📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

తెలంగాణలో కొత్త హైకోర్టు లింకులు పంపి దోచేస్తున్న కేడీలు తెలంగాణలో పెరుగుతున్న చలి గురుకులాల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల ఐపీఎల్‌కు కరీంనగర్ యువకుడు ఎంపిక సిర్పూర్‌-యు అటవీ ప్రాంతంలో భారీ ఆపరేషన్.. తెలంగాణ సెకండియర్ పరీక్ష తేదీలో మార్పు నేడు, రేపు స్కూళ్లకు సెలవు తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త ఈ నెల 22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్ తెలంగాణలో కొత్త హైకోర్టు లింకులు పంపి దోచేస్తున్న కేడీలు తెలంగాణలో పెరుగుతున్న చలి గురుకులాల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల ఐపీఎల్‌కు కరీంనగర్ యువకుడు ఎంపిక సిర్పూర్‌-యు అటవీ ప్రాంతంలో భారీ ఆపరేషన్.. తెలంగాణ సెకండియర్ పరీక్ష తేదీలో మార్పు నేడు, రేపు స్కూళ్లకు సెలవు తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త ఈ నెల 22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్

Drugs: పబ్ లలో ఆగని డ్రగ్స్ దందాలు..

Author Icon By Sharanya
Updated: July 14, 2025 • 12:16 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

వరుసగా పట్టుబడుతున్న స్మగ్లర్లు, వినియోగదారులు

హైదరాబాద్: గ్రేటర్ పరిధిలో డ్రగ్స్ దందాలు ఆగడం లేదు. పబ్లలో మాదకద్రవ్యాల (Drugs in pubs) వాడకంపై సర్కారు ఓవైపు కఠినంగా వున్నా మరోవైపు స్మగ్లర్ల ఆగడాలు యధేచ్చగా కొనసాగుతూనే వున్నాయి. పోలీసులు, ఈగల్ బృందం, అబ్కారీ అధికారులు దాడులు చేసిన సందర్భాలు మినహాయించి మిగతా వేళల్లో నిర్వాహకులది ఆడింది ఆట పాడింది పాట అన్నట్లుగా వుంది. శివార్లలోని కొంపల్లిలో ఓ రెస్టారెంట్లో డ్రగ్స్ (Drugs) తో పట్టుబడ్డ స్మగ్లర్లు నగరంలోని అనేక పబ్లకు సరఫరాదారులు కావడం పోలీసులను విస్మయపరిచింది.

పబ్ లలో యువకుల దందాలు

పబ్లు.. కొన్నేళ్లుగా వీటి గురించి నిత్యం వార్తలు వస్తున్నాయి. విశ్వనగరంగా హైదరాబాద్ రూపాంతరం చెందుతున్న తరుణంలో ఆధునిక పోకడలు అలవరచుకున్న కొందరు యువతీ యువకులు పబ్లకు రావడం మద్యం తాగడం, ఆహారం తీసుకోవడం, సంగీతాన్ని ఆస్వాధించడం ఆనవాయితీగా మారింది. ఇంతవరకు బాగానే వున్నా కొన్ని పబ్లలో అసాంఘీక చర్యలు (Unsocial activities in pubs) వెలుగు చూస్తుండడం పోలీసులతో పాటు సర్కారుకు కూడా తలనొప్పి వ్యవహారంగా మారిందని చెప్పాలి. పబ్లలో వచ్చే యువతకు హుషారు ఇచ్చేందుకు వీనులవిందైన సంగీతం ఏర్పాటు చేస్తుంటారు. అయితే ఇందులో పాటలు పాడే కొందరు యువతుల వేషధారణ అశ్లీలంగా వుండడం, వీరిని మద్యం సేవించిన కొందరు అసభ్యకరంగా తాకుతుండడం, ఈ సందర్భంగా కొన్నిసార్లు గొడవలు జరుగుతుండడం సాధారణంగా మారుతోంది. ఈ తరహా ఘటనలు గతంలో బేగంపేట్ ప్రాంతంలో గల రెండు పబ్లలో వెలుగు చూశాయి. పబ్లలో పాటలు పాడిన అమ్మాయిలను కిడ్నాప్ చేసేందుకు కొందరు యత్నించిన – ఘటనలు కూడా జరిగాయి. ఇక పబ్లకు వచ్చే – జంటలలో కొందరు కూడా అశ్లీల దుస్తులతో రావడం – అనేకసార్లు గొడవలకు దారితీస్తోంది. గచ్చిబౌలిలో ఓ ప్రముఖ గాయకుడు తన స్నేహితురాలితో కలిసి – కొంతమేర అసభ్యంగా వుండే దుస్తులతో రావడం, ఈ – సందర్భంగా అక్కడ వున్న కొందరు యువకులు సదరు యువతితో ఆ సభ్యంగా ప్రవర్తించడంతో గొడవ జరిగింది.

దీంతో ఆ గాయకుడు తన స్నేహితురాలితో అసభ్యంగా ప్రవర్తించిన వారితో గొడవపడగా వారు ఇతగాడి ని తీవ్రంగా కొట్టారు. దీంతో ఈ వ్యవహారం ఆ పోలీసుల వరకు వెళ్లింది. ఇక మూడేళ్ల క్రితం బేగంపేట్లో లిబ్సన్ పబ్లో లో వెలుగుచూసిన అశ్లీల బాగోతం సంచలనం రేపింది. పాటలు పాడిన అమ్మాయిలు, వారితో పాటు వున్న అబ్బాయిలు ఒళ్లంగా కనిపించే విధంగా చినిగిపోయిన దుస్తులు వేసు కోగా, పబ్లకు వచ్చిన యువకులు కూడా తమ దుస్తులను కొంతమేర చింపుకుని మరీ తప్పతాగి మద్యం మత్తులో 5 అమ్మాయిలతో కలిసి చిందులు వేశారు. దీనిపై పక్కా సమాచారం అందుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు అర్థరాత్రి వేళ దాడులు చేసి అందరిని అరెస్టు చేసి కటకటాల్లో నెట్టారు. దీం తో ఆ పబ్ను మూసివేశారు. ఇక వివిఐపిలు వుండే బంజారాహిల్స్ లో గల ఫుడింగ్ అండ్ మింక్ పబ్లో వెలుగుచూసిన డ్రగ్స్ (Drugs) బాగోతం అందరికి తెలిసిందే. 24 గంటల పాటు హోటల్ కోసం అనుమతులు తీసుకుని దానిని పబ్ కోసం వాడుకున్న నిర్వాహకులు చివరకు మాదకద్రవ్యాలను సర ఫరా చేసేవరకు వెళ్లారు. ఈ పబ్కు వచ్చేవారు అంతా బడాబాబుల పిల్లలే అవడంతో వీరికోసం రహస్యంగా డ్రగ్స్్ను సరఫరా చేయసాగారు. వారాం తరాల్లో కొకైన్ సహా ఇంకొన్ని రకాల మాదకద్రవ్యాలను కోరుకున్న వారికి అందించసాగారు.

టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు

దీనిపైనా పక్కాగా వ్యవహరించిన టాస్క్ ఫోర్స్ పోలీసు లు తెల్లవారుజామున రెండున్నర గంటల సమయంలో దాడులు చేసి గోల్మాల్ వ్యవహారాన్నిరట్టు చేశారు. ఈ సందర్బంగా ఐదు గ్రాముల కొకైన్ ను జప్తు చేసి ఇద్దరిని అరెస్టు చేశారు. ఇక తాజాగా కొంపల్లిలో ఓ రెస్టారెంట్లో కొందరు డ్రగ్స్ తో పట్టుబడడం సంచలనం రేపింది. వీరంతా నగర Oలోని పలు పబ్ నిర్వాహకులకు డ్రగ్స్ సరఫరాదారులుగా తేలడంతో ఈగల్ బృందం షాక్కు గురయ్యింది. దీనిపై వెంటనే రంగంలో దిగి ఏఏ పబ్ లకు డ్రగ్స్ సరఫరా అవుతుందనే దానిపై ఆరా తీస్తున్నారు. రెండు మూడు రోజుల్లో దీనికి సంబంధించి ఇంకొందరు అరెస్టయ్యే వీలుంది. తాజాగా ఆదివారం నాడు రాయదుర్గం పరిధిలో ఓ పబ్లో డ్రగ్స్ సేవించి ఒకతను దొరికిపోయాడు. ఇదే సమయంలో గంజాయి కోసం వచ్చిన మరో 14 మంది పట్టుబడ్డారు. కాగా గ్రేటర్ పరిధిలో 30కి పైగా పబ్లు వుండగా మెజారిటీ వాటిల్లో అక్రమాలు జరుగున్నాయని పోలీసులకు పక్కా సమాచారం వుంది. అయితే ఆయా ప్రాంతాల పోలీసులు అనేకానేక కారణాల వల్ల మౌనంగా వుంటున్నారని బలమైన ఆరోపణలు వున్నాయి. ఇలా ఎందు కు జరుగుతుందనే దానికి స మాధానం కరువయ్యింది. చాలా వరకు పబ్లలో వారంతరాలలో డ్రగ్స్ సరఫరా అవుతుందని పోలీసులకు సమాచారం వుంది. ఇక పబ్లలో జరుగు తున్న మరో న్యూసెన్స్ పబ్లు మూసివేసిన తరువాత వీటి నుంచి బయటకు వస్తున్న వారు ఆయా ప్రాంతాల్లోని రహదారులపై చేసే అడ్డగోలు హంగామా. మద్యం మత్తులో వున్న వారు వాహనాలు నడిపేందుకు వీల్లేకున్నా చాలా మంది తమ కార్లను లేదా ద్విచక్ర వాహనాలను ఇష్టారీతిన నడుపుతూ అర్థరాత్రి వేళ విపరీతమైన సౌండ్ తో హారన్ మోగిస్తూ అక్కడి ప్రజలకు నిద్రలేకుండా చేస్తున్నారు. దీనిపై బం జారాహిల్స్, జూబ్లీహిల్స్, మాదాపూర్ ప్రాంతాల లోని బస్తీల ప్రజలు పలుమార్లు పోలీసులకు ఫిర్యాదులు కూడా చేశారు.. కొన్నిసార్లు మద్యం మ త్తులో వాహ నాలు నడుపుతూ అల్లరి చేస్తున్న వారిని నిలదీసిన ఉదం తాలు కూడా వున్నాయి. మొత్తంమీద పబ్ల వల్ల జరుగు తున్న అనర్థాలు, గోల్మాల్ వ్యవహారాలు అనేకం వున్నా యనడంలో అతిశయోక్తిలేదు. ఈ విషయంలో సర్కారు పూర్తిగా కట్టుదిట్టంగా ఉండాల్సిన అవసరం వుంది. ఎప్పుడైనా ఏదైనా హల్ చల్ జరిగినపుడు సమావేశాలు నిర్వహించి, మిగతా సమయాలలో చూసీచూడకుండా సర్కారుకు చెడ్డపేరు రావడం ఖాయంగా చెప్పాలి .

Read hindi news: hindi.vaartha.com

Read also: Dhoopa Deepa Naivedya Scheme: ధూపదీప నైవేద్య పథకం పోస్టులకు భారీ దరఖాస్తులు

Breaking News Drugs in pubs Telangana Hyderabad drug racket Hyderabad police drugs crackdown latest news pubs drug issue Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.