్థితిని పరిగణలోకి తీసుకున్న ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్మెంట్ డైరెక్టర్ షాన్ వాజ్ ఖాసీం ఈ నెల 15 నుంచి 30 వరకు నాన్‌డ్యూటీ పెయిడ్ లిక్కర్(Non-duty paid liquor) (NDPL) మరియు నాటు సారా తయారీ, అమ్మకాలపై స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. ఇందులో ఎస్టీఎఫ్ (స్టేట్ టాస్క్ ఫోర్స్), డీటీఎఫ్ (డిస్ట్రిక్ టాస్క్ ఫోర్స్), ఎన్ఫోర్స్మెంట్ టీమ్లు, ఎక్సైజ్ సిబ్బంది పాల్గొంటున్నారు.

భారీ పట్టివేతలు

గత వారం రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా జరిగిన ప్రత్యేక దాడుల్లో 1704 అక్రమ మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు రూ.68.16 లక్షలుగా అంచనా వేశారు. వరంగల్, మహబూబాబాద్, భూపాలపల్లి, మహబూబ్ నగర్, నాగర్‌కర్నూల్, సూర్యాపేట, ఆదిలాబాద్, ఖమ్మం జిల్లాల్లో నిత్యం దాడులు కొనసాగుతున్నాయి. అధికారులు మరో వారం రోజులపాటు ఈ డ్రైవ్ కొనసాగించి మరిన్ని పట్టివేతలు చేసే అవకాశం ఉందని తెలిపారు.

రికార్డు స్థాయి పట్టివేత

పదేళ్లలో నమోదైన కేసులతో పోలిస్తే ఈ వారం రోజుల్లో పట్టుకున్న మద్యం బాటిళ్ల సంఖ్య రికార్డు స్థాయిలో ఉందని అధికారులు వెల్లడించారు. గత 10 ఏళ్లలో 4516 కేసులు నమోదు చేసి, 3238 మందిని అరెస్టు చేసి 1,22,222 లీటర్ల (16,300 బాటిళ్లు) మద్యం స్వాధీనం(Alcohol seizure) చేసుకున్నారు. 2024లో 955 కేసుల్లో 12,807 లీటర్ల మద్యాన్ని, ఈ సంవత్సరం ఆగస్టు వరకు 8201 లీటర్ల మద్యాన్ని పట్టుకున్నారు. అయితే వారం రోజుల్లోనే 1704 మద్యం బాటిళ్లను సీజ్ చేయడం విశేషమని పేర్కొన్నారు.

అక్రమ మద్యం పట్టివేతపై ఎక్సైజ్ శాఖ ఎందుకు దృష్టి పెట్టింది?

దసరా పండుగ సమయంలో ఇతర రాష్ట్రాల నుంచి అక్రమంగా వస్తున్న మద్యం విక్రయాలు పెరగడంతో భారీ నష్టాలు వాటిల్లుతున్నాయి.

స్పెషల్ డ్రైవ్ ఎప్పుడు నిర్వహిస్తున్నారు?

సెప్టెంబర్ 15 నుంచి 30 వరకు రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక డ్రైవ్ కొనసాగుతోంది.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

fake liquor Google News in Telugu Illegal Liquor Latest News in Telugu NDPL telangana excise Telangana Police Raids Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.