📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రైతు భరోసా 15 లక్షల ఎకరాలకు బంద్ హైదరాబాద్ చెరువుల్లో పతంగుల పండుగ ఏర్పాట్లు పెండింగ్ ఈ-చలాన్లపై సైబర్ క్రైమ్ పోలీస్ ల సూచనలు యూరియా యాప్ 5 జిల్లాల్లో ప్రయోగాత్మకంగా అమలు ఐటీ ఉద్యోగుల కోసం స్పెషల్ బస్సులు ప్రేమికుడి వేధింపులతో బిటెక్ విద్యార్థిని ఆత్మహత్య తెలంగాణ పరిషత్ ఎన్నికలపై సీఎం రేవంత్ మంత్రుల భేటీ మెడికల్ స్టూడెంట్స్ కు స్పెషల్ కమ్యూనికేషన్ క్లాసులు తెలంగాణలో కొనసాగుతున్న చలి తీవ్రత తెలంగాణలో మహిళలకు ఉచిత బస్ పాస్ రైతు భరోసా 15 లక్షల ఎకరాలకు బంద్ హైదరాబాద్ చెరువుల్లో పతంగుల పండుగ ఏర్పాట్లు పెండింగ్ ఈ-చలాన్లపై సైబర్ క్రైమ్ పోలీస్ ల సూచనలు యూరియా యాప్ 5 జిల్లాల్లో ప్రయోగాత్మకంగా అమలు ఐటీ ఉద్యోగుల కోసం స్పెషల్ బస్సులు ప్రేమికుడి వేధింపులతో బిటెక్ విద్యార్థిని ఆత్మహత్య తెలంగాణ పరిషత్ ఎన్నికలపై సీఎం రేవంత్ మంత్రుల భేటీ మెడికల్ స్టూడెంట్స్ కు స్పెషల్ కమ్యూనికేషన్ క్లాసులు తెలంగాణలో కొనసాగుతున్న చలి తీవ్రత తెలంగాణలో మహిళలకు ఉచిత బస్ పాస్

DTC Kishan: డిటిసి అవినీతిలో రూ.200 కోట్లు!

Author Icon By Tejaswini Y
Updated: December 26, 2025 • 10:41 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Mahabubnagar DTC Kishan Arrest : నారాయణఖేడ్ నియోజకవర్గం నిజాంపేట్ మండలం బల్కం చల్క తాండ సొంత గ్రామంలో 31 ఎకరాల వ్యవసాయ భూమి గుర్తింపుఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్న అధికారులపై ఏసీబీ కొరడా ఝుళిపిస్తోంది. కేసు నమోదు చేసి దాడులు నిర్వహించి ఆస్తుల చిట్టా బయటకు తీస్తోంది. ఇందులో భాగంగా మహబూబ్నగర్ జిల్లా డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ కిషన్(DTC Kishan) భారీగా ఆదాయానికి మించి ఆస్తులు కూడగట్టినట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు ఇళ్లు, కార్యాలయాలు సహా స్వగ్రామం నారాయణఖేడ్ నియోజకవర్గం నిజాంపేట మండలం బల్కంచట్క తండాలో దాడులు చేశారు.

Read Also: Ranga Reddy: శంషాబాద్ వద్ద స్కూల్ బస్సు బోల్తా

15 బృందాలుగా ఏర్పడి హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్నగర్, సికింద్రాబాద్ లోని కిషన్ ఇళ్లు. కార్యాలయాలు, బంధువులు, స్నేహితుల సహా మొత్తం 12 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు చేశారు. మొత్తం రూ.12.72 కోట్ల విలువైన స్థిర, చరాస్తులు లభ్యమయ్యాయి. బహిరంగ మార్కెట్లో వాటి విలువ వందల కోట్లు ఉంటుందని అంచనా. ఏసీబీ చరిత్రలో ఇంత భారీ మొత్తంలో ఆక్రమాస్తులు బహిర్గతం కావడం ఇదే తొలిసారి. ఆ మధ్య నీటిపారుదలశాఖ ఇంజినీర్ల అక్రమాస్తులను ఏసీబీ(ACB raids) గుర్తించినా, వాటన్నిటి కంటే కిషన్ ఆస్తిపాస్తులే అధికమని అంచనా. సోదాల సమయంలో నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఏసీబీ అధికారులు మంగళవారం ఉదయమే బోయిన్పల్లిలోని కిషన్ ఇంటి తలుపుతట్టారు.

విశ్వసనీయ సమాచారం మేరకు ఆ సమయంలో కిషన్ కొంతసేవు స్నానాల గదిలోనే ఉండిపోయారు. బయటికి వచ్చాక సోదాలు ప్రారంభించగా ఆస్తుల పత్రాలేవీ లభ్యం కాకపోవడంతో ఏసీబీ అధికారులకు అనుమానమొచ్చి లోతుగా ఆరా తీశారు. కిషన్ సెల్ఫోన్లో బంగారు ఆభరణాలకు సంబంధించిన ఓ పత్రం లభ్యమైంది. సికింద్రాబాద్ పాట్ మార్కెట్లోని ఓ దుకాణానిది కావడంతో విచారించారు. కిషన్ ముందు రోజే బంగారు ఆభరణాల్ని తన దుకాణానికి తెచ్చి అప్పగించారని ఆ వ్యాపారి చెప్పడంతో ఏసీబీ అధికారులు వాటిని తెప్పించారు. అలాగే ముందు రోజు రాత్రే ఓ బంధువు ఇంటికి వెళ్లి ఆస్తుల పత్రాలు అప్పగించినట్లు విచారణలో తేలడంతో వాటిని తెప్పించి స్వాధీనం చేసుకున్నారు.

మొదటి నుంచి అవినీతి ఆరోపణలే:

1994లో అసిస్టెంట్ వెహికిల్ ఇన్స్పెక్టర్గా రవాణా శాఖలో అడుగుపెట్టిన కిషన్పై మొదటి నుంచి అవినీతి ఆరోపణలున్నాయి. బోధన్లో మోటార్ వెహికిల్ ఇన్స్పెక్టర్గా పనిచేశారు. అక్కడే మద్నూర్లో చెక్పోస్ట్ పర్యవేక్షణ బాధ్యతలు నిర్వర్తించారు. నిజామా బాద్లోనూ ఎంవీఐగా పనిచేశారు. తాజా సోదాల్లో నిజామాబాద్ అక్రమాస్తులు బహిర్గతం కావడంతో తొలినాళ్లలోనే వాటిని కూడబెట్టినట్లు బహిర్గతమైంది. ఆ తర్వాత మేడ్చల్, మెహిదీపట్నం ఆర్టీవోగా కిషన్ పని చేశారు. ఏడాదిక్రితమే మహబూబ్నగర్(Mahabubnagar) డిప్యూటీ కమిషనర్ వెళ్లారు. ఆదాయానికి మించి ఆస్తులు కూడాబెట్టారనే ఆరోపణలపై ఏసీబీ అధికారులు ఆయనపై కేసు నమోదు చేశారు. నిజామాబాద్లోని లహరి ఇంటర్నేషనల్ హోటల్లో 50 శాతం వాటా, 3వేల చదరపు గజాల విస్తీర్ణంలోని రాయల్క్ ఫర్నిచర్షిప్లో ఓనర్షిప్, అశోకటౌన్షిప్లో 2 ఫ్లాట్లు ఉన్నట్లు గుర్తించారు. సంగారెడ్డి జిల్లా నిజాంపేటలో 31 ఎకరాల వ్యవసాయభూమి, 4వేల గజాల్లో పాలీహౌజ్, నిజామాబాద్ మున్సిపాలిటీ పరిధిలో 10 ఎకరాల వాణిజ్య స్థలం ఉన్నట్లు నిర్ధారించారు. కిషన్ బ్యాంకు ఖాతాలో రూ.1.37 కోట్లు, బ్యాంకు లాకర్లలో కిలోకు పైగా బంగారం, రెండు కార్లు ఉన్నట్లు తేల్చారు. కిషన్ కూడబెట్టిన ఆస్తుల విలువ బహిరంగ మార్కెట్లో రూ.200 కోట్లపైగానే ఉంటుందని అంచనాకి వచ్చారు. సోదాల అనంతరం ఆయన్ను అరెస్టు చేసి జ్యూడిషియల్ రిమాండ్కు తరలించారు.

10 నెలల వ్యవధిలో ఇద్దరు

జిల్లా స్థాయి అధికారులపై ఎసిబి కేసులు ప్రజల ప్రాణాలకు, రహదారి భద్రతకు అత్యంత కీలకమైన రవాణాశాఖలో యథేచ్చగా అవినీతి దండా సాగుతోంది. 10 నెలల వ్యవధిలో ఇద్దరు జిల్లా స్థాయి అధికారులపై ఏసీబీ కేసులు నమోదవడం అవినీతి తీవ్రతకు అద్దం పడుతోంది. డ్రైవింగ్ లైసెన్స్, బండి రిజిస్ట్రేషన్, యాజమాన్య బదిలీ, వాహనం ఫిట్నెస్ ఇలా ఏ పనికావాలన్న రవాణాశాఖ కార్యాలయాల్లో అధికారిక ఛార్జీలతో పాటు అదనంగా ఇవ్వాల్సిందే. ప్రతి సేవకి, ఫైల్కి ఒక రేటు ఉంటుంది. ఆ మేరకు కోడ్ ఉంటుంది. అందులో ఏజెంట్ ఎవరు, వచ్చే లంచం ఎంతన్న వివరాలుంటాయి. కోడ్ ఉన్న దరఖాస్తులైతే నిమిషాల్లో పనైపోతుంది. ఏజెంట్ ద్వారా కాకుండా నేరుగా వెళ్లే సిబ్బంది కొర్రీలపై కొర్రీలు వేస్తూ రోజుల తరబడి తిప్పించుకుంటారు. ఈ అక్రమాల్లో జూనియర్, సీనియర్ అసిస్టెంట్లు, ముఖ్యంగా అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్లు కీలకపాత్ర పోషిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. లంచాలు డిమాండ్ చేసే ప్రభుత్వ అధికారులపై వాట్సప్ నెంబర్ 9440446106 కు ప్రజలు ఫిర్యాదు చేయాలని ఏసీబీ అధికారులు సూచించారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

acb raids ACB searches Telangana disproportionate assets case Mahabubnagar DTC Kishan Telangana ACB transport department corruption

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.