మహబూబ్‌నగర్(Earthquake) జిల్లాలోని హౌసింగ్ బోర్డు కాలనీలో ఆదివారం రాత్రి భూమి కంపించినట్లుగా స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఒక్కసారిగా పెద్ద శబ్దం వినిపించడంతో పాటు కొన్ని క్షణాల పాటు ప్రకంపనలు వచ్చినట్లు వారు తెలిపారు. ఈ ఘటనతో ఇళ్లలో ఉన్న ప్రజలు బయటకు పరుగులు తీశారు.
Read also: Kamareddy Crime: భార్య, బిడ్డలను పోషించలేక తండ్రి ఆత్మహత్య
అయితే ఈ ఘటనపై ఇప్పటివరకు స్పష్టమైన సమాచారం అందలేదని పోలీసులు వెల్లడించారు. ఈ ప్రాంతంలో ఎలాంటి తవ్వకాలు, నిర్మాణ పనులు లేదా పేలుళ్లు జరిగాయా అనే కోణంలో విచారణ చేపట్టినట్లు తెలిపారు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉందన్నారు.
ఇదే సమయంలో దేశంలోని ఈశాన్య రాష్ట్రాల్లో భూకంపం(Earthquake) చోటుచేసుకుంది. అస్సాంలోని మోరిగావ్ ప్రాంతంలో రిక్టర్ స్కేల్‌పై 5.1 తీవ్రతతో భూకంపం నమోదైంది. త్రిపురలోని గోమతి జిల్లాలో 3.9 తీవ్రతతో భూప్రకంపనలు రికార్డయ్యాయి. అధికారుల సమాచారం ప్రకారం మోరిగావ్‌కు సుమారు 50 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు గుర్తించారు. ఈ భూకంప ప్రభావంతో మేఘాలయాలోని పలు ప్రాంతాల్లో కూడా స్వల్పంగా ప్రకంపనలు అనుభవించినట్లు అధికారులు తెలిపారు.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read also: