📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

Breaking News – Chevella Bus Accident : డ్రైవర్ కు ఎలాంటి ఆక్సిడెంట్ రికార్డు లేదు – TGSRTC క్లారిటీ

Author Icon By Sudheer
Updated: November 3, 2025 • 11:20 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

చేవెళ్ల సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) కీలక ప్రకటన విడుదల చేసింది. ప్రాథమిక విచారణ ప్రకారం ఆర్టీసీ బస్సు డ్రైవర్‌కు ఎలాంటి గత ప్రమాద రికార్డు లేదని సంస్థ వెల్లడించింది. బస్సు డ్రైవర్ అనుభవజ్ఞుడని, సురక్షిత డ్రైవింగ్‌ నిబంధనలను కచ్చితంగా పాటించే వ్యక్తిగా రికార్డుల్లో ఉన్నారని అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రమాదానికి బస్సు డ్రైవర్ లేదా ఆర్టీసీ వాహనం కారణం కాదని స్పష్టమైందని రవాణా సంస్థ వివరించింది. ఈ సంఘటనపై సోషల్ మీడియాలో వస్తున్న కొన్ని అపోహలను ఖండిస్తూ RTC స్పష్టతనిచ్చింది.

Latest News: Bangalore: బెంగళూరులో చెత్తపై కఠిన చర్యలు – ఫోటో పంపితే నగదు బహుమతి

వివరాల్లోకి వెళ్తే ..చేవెళ్ల మలుపు వద్ద ఆర్టీసీ బస్సు సజావుగా వెళ్తుండగా, ఎదురుగా వచ్చిన టిప్పర్ లారీ అధిక వేగంతో దూసుకువచ్చి నియంత్రణ కోల్పోయినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. టిప్పర్ బస్సును ఢీకొట్టడంతో రెండు వాహనాలు బోల్తా పడి ప్రమాదం సంభవించిందని RTC అధికారులు పేర్కొన్నారు. రోడ్డు ఇరుకుగా ఉండడం, తగిన డివైడర్ లేకపోవడం కూడా ప్రమాద తీవ్రత పెరగడానికి కారణమని తెలిపారు. ఈ ఘటనలో ప్రాణనష్టం జరగడం పట్ల రవాణా సంస్థ తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ, బాధిత కుటుంబాలకు తగిన సాయం అందించేందుకు చర్యలు ప్రారంభించినట్లు తెలిపింది.

Chevella Accident

TGSRTC అధికారులు భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా తగిన భద్రతా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ప్రమాదం జరిగిన ప్రాంతంలో రోడ్డు వెడల్పు, సిగ్నలింగ్ వ్యవస్థ, హెచ్చరిక బోర్డులు వంటి అంశాలను పరిశీలించి అవసరమైతే రహదారి అభివృద్ధి కోసం ప్రభుత్వానికి నివేదిక అందజేయనున్నట్లు చెప్పారు. డ్రైవర్లకు అదనపు భద్రతా శిక్షణ, స్పీడ్ కంట్రోల్ పరికరాల అమలు వంటి చర్యలు వేగవంతం చేయనున్నామని సంస్థ ప్రకటించింది. “ప్రజల ప్రాణాలు మా ప్రాధాన్యం. RTC ఎల్లప్పుడూ సురక్షిత ప్రయాణానికి కట్టుబడి ఉంటుంది” అని అధికారులు పునరుద్ఘాటించారు.

Read hindi news: https://hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Chevella bus accident Chevella Bus Accident diriver Google News in Telugu TGSRTC

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.