హైదరాబాద్ Education : తెలంగాణ రాష్ట్రంలోని ప్రాథమిక పాఠశాలల ప్రధానోపా ధ్యాయుల సమస్యలను పరిష్కరించాలని ప్రైమరీ స్కూల్స్ హెడ్మాష్టర్స్ అసోసియేషన్ (PSH MA) డిమాండ్ చేసింది. ప్రాథమిక పాఠశాలల ప్రధానోపాధ్యాయుల సంఘం తెలంగాణ రాష్ట్ర స్థాయి సర్వ సభ్య సమావేశం సోమవారం కె. ప్రభాకర్ రెడ్డి అధ్యక్షతన జరిగినది. హైదరాబాద్ లోని జీడిమెట్లలో జరిగిన సమావేశంలో రాష్ట్రంలోని 33 జిల్లాల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శు లతోపాటు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. సోమవారం జరిగిన సమావేశంలో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరిగింది. పూర్తి కార్యవర్గాన్ని అందరి ఆమోదంతో ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్టు పిఎస్కెచ్ఎంఏ రాష్ట్ర అధ్యక్షులు బి మురళీధర్ గౌడ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రచ్చ మురళీ తెలిపారు. రాష్ట్ర ప్రాథమిక పాఠశాలల ప్రధానోపాధ్యాయుల సంఘం తెలంగాణ నూతన అధ్యక్షులు గద్వాల్ జిల్లాకి చెందిన డి. మురళీదర్ గౌడ్ ఎన్నిక కాగా.. రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నిజామాబాద్ జిల్లాకి చెందిన రచ్చ మురళీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రాష్ట్ర ఆర్థిక కార్యద ర్శులుగా ఇలిటం గాలయ్య, కె. శ్రవణ్ రెడ్డితోపాటు మిగిలిన రాష్ట్ర కార్యవర్గ సభ్యులను (State Executive Committee members) అందరి ఆమోదముతో ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్టు తెలిపారు. నూతనంగా ఎన్నికైన రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మాట్లాడుతూ.. ప్రాధమిక పాఠశాలల ప్రధానోపాధ్యాయుల సమస్యలను పరిష్కరించుటకు, వారి ఆత్మగౌరవాన్ని కాపాడుటకు అవసరమైన కార్యక్రమాలను నిర్వహిస్తూ, రాష్ట్ర స్థాయి అధికారులతో సమన్వయ పర్చుకుంటూ సంఘ సభ్యులకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ సమస్య పరిష్కారం కోసం కృషి చేస్తామని తెలియజేశారు. త్వరలో పిఎస్కాచ్ఎంల సమస్యలపై ప్రభుత్వానికి శ్వేతపత్రం సమర్పించనున్నట్టు తెలిపారు.
READ HINDI NEWS : hindi.vaartha.com
READ ALSO :