📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

News Telugu: ED: భూదాన్ భూముల వ్యవహారంలో కీలక పరిణామం

Author Icon By Sharanya
Updated: September 2, 2025 • 3:27 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

మునావర్ ఖాన్ దంపతుల రూ.4.08 కోట్ల ఆస్తులు జప్తు చేసిన ఇడి

హైదరాబాద్ : రాష్ట్రంలో సంచలనం రేపిన భూదాన్ భూముల వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసుకు సంబంధించి తప్పుడు పత్రాలతో భూదాన్ భూములు కాజేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న నగరంలోని టోలిచౌకి ప్రాంతానికి చెందిన మహమ్మద్ మునావర్ ఖాన్ (Munawar Khan)అతడి భార్య ఫైకా తహాఖాను కు సంబంధించిన నాలుగు కోట్ల 80 లక్షల రూపా యల విలువైన ఆస్తులను కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ఫోర్స్మెంట్ డైరక్టరేట్ (ఈడీ) సోమవారం నాడు జప్తు చేసింది.

News Telugu

50 ఎకరాల భూదాన్ భూమిని తప్పుడు పత్రాలు

ఈ ఆస్తులు టోలిచౌకితో పాటు బంజారాహిల్స్ వున్నాయని ఈడీ (ED) తెలిపింది. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం నాగారంలో గల 50 ఎకరాల భూదాన్ భూమిని తప్పుడు పత్రాలతో సొంతం చేసుకోవడంతో పాటు దీనిని బ్యూరోక్రాట్లతో పాటు బడా వ్యాపారులకు, కొందరు నాయకులకు మునావర్ ఖాన్ దంపతులు అమ్మినట్లు ఈడీ గుర్తించడం తెలిసిందే. ఈ నేపథ్యంలో మునావర్ ఖాన్ దంపతులతో పాటు వీరికి సహకరించిన ప్రభుత్వ ఉద్యోగులపై మహేశ్వరం పోలీసు స్టేషన్లో కేసు నమోదయ్యింది. నాగారంలోని సర్వే నంబర్ 181లో భూదాన్ భూమిని ఖదీరున్నీసా అనే మహిళ పేరిట రెవెన్యూ రికార్డులో కొందరు అధికారులు మార్చినట్లు పోలీసుల విచారణలో వెలుగు చూసింది. ఇదే భూమిలో కొంత భాగాన్ని రాష్ట్రంలోని సీనియర్ ఐఎఎస్, ఐపిఎస్ అధికారులకు మునావర్ ఖాన్ దంపతులు మరికొందరు కలిసి అమ్మినట్లు ఇడి విచారణలో తేలింది.. ఈ క్రమంలోనే మునావర్ ఖాన్ దంపతులపై ఈడీ మనీ లాండరింగ్ చట్టం కింద కేసు నమోదు చేసి విచారణ చేబట్టింది. ఇక భూదాన్ భూముల విషయానికి వస్తే మహేశ్వరం మండలంలోని నాగారం గ్రామంలో సర్వే నంబ ర్ 181, 182లో సుమారు 103 ఎకరాల భూమి వుంది. ఈ భూములు పూర్తిగా భూదాన్ ట్రస్టుకు చెందినవిగా రెవెన్యూ రికార్డులు చెబుతున్నాయి. ఈ కేసులో తాజాగా మునవర్ ఖాన్ దంపతుల రూ.4.08 కోట్ల ఆస్తులను ఈడీ జప్తు చేయడంతో భూదాన్ భూముల వ్యవహారం మరో మలుపు తిరిగింది.

Read hindi news:hindi.vaartha.com

Read also:

https://vaartha.com/telangana-flood-victims-compensation-5-lakhs/telangana/539815/

Bhoodan Lands Scam Bhudan Lands Controversy Breaking News ED investigation ED Raid latest news Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.