📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

నిమ్స్ స్టెమ్ సెల్ ల్యాబ్ ప్రారంభం లక్కీ డ్రా స్కామ్‌పై సైబర్ చర్యలు ఉద్యమ బాటలో ఆర్టిసి కార్మికులు రేపటి నుంచి JEE మెయిన్స్ ప్రైవేట్ స్కూల్ ఫీజులపై బ్రేకింగ్ నిర్ణయం.. తల్లిదండ్రులకు ఊరట? సంక్రాంతి పండుగతో టిజిఎస్ఆర్టీసీ కి భారీ లాభాలు పాఠశాలకి తాళం వేసిన కాంట్రాక్టర్..ఎందుకంటే? పండగ వేళ గ్రామ పంచాయతీలకు తీపి కబురు అందించిన భట్టి డీసీఎంను ఢీకొన్న ఆర్టీసీ బస్సు .. పలువురికి గాయాలు ఏప్రిల్ నుంచి తెలుగు రాష్ట్రాల్లో ‘SIR’ ఆర్బీఐ గుడ్‌న్యూస్‌.. వేస్ అండ్ మీన్స్ అడ్వాన్స్ లిమిట్ పెంపు చలాన్ పడగానే డబ్బు కట్ అసైన్డ్ భూములపై కీలక ప్రకటన చేసిన మంత్రి పొంగులేటి రేపే పిఎస్ఎల్వి-సి62 ప్రయోగానికి కౌంటౌన్ సర్కారీ ఉద్యోగులకు1.02 కోట్ల ప్రమాద బీమా త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటన.. నిరుద్యోగులకు భరోసా ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం నిమ్స్ స్టెమ్ సెల్ ల్యాబ్ ప్రారంభం లక్కీ డ్రా స్కామ్‌పై సైబర్ చర్యలు ఉద్యమ బాటలో ఆర్టిసి కార్మికులు రేపటి నుంచి JEE మెయిన్స్ ప్రైవేట్ స్కూల్ ఫీజులపై బ్రేకింగ్ నిర్ణయం.. తల్లిదండ్రులకు ఊరట? సంక్రాంతి పండుగతో టిజిఎస్ఆర్టీసీ కి భారీ లాభాలు పాఠశాలకి తాళం వేసిన కాంట్రాక్టర్..ఎందుకంటే? పండగ వేళ గ్రామ పంచాయతీలకు తీపి కబురు అందించిన భట్టి డీసీఎంను ఢీకొన్న ఆర్టీసీ బస్సు .. పలువురికి గాయాలు ఏప్రిల్ నుంచి తెలుగు రాష్ట్రాల్లో ‘SIR’ ఆర్బీఐ గుడ్‌న్యూస్‌.. వేస్ అండ్ మీన్స్ అడ్వాన్స్ లిమిట్ పెంపు చలాన్ పడగానే డబ్బు కట్ అసైన్డ్ భూములపై కీలక ప్రకటన చేసిన మంత్రి పొంగులేటి రేపే పిఎస్ఎల్వి-సి62 ప్రయోగానికి కౌంటౌన్ సర్కారీ ఉద్యోగులకు1.02 కోట్ల ప్రమాద బీమా త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటన.. నిరుద్యోగులకు భరోసా ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం

Engineering College: ఇంజినీరింగ్ కాలేజీల ప్రిన్సిపాళ్లతో ఫీజుల నిర్ధారణ అధికారుల కమిటీ భేటీ

Author Icon By Ramya
Updated: July 30, 2025 • 11:33 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

హైదరాబాద్ : రాష్ట్రంలోని ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీలతోపాటు (Engineering College) ఇతర ప్రొఫెషనల్ కాలేజీల్లో ట్యూషన్ ఫీజులను నిర్ణయించడానికి ప్రభుత్వం నియమించిన అధికారుల కమిటీ మంగళవారం సమావేశం అయింది. జెఎన్టియు హైదరాబాద్ క్యాంపస్లో కమిటీ ఇంజనీరింగ్ కాలేజీల (Engineering College) ప్రిన్సిపాల్స్ తో సమావేశమైంది. సమావేశంలో పాల్గొన్న ప్రిన్సిపాల్స్ నిత్యవసర వస్తువుల ధరల పెరుగుదలతోపాటు బోధనా సిబ్బందికి ఇంక్రిమెంట్స్ ఇవ్వాల్సి ఉంటుందని అందుకే కనీసం 15 శాతం ఫీజులను తప్పకుండా పెంచాలనే ప్రతిపాదనను ప్రిన్సిపల్స్ ఫీజుల కమిటీ (Principal’s Fees Committee) ముందుంచినట్టు తెలిసింది. ప్రిన్సిపాల్స్ చెప్పిన అంశాలను పరిగణనలోకి తీసుకున్న కమిటీ.. మరోసారి కాలేజీ యాజమాన్యాలతో కూడా సమావేశం నిర్వహించాలని నిర్ణయించినట్టు తెలిసింది. కాలేజీ యాజమాన్యాలు చెప్పే అంశాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలని కమిటీ భావిస్తోంది.

Engineering College: ఇంజినీరింగ్ కాలేజీల ప్రిన్సిపాళ్లతో ఫీజుల నిర్ధారణ అధికారుల కమిటీ భేటీ

2025-28 బ్లాక్ పీరియడ్ ట్యూషన్ ఫీజులపై నిర్ణయం కోసం అధికారుల కమిటీ చురుకుగా సమావేశాలు

అనంతరం కమిటీ తమ ప్రతిపాదనలను ప్రభుత్వానికి సమర్పించనున్నట్టు తెలుస్తోంది. మరో రెండు, మూడు సార్లు సమావేశాలు నిర్వహించిన అనంతరం ప్రతిపాదనలను సిద్ధం చేయనున్నట్టు తెలుస్తోంది. 2025-28 బ్లాక్ పిరియడ్ కి సంబంధించి ప్రైవేటు ఇంజనీరింగ్ తోపాటు ఎంబిఏ, ఎంసీఏ, బిఈడి, ఎంఈడి, బి ఫార్మసీ, ఎం ఫార్మసీ తదితర వృత్తివిద్య కోర్సులను అందిస్తున్న కాలేజీల్లో ట్యూషన్ ఫీజును నిర్ధారణ చేయడం కోసం ప్రభుత్వం అధికారుల కమిటీని నియమించిన విషయం తెలిసిందే. తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ 2 బాలకిష్టారెడ్డి చైర్పర్సన్ (Balakishta Reddy Chairperson) గా నియమిస్తూ జివో ఎంఎస్ నంబర్ 29ని ప్రభుత్వం జారీ చేసిన కాలేజీలు ఫీజు ఈ విషయం తెలిసిందే. తెలంగాణ అడ్మిషన్స్ అండ్ ఫీజు రెగ్యులేటరీ కమిటీ (టిఎఎఫ్రిసి) 2025-28 బ్లాక్ పీరియడ్ కోసం ప్రైవేట్ అన్ఎయిడెడ్ ప్రొఫెషనల్ ఏఎఫ్ ఆర్ సికి సమర్పించిన ప్రతిపాదనలు.. సంబంధిత సుప్రీంకోర్టు, హైకోర్టుల పారామీటర్స్, నిబంధనలు, షరతులకు భిన్నంగా ఉన్నాయని నేపథ్యంలో ప్రైవేటు కాలేజీల్లో ఫీజు నిర్ధారణ కోసం పారామీటర్లను పరిశీలించి ప్రతిపాదనలు, సూచనలను చేయడానికి కమిటీని వేయాలని కోరగా ప్రభుత్వం 10 మందితో కమిటీని ఏర్పాటు చేసింది. అధికారుల కమిటీ మంగళవారం ప్రిన్సిపాల్స్ తో సమావేశమైంది.

ప్రైవేట్ ప్రొఫెషనల్ కాలేజీల ట్యూషన్ ఫీజు నిర్ణయానికి ప్రభుత్వం ఏం చర్య తీసుకుంది?

2025-28 బ్లాక్ పీరియడ్‌కు ట్యూషన్ ఫీజులను నిర్ణయించేందుకు ప్రభుత్వం 10 మందితో అధికారుల కమిటీని ఏర్పాటు చేసింది.

ప్రిన్సిపాల్స్ కమిటీ ఎదుట ఏ ప్రతిపాదనను ఉంచారు?

నిత్యావసరాల ధరలు, సిబ్బంది ఇంక్రిమెంట్లు పెరిగిన నేపథ్యంలో కనీసం 15% ఫీజు పెంపు చేయాలని ప్రతిపాదించారు.

Read Hindi News : hindi.vaartha.com

Read also: MLC Kavitha : కవిత గురించి మాట్లాడటం టైం వెస్ట్ – జగదీశ్ రెడ్డి

Breaking News Engineering Colleges Fee Regulation Government Committee latest news Telangana Education Telugu News Tuition Fee Hike

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.