📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

తెలంగాణలో పలువురు ఐఎఎస్ ల బదలీలు న్యూ ఇయర్ వేళ.. ప్రజలకు సీపీ సజ్జనార్‌ హెచ్చరికలు ట్రాన్స్ జెండర్లకు రూ.75వేల సాయం యూరియాకు ప్రత్యేక అధికారులు భారీగా పెరిగిన కూరగాయల ధరలు హైదరాబాద్‌లో ప్లాస్టిక్‌ బ్యాన్ రైడ్ క్యాన్సిల్ చేస్తే భారీ జరిమానా ఈరోజు నుంచి అందుబాటులోకి టెట్ హాల్ టికెట్లు మై జీహెచ్‌ఎంసీ యాప్‌లో కీలక మార్పులు రైతు భరోసా 15 లక్షల ఎకరాలకు బంద్ తెలంగాణలో పలువురు ఐఎఎస్ ల బదలీలు న్యూ ఇయర్ వేళ.. ప్రజలకు సీపీ సజ్జనార్‌ హెచ్చరికలు ట్రాన్స్ జెండర్లకు రూ.75వేల సాయం యూరియాకు ప్రత్యేక అధికారులు భారీగా పెరిగిన కూరగాయల ధరలు హైదరాబాద్‌లో ప్లాస్టిక్‌ బ్యాన్ రైడ్ క్యాన్సిల్ చేస్తే భారీ జరిమానా ఈరోజు నుంచి అందుబాటులోకి టెట్ హాల్ టికెట్లు మై జీహెచ్‌ఎంసీ యాప్‌లో కీలక మార్పులు రైతు భరోసా 15 లక్షల ఎకరాలకు బంద్

Drug Racket : హైదరాబాద్ పబ్‌లలో మరోసారి డ్రగ్స్ కలకలం

Author Icon By Sudheer
Updated: July 10, 2025 • 12:59 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

రెండు తెలుగు రాష్ట్రాల్లో రోజు రోజుకు డ్రగ్స్ కేసులు (Drug ) పెరుగుతూ ఉండటంతో ప్రజల్లో ఆందోళన నెలకొంది. ముఖ్యంగా ఆశ్చర్యం కలిగిస్తున్నది ఏమిటంటే.. డ్రగ్స్ కేసుల్లో ఆరోగ్య రక్షణకు పాఠాలు చెప్పే డాక్టర్లు కూడా చిక్కుకుంటున్నారు. హైదరాబాద్‌లోని కొంపల్లిలో మల్నాడు రెస్టారెంట్ ఆధారంగా డ్రగ్స్ సరఫరా జరగుతున్నట్టు గుర్తించిన పోలీసులు, రెస్టారెంట్ యజమాని సూర్యను అరెస్టు చేశారు. అతని ద్వారా ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ ప్రసన్న సహా 23 మంది వ్యాపారవేత్తలు డ్రగ్స్ కొనుగోలు చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఈ కేసులో పబ్‌ యజమానులు కూడా నిందితులుగా చేర్చబడ్డారు.

విశాఖలోనూ డ్రగ్స్ ముఠా బహిర్గతం – డాక్టర్ చైతన్య అరెస్టు

విశాఖపట్నం(Vizag)లో కూడా డ్రగ్స్ కేసులో ఒక డాక్టర్ అరెస్టు కావడం తీవ్ర సంచలనం రేపుతోంది. కూర్మన్నపాలెం ఏ ప్లస్ హాస్పిటల్ సీఈవోగా పనిచేస్తున్న డాక్టర్ కమ్మెళ్ల కృష్ణ చైతన్య వర్మ డ్రగ్స్ మాఫియాతో సంబంధాలు పెట్టుకొని, రూ.60 వేలు వెచ్చించి కొకెయిన్ కొనుగోలు చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. ఇప్పటికే ఈ కేసులో ముగ్గురు అరెస్టయ్యారు. డాక్టర్‌తో పాటు థామస్, అక్షయ్‌లను అదుపులోకి తీసుకున్నారు. మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నారు. 25 గ్రాముల కొకైన్, రూ.3.6 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. డాక్టర్ లాంటి వ్యక్తి ఇలా వ్యసనానికి బానిసవుతుండటం బాధాకరం.

డాక్టర్ నమ్రత డ్రగ్స్ కేసు

ఇక హైదరాబాద్‌లో డాక్టర్ నమ్రత చిగురుపాటి కేసు మరొక ఉదాహరణ. రెండేళ్లుగా డ్రగ్స్ తీసుకుంటున్న ఈ డాక్టర్ స్పెయిన్‌లో చదువుకునే సమయంలో వ్యసనానికి బానిసయ్యారు. భారత్‌కు వచ్చిన తర్వాత స్థానిక డీజేల ద్వారా ముంబయికి చెందిన డ్రగ్స్ డాన్ వన్ష్ థక్కర్‌ను పరిచయం చేసుకున్నారు. డ్రగ్స్ సరఫరాకు బాలకృష్ణ అనే వ్యక్తిని ఉపయోగించేవారు. ఈ కేసులో కూడా ఆమెను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. విచారణలో ఆమె త‌న స్నేహితుడి ద్వారా డ్రగ్స్ కొనుగోలు చేస్తున్నట్టు వెల్లడించారు. ఈ కేసులు చూస్తే, విద్యావంతులు, వైద్యులు కూడా మాదక ద్రవ్యాల వలలో పడుతూ సమాజానికి అపాయకరంగా మారుతున్న దృశ్యం స్పష్టంగా తెలుస్తోంది. డ్రగ్స్ వ్యసనంపై ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది.

Read Also : Pawan Kalyan: ఇంటర్ విద్యార్థి బ్యాటరీ సైకిల్ ఆవిష్కరణకు పవన్ ప్రశంసలు

Ap Drug Racket hyderabad Telangana vizag

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.