Election: జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్ (congress) రిగ్గింగ్ చేసిందని బీఆర్‌ఎస్ చేసిన ఆరోపణలను తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ ఖండించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ, “ఇప్పుడు రిగ్గింగ్ చేయడం అసాధ్యం. ఇది పాత కాలం కాదు. బీఆర్‌ఎస్ నాయకులు ఓటమి భయంతోనే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారు,” అని పేర్కొన్నారు.
Read also: Terrorism : ఉగ్రవాదానికి ఊపిరి పోస్తున్నదెవరు?
jubilee elections
కాంగ్రెస్ విజయం ఖాయం అని
Election: మహేశ్ కుమార్ గౌడ్ ఇంకా మాట్లాడుతూ, కాంగ్రెస్ విజయం ఖాయం అని, ప్రజలు తమపై నమ్మకం ఉంచారని తెలిపారు. హైకోర్టు ఆదేశాల మేరకు స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ కొనసాగుతుందని స్పష్టం చేశారు. “క్యాబినెట్ విస్తరణకు సంబంధించిన నిర్ణయం సీఎం మరియు పార్టీ అధిష్ఠానం తీసుకుంటుంది,” అని ఆయన అన్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com/
Read Also: