📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రేపే పిఎస్ఎల్వి-సి62 ప్రయోగానికి కౌంటౌన్ సర్కారీ ఉద్యోగులకు1.02 కోట్ల ప్రమాద బీమా త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటన.. నిరుద్యోగులకు భరోసా ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం మీర్జాగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు విద్యార్థులు మృతి కొత్తగా యూరియా కార్డు డాక్టర్ లావణ్య ఆత్మహత్య కేసులో బిగ్ ట్విస్ట్ 15 లక్షల మందికి ఇందిరమ్మ చీరల పంపిణీ రిపబ్లిక్ డే పరేడ్‌లో ‘ఒగ్గుడోలు’ ప్రదర్శన మహబూబ్‌నగర్‌లో భూకంపం..జనం భయంతో బయటకు రేపే పిఎస్ఎల్వి-సి62 ప్రయోగానికి కౌంటౌన్ సర్కారీ ఉద్యోగులకు1.02 కోట్ల ప్రమాద బీమా త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటన.. నిరుద్యోగులకు భరోసా ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం మీర్జాగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు విద్యార్థులు మృతి కొత్తగా యూరియా కార్డు డాక్టర్ లావణ్య ఆత్మహత్య కేసులో బిగ్ ట్విస్ట్ 15 లక్షల మందికి ఇందిరమ్మ చీరల పంపిణీ రిపబ్లిక్ డే పరేడ్‌లో ‘ఒగ్గుడోలు’ ప్రదర్శన మహబూబ్‌నగర్‌లో భూకంపం..జనం భయంతో బయటకు

Double Bedroom Houses : డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళలో ఉండని వారికి నోటీసులు!

Author Icon By Shravan
Updated: July 30, 2025 • 3:41 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

హైదరాబాద్ :  తెలంగాణలో డబుల్ బెడ్రూం ఇళ్ల (Double Bedroom House) లబ్దిదారులకు కాంగ్రెస్ ప్రభుత్వం షాక్ ఇవ్వనుంది. ఇళ్లు పొంది నివాసం ఉండని వారి కేటాయింపులు రద్దు చేయాలని యోచిస్తోంది. దాదాపు 37 శాతం మంది లబ్దిదారులు ఇళ్లలో ఉండటం లేదు. నగరం వెలుపల ఉపాధి లేక కొందరు ఆసక్తి చూపడం లేదు. గ్రేటర్ హైదరాబాద్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంతో పాటు, ఖాళీ ఇళ్ల కేటాయింపులు రద్దు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మీకోసం.. డబుల్ బెడ్రూం ఇళ్లు పొందిన లబ్దిదారులకు తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం భారీ షాక్ ఇచ్చేందుకు రెడీ అవుతోంది. ఇప్పటికే డబుల్ బెడ్రూం ఇల్లు అద్దెకు ఇచ్చిన వారిపై చర్యలకు సిద్ధమైన సర్కార్.. ఇప్పుడు మరో కీలక నిర్ణయం తీసుకో బోతుంది. డబుల్ బెడ్రూం ఇళ్లు తీసుకుని దానిలో నివాసం ఉండని వారిపై ప్రభుత్వం చర్యలకు సిద్ధమయ్యిందని సమాచారం, డబుల్ ఇళ్లు పొందిన తర్వాత దానిలో నివాసం ఉండని వారి ఇళ్లు రద్దు చేసేందుకు ప్రభుత్వం రెడీ అవుతోంది.

డబుల్ బెడ్రూం ఇళ్లు పొంది వాటిల్లో నివాసం ఉండకుండా.. ఖాళీగా ఉంటున్న ఇళ్లను రద్దు చేయాలని ప్రభుత్వ విభాగాలు భావిస్తున్నాయి. అర్హులైన లబ్దిదారులకు ఇళ్లు కేటాయించి రెండు సవంత్సరాలు కావొస్తున్నా ఇప్పటికీ దాదాపు 37 శాతం ఇళ్లలో లబ్దిదారులు నివాసం ఉండటం లేదని అధికారుల దృష్టికి వచ్చింది. వీరిలో కొందరికి అప్పటికే సొంతిళ్లు ఉండటంతో వారు డబుల్ బెడ్రూం ఇళ్లలో నివాసం ఉండటం లేదు.

ఇక మరికొందరికేమో నగర శివారు ప్రాంతాల్లో ఇళ్లు వచ్చాయి. దీంతో అక్కడకు వెళితే ఉపాధి లభిస్తుందో లేదోనని కొందరు లబ్దిదారులు.. వారికి కేటాయించిన డబుల్ బెడ్రూం ఇళ్లలో నివాసం ఉండటానికి ఆసక్తి చూపడం లేదని సమాచారం. గ్రేటర్ హైదరాబాద్లో ఇందిరమ్మ ఇళ్లు నిర్మించాలని ప్రభుత్వం భావిస్తోంది. దీనిపై ఇటీవల నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఈ విషయం చర్చకు వచ్చినట్టు సమాచారం.

ఈక్రమంలో అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. లబ్దిదారులకు ఇళ్లు ఇచ్చినప్పటికీ వారు వాటిల్లో ఉండటం లేదని.. అలాంటి వారి ఇళ్లను గుర్తించి కేటాయింపు రద్దు చేయాలని ప్రభుత్వం సూచించినట్టు తెలిసింది. ఇందుకు సంబంధించి చర్యలు ప్రారంభించాలని హైదరాబాద్, దాని పరిసర జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీ అయ్యాయి. ఇప్పటికే కొందరు లబ్దిదారులకు మొదటి విడత నోటిసుల జారీ చేసినట్టు రెవెన్యూ విభాగం వర్గాలు చెబుతున్నాయి. నిర్ణీత గడువులోగా ఇళ్లలోకి వెళ్లకపోతే కేటాయింపు రద్దు చేస్తామని నోటీసుల్లో పేర్కొంటున్నారు.

ఇక డబుల్ బెడ్రూం ఇళ్లకు (Double Bedroom Houses) ఎంపికైన లబ్దిదారుల్లో చాలా మంది రోజూవారీ కూలి పని చేసుకునే వారు.. ఇళ్లలో పని చేసుకునే వారే ఉన్నారు. వీరికి శివారు ప్రాంతాల్లో ఇళ్లను కేటాయించడంతో.. నగరం విడిచి వెళితే ఉపాధి దొరకదనే ఆందోళనతో ఆ ఇళ్లలో ఉండటం లేదు. అలానే డబుల్ ఇళ్లను అద్దెకివ్వడం, అమ్మడమూ నిబంధనల ఉల్లంఘన కిందకు వస్తుందని, కేటాయింపులనూ రద్దు చేసే విషయాన్ని పరిశీలిస్తున్నట్లు అధికారులు తెలిపారు.

Read Hindi News : hindi.vaartha.com

Read also : Transport : మహిళల ఉచిత బస్సు సౌకర్యంలో భద్రతకు ప్రాధాన్యం

Breaking News in Telugu Double Bedroom Housing Eviction Alert Housing Notice Latest News in Telugu telangana government Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.