📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

Electricity: రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థపై పెనుభారంగా విద్యుత్ డిస్కంలు

Author Icon By Sharanya
Updated: July 14, 2025 • 10:03 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

హైదరాబాద్: విద్యుత్ పంపిణీ సంస్థలు (DISCOMS) రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై భారంగా తయారయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వాలు విద్యుత్ పంపిణీ సంస్థలను తమ స్వప్రయోజనాలకు ఉపయోగించు కోవడంతో వాటి పరిస్థితి క్రమేపీ దిగజారుతోంది. ఈ నేపధ్యంలోనే 2022-23 నాటికి రాష్ట్ర డిస్కమ్ల మొత్తం పోగుపడిన నష్టాలు రూ.6.5 లక్షల కోట్లకు చేరుకున్నాయి. ఇది దేశ జిడిపిలో 2.4 శాతంగా నమోదైంది. ఈ మేరకు వీటికి సంబంధించి భారతీయ రిజర్వ్ బ్యాంక్ విడుదల చేసిన ఒక నివేదికలో పేర్కొంది.

విద్యుత్ డిస్కమ్లు రాష్ట్రాలకు ఒక సవాలుగా

విద్యుత్ (Electricity) పంపిణీ సంస్థలు రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థపై ఒక వ్యక్తం చేసింది. వివిధ సంస్కరణల ప్రయత్నాలు ఉన్నప్పటికీ డిస్కమ్లు రాష్ట్రాలకు ఒక ముఖ్యమైన సవాలుగా ఉన్నాయని తెలిపింది. దీనిని పరిష్కరించడానికి, ఉత్పాదకతను మెరుగుపరచడం, ప్రసార మరియు పంపిణీ నష్టాలను తగ్గించడంతో పాటు, విద్యుత్ (Electricity) సరఫరా యొక్క వాస్తవ వ్యయంతో సుంకాలను సర్దుబాటు చేయడం వంటి చర్యల యొక్క ప్రాముఖ్యతను గూర్చి నొక్కి చెప్పింది. ఇతర సిఫార్సు దశల్లో విద్యుత్ సరఫరా (Power supply) పరిశ్రమను విడదీయడం మరియు విద్యుత్ ఉత్పత్తి మరియు పంపిణీని ప్రైవేటీకరించడం ఉన్నాయి. తద్వారా రాష్ట్ర ఆర్ధిక నాణ్యతను గణనీయంగా మెరుగువరుస్తుంది. కొనసాగు వెల్లడించింది. డిస్కమ్లను ఆర్థిక బలోపేతం చేసే విధంగా పెంపొందించడం ద్వారా రాష్ట్ర ఆర్థిక మొత్తం నాణ్యతను మెరుగుపరచడానికి ఈ చర్యలు కీలకమైనవని వివరించింది.

డిస్కమ్ల వార్షిక రేటు 8.7 శాతం వృద్ధి


అనేక ఆర్థిక పునర్నిర్మాణ ప్రయత్నాలు ఉన్నప్పటికీ, 2016-17 నుండి డిస్కమ్ల మొత్తం బకాయిలు సగటు వార్షిక రేటు 8.7 శాతం వద్ద వృద్ధి చెందాయని నివేదిక హైలైట్ చేసింది. పంపిణీ నష్టాలను తగ్గించడం, మీటరింగ్ వ్యవస్థలను మెరుగుపరచడం, సకాలంలో దారిఫ్ సవరణలను నిర్ధారించడం మరియు ప్రభుత్వ సబ్సిడీలపై ఆధారపడటాన్ని క్రమంగా తగ్గించడానికి విద్యుత్ రంగాన్ని ప్రోత్సహించడం ద్వారా రాష్ట్రాలు కార్యాచరణ సామర్థ్యాన్ని ప్రాధాన్యపరచాలని నివేదిక వివరించింది. ఇది గత సంవత్సరాల నుండి మెరుగుదలని ప్రతిబింబిస్తుందని చెప్పింది. మరియు బాధ్యతాయుతమైన ఆర్థిక నిర్వహణకు నిబద్ధతను ప్రదర్శిస్తుందని తెలియచేసింది. అదనంగా, ఖర్చులు నాణ్యతను మెరుగుపరచడంలో రాష్ట్రాలు పురోగతా సాధించాయని నివేదిక పేర్కొంది. మరింత సానుకూల పరిస్థితుల నేపథ్యంలో ఆర్థిక క్రమశిక్షణము కొనసాగించడంలో రాష్ట్రాలు పురోగతి సాధించాయని పేర్కొంది. 2023-24లో రాష్ట్రాల స్థూల ఆర్థిక లోట 2.91 శాతం వద్ద ఉంది, ఇది ఆర్థిక బాధ్యత చట్టయి ద్వారా నిర్దేశించబడిన 3 శాతం పరిమితిలో బాగానే ఉంది. ఇక ఇన్ఫ్రాస్ట్రక్చర్లో పెట్టుబడి మరియు దీర్ఘకాలిక వృద్ధికి కీలక సూచిక అయిన మూలధును. వ్యయం 2023-24లో బిదీశిలో 2.6 శాతానికి! పెరిగింది. ఇది అంతకుముందు సంవత్సరంలో 2.2 శాతంగా ఉంది. 2024-25లో రాష్ట్రాలు ఆర్థిక క్రమశిక్షణను కొనసాగించాలని భావిస్తున్నాయని, రజ నేపథ్యంలో 3.2 శాతంగా ఉంటుందని నివేదిక అందింది .

Read hindi news: hindi.vaartha.com

Read also: Ration Cards : నేడే తెలంగాణ లో కొత్త రేషన్ కార్డుల పంపిణీ

Breaking News DISCOM financial crisis electricity discom crisis electricity reforms in Telangana latest news state economy power burden Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.