📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

బంగారం ఆగడం లేదు, వెండి తొమ్మిది రోజుల్లో షాక్ పెరుగుదల! పార్టీ ఫిరాయింపుల కేసు.. స్పీకర్‌కు సుప్రీంకోర్టు నోటీసులు కొత్త లేబర్ కోడ్స్ ఎఫెక్ట్.. కార్పోరేట్ రంగం విలవిల అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌.. పతంగి ఎగురవేసిన ప్రధాని మోదీ నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ బంగారం ఆగడం లేదు, వెండి తొమ్మిది రోజుల్లో షాక్ పెరుగుదల! పార్టీ ఫిరాయింపుల కేసు.. స్పీకర్‌కు సుప్రీంకోర్టు నోటీసులు కొత్త లేబర్ కోడ్స్ ఎఫెక్ట్.. కార్పోరేట్ రంగం విలవిల అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌.. పతంగి ఎగురవేసిన ప్రధాని మోదీ నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్

Drugs: పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చే మత్తు పదార్థాలపై స్పెషల్ డ్రైవ్

Author Icon By Sharanya
Updated: August 2, 2025 • 3:39 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

హైదరాబాద్: ఎన్డీపీఎస్(నార్కోటిక్, డ్రగ్స్, సైకోట్రోఫిక్) పదార్ధాలపై ఏక్సైజ్ శాఖ అధికారులు మూడు రోజులు పాటు (శని, ఆది, సోమవారాల్లో) స్పెషల్ డ్రైవ్ (Special drive) నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా రోడ్లుపై తనిఖీలు, రైళ్లలో చెకింగ్లు నిర్వహించనున్నారు. డ్రగ్స్ (Drugs) ని గమ్యానికి చేర్చడానికి అక్రమార్కులు అనేక రకాల మార్గాలను అన్వేషిస్తుంటారు.

ఎక్సైజ్ శాఖ నిఘా

ఏ దారిలో వెళితే పోలీసులకు, ఎక్సైజ్తో పాటు నిఘా సంస్థలకు పట్టుబడకుండ చేరుకోవాలని కొత్త కొత్త పద్దతులను పాటిస్తూ ఉంటారు. అక్రమంగా రవాణ అవుతున్న గంజాయి, డ్రగ్స్ (Drugs) ను పట్టు కోవడానికి ఎత్తులకు పై ఎత్తులు వేసి అక్రమార్కుల ఆటలను కట్టించడానికి ఎక్సైజ్ శాఖ టీమ్ లు పోటీ పడుతుంటారు. ఎవరిదిపై పై చేయి అయితే వారి పంట పండినట్లవు తుంది. ఎక్సైజ్ శాఖ ఎన్ఫోర్స్ మెంట్ డెరెక్టర్ షాన్వాజ్ ఖాసీం (Shahnaz Qasim) ఇప్పటికే పలు రకాల స్పెషల్ డెవ్స్ చేపట్టి అక్రమ రవాణదారుల భరతం పట్టారు. ఈ సారి మరో అడుగు ముందుకు వేసి ఎన్ఫోర్స్మెంట్ డెరెక్టర్ కొత్త తరహాలో తనిఖీలు, దాడులు చేపట్టడానికి మూడు రోజుల పాటు వినూత్న రీతిలో చర్యలకు ఆదేశాలిచ్చారు.

ఏఓబీ ( ఆంధ్రా ఒరిస్సా బార్డర్) గంజాయిని రవాణను అడుకోవడానికి డానికి ప్రణాళిక విడుదల చేశారు. ఏఓబీ భద్రాచలం టూ హై దరాబాద్ రోడ్డు, ఏఓబీ భద్రాచలం వయా మహబూబాబాద్ వయా హైదరాబాద్. ఏఓబీ విజయవాడ టూ హైదరాబాద్ వయా సూర్యపేట, ఏఓ బీ భూపాల పట్నం.. చెన్నూరు, నాగపూర్, ఏఓబీ భూపాలపట్నం ఏటూర్ నాగారం. ఈ మార్గాలను కలిపే చెన్నూర్, మంచిర్యాల, రామగుండం, మెట్పల్లి, ఆర్మూర్, కలకత్తా, విశాఖపట్నం, హైదరాబాద్ మార్గాల్లో ఉన్న రైలు, బస్సు మార్గాల్లో వాహనాల తనిఖీలను చేపట్టనున్నారు. వీటితోపాటు కర్ణాటక, గోవా, కేరళ, మహారాష్ట్ర ప్రధాన రహదారుల్లో స్పెషల్ డెవ్లుచేపట్టనున్నారు. రాత్రులు, పగళ్లు ఎలాంటి విరామం లేకుండా తెలంగాణ వ్యాప్తంగా స్టేట్ టాస్క్ ఫోర్స్ టీమ్లు, ఏసీ ఎన్ఫోర్స్ మెంట్ టీమ్లు, జి ల్లా టాస్క్ఫోర్స్ టీమ్లు ఈ రోడ్లకు అనుసంధానంగా ఉండే ఎక్సైజ్ స్టేషన్ల సిబ్బంది కలిసి దాడులు నిర్వహించనున్నారు. ఆగస్టు 2,3,4 తేదీల్లో ఈ స్పెషల్ డెవ్లో టీమ్లు పాల్గొని దాడులు, తనిఖీలు చేపట్టాలని ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టర్ ఆదేశించారు.

Read hindi news: hindi.vaartha.com

read also:

https://vaartha.com/acb-cracks-down-on-corruption-in-telangana/telangana/524876/

Breaking News Drugs Excise Illegal Substances latest news Narcotics Police Raid Special Drive Telugu News Youth Safety

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.