📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్

EAPCET: తెలంగాణ EAPCET ఫలితాలు విడుదల

Author Icon By Sharanya
Updated: May 11, 2025 • 1:52 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తెలంగాణలో EAPCET (Engineering, Agriculture and Pharmacy Common Entrance Test) 2025 ఫలితాలు ఈ రోజు అధికారికంగా విడుదలయ్యాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మే 11 ఉదయం 11 గంటలకు ఫలితాలను విడుదల చేశారు. ఈ ఫలితాల విడుదలతో పాటు రాష్ట్రంలో ఉన్న ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల ప్రవేశాలకు అధికారిక ప్రారంభం అయ్యింది.

పరీక్షా తేదీలు & హాజరైన విద్యార్థులు

ఈ సంవత్సరం TG EAPCET పరీక్షలు ఏప్రిల్ 29, 30, మే 2, 3, 4 తేదీల్లో నిర్వహించబడ్డాయి. ఏప్రిల్ 29, 30 తేదీల్లో అగ్రికల్చర్ మరియు ఫార్మా విభాగాల పరీక్షలు, మే 2, 3, 4 తేదీల్లో ఇంజినీరింగ్ విభాగం పరీక్షలు జరిగాయి. ఈ పరీక్షలను జవహర్‌లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్శిటీ (JNTU), హైదరాబాద్ యాజమాన్యంలో నిర్వహించారు. ఈసారి దాదాపు 3 లక్షల మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరయ్యారు.

ఇంజినీరింగ్ విభాగంలో టాపర్లు ?

ఇంజినీరింగ్ విభాగంలో ఏపీలోని మన్యం జిల్లా పార్వతీ పురానికి చెందిన పల్లా భరత్ చంద్ర 150.058 మార్కులతో రాష్ట్ర టాపర్ గా నిలిచాడు. ఆదివాసీల జిల్లా నుంచి వచ్చిన విద్యార్థి తెలంగాణ టాపర్ గా నిలవడంతో అతనికి ప్రశంసలు దక్కుతున్నాయి. రంగారెడ్డి జిల్లా శేరిలింగం పల్లికి చెందిన ఉడగండ్ల రామ చరణ్ రెడ్డి 148.284 మార్కులతో రెండో స్థానంలో నిలిచాడు. ఏపీలోని విజయనగరం జిల్లాకు చెందిన పమ్మిన హేమ సాయి సూర్య కార్తిక్ 147.085 మార్కులతో మూడో ర్యాంకు సాధించాడు. హైదరాబాద్ నాచారంకు చెందిన లక్ష్మీ భార్గవ్ మెండే నాలుగో ర్యాంకు, శేరిలింగంపల్లికి చెందిన మంత్రిరెడ్డి వెంకట గణేశ్ రాయల్ ఐదో ర్యాంకు సాధించాడు.

అగ్రికల్చర్ విభాగంలో టాపర్లు

అగ్రికల్చర్ విభాగంలో మేడ్చల్‌కు చెందిన సాకేత్ రెడ్డి అగ్రస్థానంలో నిలిచాడు. అతను 141.688 మార్కులతో టాప్ ర్యాంకు సాధించాడు. రెండో స్థానంలో కరీంనగర్ జిల్లాలోని వావిళ్ల రామ్ రెడ్డి నగర్కు చెందిన సబ్బాని లలిత్ వరేణ్యా ఉన్నాడు, అతని మార్కులు 140.477. మూడో ర్యాంకు వరంగల్‌కు చెందిన చంద్ర అక్షిత్ దక్కించుకున్నాడు. వనపర్తి జిల్లా కొత్తకోటకు చెందిన పెద్దింటి రచ్చల సాయినంద్ కు నాలుగో ర్యాంకు వచ్చింది. మాదాపుర్ కు చెందిన బ్రాహ్మణి రెండ్లకు ఐదో ర్యాంకు వచ్చింది.

అధికారిక వెబ్‌సైట్‌లో

విద్యార్థులు తమ TG EAPCET ఫలితాలను అధికారిక వెబ్‌సైట్‌లో ( https://eapcet.tgche.ac.in/ ) చూసుకోవచ్చు. హాల్ టికెట్ నంబర్ లేదా రిజిస్ట్రేషన్ నంబర్ ఉపయోగించి ఫలితాలను తెలుసుకోవచ్చు. ఫలితాల షీట్‌తో పాటు ర్యాంక్ కార్డు కూడా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఫలితాల తర్వాత విద్యార్థులు కౌన్సెలింగ్ ప్రక్రియ కోసం సిద్ధంగా ఉండాలి. షెడ్యూల్, వెబ్ ఆప్షన్స్, సీటు కేటాయింపు, డాక్యుమెంట్ వెరిఫికేషన్ వంటి వివరాలు త్వరలో అధికారికంగా విడుదలకానున్నాయి.

Read also: UGC NET: యూజీసీ నెట్ జూన్‌ 2025 దరఖాస్తు గడువు పెంపు

#EAPCETResults #EAPCETTopper #EngineeringEntrance #TelanganaEducation #TelanganaStudents #TGEAPCET2025 Breaking News Today In Telugu Google News in Telugu India News Today in Telugu Latest News in Telugu Latest News today in Telugu News in Telugu Today Telugu News Today Today News In Telugu Today Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.