📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

అభ్యర్థుల మధ్య లొల్లి చైర్ పర్సన్/మేయర్ ఎన్నిక తగ్గిన టమాటా ధరలు నిజామాబాద్, కరీంనగర్లో బిజెపి జెండా! జలమండలి పునర్వ్యవస్థీకరణ తెలంగాణకు శుభవార్త ఎన్నికల పోలింగ్ ఎంతంటే? ముగిసిన మున్సిపల్ పోలింగ్ కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు అభ్యర్థుల మధ్య లొల్లి చైర్ పర్సన్/మేయర్ ఎన్నిక తగ్గిన టమాటా ధరలు నిజామాబాద్, కరీంనగర్లో బిజెపి జెండా! జలమండలి పునర్వ్యవస్థీకరణ తెలంగాణకు శుభవార్త ఎన్నికల పోలింగ్ ఎంతంటే? ముగిసిన మున్సిపల్ పోలింగ్ కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు

Drug Inspector Medak: మెదక్ జిల్లాలో ఫార్మసీలపై నిఘా

Author Icon By Pooja
Updated: March 22, 2026 • 10:30 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Drug Inspector Medak: మెదక్ లోని కొన్ని మెడికల్ ఫార్మసీలలో అనుభవం లేని, అర్హతలేని వ్యక్తుల చేత మందుల విక్రయాలు జరుగుతున్నాయన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఫార్మసీ నిబంధనల ప్రకారం లైసెన్స్ కలిగిన ఫార్మాసిస్ట్ పర్యవేక్షణలోనే మందులు అమ్మాలి. అయితే వాస్తవానికి అనుభవం లేని సిబ్బంది స్వయంగా మందులు ఇస్తున్న ఘటనలు చోటుచేసుకుంటున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా యాంటీబయోటిక్స్ వంటి బలమైన మందులను విక్రయించడం వల్ల ప్రజల ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావం పడే అవకాశం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. తప్పు మందులు ఇవ్వడం, డోసేజీ సరిగా చెప్పకపోవడం వంటి కారణాలతో రోగుల పరిస్థితి మరింత విషమించే ప్రమాదం ఉంది.ఇలాంటి పరిస్థితులను అరికట్టేందుకు డ్రగ్ కంట్రోల్ అధికారులు క్రమం తప్పకుండా తనిఖీలు నిర్వహించి, నిబంధనలు ఉల్లంఘిస్తున్న ఫార్మసీలపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ప్రజల ఆరోగ్యం విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం అనుమతించరాదని, ఫార్మసీలలో నిబంధనలు కచ్చితంగా అమలు చేయాలని కోరుతున్నారు.

Read Also : CM Revanth : రేవంత్ సిద్దిపేట పర్యటనకు హరీశ్ రావు వస్తారా?

Drug Inspector Medak: డ్రగ్స్ జిల్లా అధికారి వివరణ

జిల్లాలోని మెడికల్ ఫార్మసీలపై ప్రత్యేక నిఘా ఉంచినట్లు డ్రగ్స్ జిల్లా అధికారి చంద్రకళ తెలిపారు. ఔషధాల విక్రయంలో ఎలాంటి నిర్లక్ష్యం సహించబోమని ఆమె తెలిపారు. ఫార్మసీల్లో అర్హత కలిగిన ఫార్మాసిస్టుల ద్వారానే మందులు విక్రయించాలని, నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు. అర్హత లేని వ్యక్తుల చేత మందుల విక్రయం జరిగితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు..ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని తనిఖీలు మరింత కఠినంగా కొనసాగిస్తామని తెలిపారు. అలాగే, నిబంధనలు ఉల్లంఘించే ఫార్మసీలపై చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

Drug Control Department Telangana Drug Inspector Chandrakala Medak Fake Pharmacists Issues Medak District Health News Medak Medical Shops News Medical Store Raids Telangana Prescription Rules India Public Health Safety Medak Unqualified Pharmacists Medak

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.