📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

తెలంగాణలో కొత్త హైకోర్టు లింకులు పంపి దోచేస్తున్న కేడీలు తెలంగాణలో పెరుగుతున్న చలి గురుకులాల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల ఐపీఎల్‌కు కరీంనగర్ యువకుడు ఎంపిక సిర్పూర్‌-యు అటవీ ప్రాంతంలో భారీ ఆపరేషన్.. తెలంగాణ సెకండియర్ పరీక్ష తేదీలో మార్పు నేడు, రేపు స్కూళ్లకు సెలవు తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త ఈ నెల 22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్ తెలంగాణలో కొత్త హైకోర్టు లింకులు పంపి దోచేస్తున్న కేడీలు తెలంగాణలో పెరుగుతున్న చలి గురుకులాల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల ఐపీఎల్‌కు కరీంనగర్ యువకుడు ఎంపిక సిర్పూర్‌-యు అటవీ ప్రాంతంలో భారీ ఆపరేషన్.. తెలంగాణ సెకండియర్ పరీక్ష తేదీలో మార్పు నేడు, రేపు స్కూళ్లకు సెలవు తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త ఈ నెల 22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్

Telugu News: Etela Rajender: నా మాటలు అవాస్తవమైతే రాజకీయల నుంచి తప్పుకుంటా..

Author Icon By Sushmitha
Updated: October 18, 2025 • 1:40 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

బీసీ రిజర్వేషన్ల ((BC Reservations) )విషయంలో తాను చేసిన ఆరోపణలు అవాస్తవమని తేలితే, రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటానని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్(Etala Rajender) సవాల్ విసిరారు. బీసీ బంద్‌లో భాగంగా జూబ్లీ బస్టేషన్ వద్ద ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం బీసీల విషయంలో అనుసరిస్తున్న వైఖరిపై ఆయన తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. బీసీ రిజర్వేషన్లను అమలు చేయడం సాధ్యం కాదని స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీ వేదికగా ప్రకటించారని ఈటల గుర్తుచేశారు. వాస్తవాలు తెలిసి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలను మోసం చేస్తోందని ఆయన ఆరోపించారు.

Read Also: Savita: విద్యార్థులను కన్నబిడ్డల్లా చూసుకోండి

బీసీ జనాభా లెక్కలు తప్పులతడక

ప్రభుత్వం చెబుతున్న బీసీ జనాభా లెక్కలు పూర్తిగా తప్పులతడక అని ఈటల విమర్శించారు. 52 శాతం ఉన్న బీసీలను 42 శాతంగా చూపడం కేవలం కాకి లెక్కలు చెప్పడమేనని ఆయన మండిపడ్డారు. ప్రభుత్వం నామమాత్రంగా కమిషన్లు వేస్తోందే తప్ప, వాటిని అమలు చేయడంలో నిజాయతీ చూపడం లేదని అన్నారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం కూడా బీసీల విషయంలో ఇలాగే వ్యవహరించిందని, కేసీఆర్ హయాంలో సర్వేలు చేసి, కమిషన్లు వేసినా చిత్తశుద్ధి లేకపోవడం వల్లే బీసీలకు న్యాయం జరగలేదని ఈటల విమర్శించారు.

Etela Rajender

తమిళనాడు విధానాన్ని అనుసరించాలి: ఈటల డిమాండ్

తమిళనాడులో రిటైర్డ్ ఐఏఎస్ అధికారులతో రెండేళ్లపాటు సమగ్ర సర్వే జరిపి, ఆ నివేదికను రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్‌లో చేర్చడం వల్లే అక్కడ రిజర్వేషన్లు పక్కాగా అమలవుతున్నాయని ఈటల గుర్తుచేశారు. తెలంగాణలో కూడా అదే విధానాన్ని పాటించాలని ఆయన డిమాండ్ చేశారు.

బీజేపీ పాలన, బీసీల భవిష్యత్తు

తెలంగాణలో బీసీని ముఖ్యమంత్రిని చేస్తామని ప్రధాని నరేంద్ర మోడీ(Narendra Modi) హామీ ఇచ్చారని, ఆయన కేబినెట్‌లో 27 మంది ఓబీసీ మంత్రులు ఉన్నారని ఈటల గుర్తుచేశారు. మాదిగ రిజర్వేషన్ల విషయంలో ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న ఘనత కూడా బీజేపీ ప్రభుత్వానిదేనని తెలిపారు. “బీసీలు యాచించే స్థాయిలో లేరు, శాసించే స్థాయికి ఎదగాలి. ప్రాంతీయ పార్టీలతో ఆ కుటుంబాలకే అధికారం దక్కుతుంది తప్ప బీసీలకు మేలు జరగదు” అని ఈటల రాజేందర్ స్పష్టం చేశారు.

తన ఆరోపణలు అవాస్తవమని తేలితే ఈటల రాజేందర్ ఏమి చేస్తానని సవాల్ విసిరారు?

రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటానని ఆయన సవాల్ విసిరారు.

తెలంగాణ ప్రభుత్వం బీసీ జనాభా లెక్కలను ఎలా చూపిస్తోందని ఈటల విమర్శించారు? 52 శాతం ఉన్న బీసీలను 42 శాతంగా చూపడం ద్వారా కాకి లెక్కలు చెబుతోందని విమర్శించారు.

Read hindi news: https://hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read Also:

BC Reservation BJP Congress. Etela Rajender Google News in Telugu KCR Latest News in Telugu Political Challenge Revanth Reddy Telangana politics Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.